NewsOrbit
Right Side Videos

ఈ పక్షి పేరు లైర్..కూత వినండి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గత నెల 29న ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్ చేశారు. ఒక పక్షి కూత రికార్డు చేసిన ఈ వీడియో తీసేందుకు 19 మంది ఫొటోగ్రాఫర్లు 62 రోజులు కష్టపడ్డారని ఆమె తన పోస్టులో సేర్కొన్నారు. ఆ సమాచారం కరెక్టు కాదని ఆల్ట్‌న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది. ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే పోస్టులలో నిజానిజాలను ఆల్ట్‌న్యూస్ నిర్ధారిస్తూ ఉంటుంది.

కిరణ్ బేడీ ఇదే వీడియోను ఫేస్‌బుక్‌లో కూడా పెట్టారు. దీనిని పరిశోధించిన ఆల్ట్‌న్యూస్ ఈ వీడియోను గతంలో న్యూస్ 18, ఇండియన్ ఎక్స్‌ప్రెస్  కూడా తమ సైట్లలో పోస్టు చేసిన విషయం తెలుసుకున్నది. ఇది ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఆల్ట్‌న్యూస్  మరింత లోతుకు వెళ్లింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ జంతుప్రదర్శనశాలలో ఈ వీడియోను తీసినట్లు ఆల్ట్‌న్యూస్ నిర్ధారించింది. రెండేళ్ల క్రితం తాను ఈ వీడియోను తీసినట్లు మిల్కోస్ నేగీ అనే వ్యక్తి ఆల్ట్‌న్యూస్‌కు చెప్పాడు.

ఈ వీడియోలోని పక్షి పేరు లైర్‌బర్డ్. లైర్ అనేది ఒక యూరోపియన్ వాద్యం. తోక విప్పినపుడు అది లైర్‌ను పోలిఉంటుందని దానికా పేరు వచ్చింది. తప్పుడు సమాచారాన్ని నమ్మి దానిని తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేయడం కిరణ్ బేడీకి అలవాటే. తాము గతంలో కూడా కిరణ్ బేడీ షేర్ చేసే పోస్టుల్లో సమాచారం వాస్తవం కాదని చాలాసార్లు నిర్ధారించామని ఆల్ట్‌న్యూస్  పేర్కొన్నది.

కిరణ్ బేడీ షేర్ చేసినట్లుగా ఈ వీడియో తీయడానికి చాలామంది చాలా రోజులు కష్టపడిన మాట కరెక్టు కాకపోయినా లైర్‌బర్డ్ కూత చాలా విచిత్రంగా ఉంటుంది. తప్పనిసరిగా చూడవలసిన వీడియో ఇది.

ఆల్ట్‌న్యూస్ సౌజన్యంతో 

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment