(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీ వేదికగా ఆదివారం బాంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, రోహిత్ శర్మలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డీఆర్ఎస్ల విషయంలో చురుగ్గా ఉండే ధోని స్థానాన్ని పంత్ భర్తీ చేయలేడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా స్పిన్నర్ చహల్ వేసిన పదో ఓవర్లో సౌమ్య సర్కార్ క్రీజులో ఉన్నాడు. చహల్ వేసిన బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్ చేతుల్లో పడింది.
https://twitter.com/MSdhoni7788/status/1191030792006205441
టీమిండియా ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేసినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. డీఆర్ఎస్కు కోరదామా అని రోహిత్ శర్మ చహల్‌ను అడగ్గా స్పష్టంగా చెప్పలేను అని సమాధానం ఇచ్చాడు. కీపర్ పంత్‌ను అడగ్గా.. కచ్చితంగా బ్యాట్‌కు బంతి తగిలిందని చెప్పి రోహిత్‌ను ఒప్పించి డీఆర్ఎస్ కోరాడు. సమీక్షలో సౌమ్య బ్యాట్‌కు బాల్ తగలలేదని స్పష్టంగా తేలడంతో టీమిండియా డీఆర్ఎస్ వృథా అయ్యింది. దీంతో ‘పంత్.. నీ కీపింగ్ ఏంది.. నువ్వు ఏంది’ అని అర్థం వచ్చేలా రోహిత్ శర్మ తలపట్టుకున్నాడు. దీనిపై పంత్ ఏదో చెప్పబోయే ప్రయత్నం చేసినా డీఆర్ఎస్ వృథా కావడం మాత్రం రోహిత్లో అసంతృప్తిని బయటపెట్టింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పుడు రివ్యూతో టీమిండియాకు నష్టం కలిగించినందుకు ట్విటర్ లో రిషభ్ పంత్‌పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.
Dhoni sitting at home and watching Rishabh Pant in today’s match. #INDvBAN pic.twitter.com/HixjQkxIs0
— Pakchikpak Raja Babu (@HaramiParindey) November 3, 2019
#IndvsBan
Rishabh pant trying to replace dhoni be like: pic.twitter.com/XFLOgsFH3Y— _nadaan.parinda_? (@jaypatidar_) November 3, 2019
Seems #RishabhPant 's selection was through EVM..
— Satish Kapur (@SatishKapur4) November 4, 2019
When you have a player like Sanju Samson, Suryakumar yadav and Shubhaman Gill on a bench ,why you only go for #RishabhPant #IndvsBan
— SNOW (@LastBencher_) November 4, 2019
Dear @BCCI bring @IamSanjuSamson in team instead of overrated @RishabhPant17 .. enough is enough.
#IndvsBan #RishabhPant— PRASHANT (@prashantvyas_29) November 4, 2019