NewsOrbit
టాప్ స్టోరీస్

కొత్త అసెంబ్లీపై కేసీఆర్ వ్యూహమేంటి?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తారా? ఒకవేళ నిర్మిస్తే.. ఎక్కడ నిర్మాణం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త అసెంబ్లీ భవన నిర్మాణంకు ఆది నుండి హంసపాదు అన్నట్లుగా ఉంది. మొదట పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అసెంబ్లీ నిర్మాణం చేయాలనుకున్నప్పటికి అందుకు కేంద్రం ఒప్పుకోలేదు. దాంతో ఎర్రమంజిల్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు. జూన్‌లో కేసీఆర్‌ కొత్త అసెంబ్లీకి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భవనాలను కూల్చి వేస్తున్నారు. అయితే దీనికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. గతంలో 294 మందికి ఉపయోగపడిన అసెంబ్లీ ఇప్పుడు ఎందుకు ఉపయోగపడకుండా పోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ నిర్మించొద్దని ఆదేశించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు సమంజసమని పిటిషనర్లు వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్, బీజేపీ వంటి విపక్షాలు విమర్శించాయి.

ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో రూ. 100 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచించింది. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే, హైకోర్టు తీర్పుతో పనులను ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇక పాత అసెంబ్లీ భవనాన్నే తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొత్త అసెంబ్లీని నిర్మించాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్..కొత్త వ్యూహాన్ని ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment