(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ బిజినెస్ పార్టనర్, భారత సంతతికి చెందిన దినేష్ చావ్లా అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దినేష్ చావ్లా అమెరికాలోని చావ్లా హోటల్స్ సీఈవో. గతంలో దినేష్ చావ్లాతో కలిసి డోనాల్డ్ ట్రంప్.. హోటల్స్ బిజినెస్‌లో పార్టనర్‌గా వ్యవహరించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల మెమ్ఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సూట్ కేసులను దినేష్ చావ్లా దొంగిలించాడు. వాటిని ఎవరికీ తెలియకుండా తీసుకొని వచ్చి తన కారులో పెట్టుకున్నాడు. దీంతో ఎయిర్ పోర్ట్ పోలీసులు చావ్లా కారును తనిఖీలు చేశారు. కారులో లభించిన సూట్ కేసులను స్వాధీనం చేసుకొని చావ్లాను అదుపులోకి తీసుకున్నారు. చావ్లా దొంగలించిన సూట్ కేసుల విలువ 4 వేల డాలర్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. చావ్లా గతంలోనూ చాలా సార్లు ఇలా దొంగతనం చేశాడని వెల్లడించారు. అయితే, తాను కేవలం థ్రిల్ కోసమే దొంగతనం చేశానని చావ్లా చెప్పడం గమనార్హం.