కాన్పూర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రలు కాన్పూర్ ఎయిర్పోర్టులో పరస్పరం ఎదురుపడ్డారు.
రన్వే నుండి రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ ఒకరి భుజంపై మరొకరు చెయ్యివేసి అన్న చెల్లెళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతీకగా నడుచుకుంటూ రావడాన్ని కాంగ్రెస్ నేతలు వీడియో, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో వేలాది మంది అభిమానులు వీటిని లైక్ చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ ‘నిజానికి మంచి అన్న అంటే ఏమిటో తెలుసా? దేశమంతా చుట్టి రావడానికి, పెద్ద పెద్ద దూరాలకు వెళ్లడానికి నేనేమో చిన్న హెలికాప్టర్ ఉపయోగిస్తున్నాను. అదే ప్రియాంక మాత్రం చిన్న చిన్న దూరాలకు పేద్ద హెలికాప్టర్లో వెళుతోంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సోదరి ప్రియాంక అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా రాహుల్ మరోమారు నవ్వుతూ చెప్పారు.
వీడియో కోసం క్లిక్ చేయండి
https://www.facebook.com/rahulgandhi/videos/602110396936687/