NewsOrbit
Right Side Videos టాప్ స్టోరీస్

చెంప దెబ్బలకూ టోర్నమెంట్

మాస్కో: బాక్సింగ్,మిక్స్‌‌డ్ మార్షల్ ఆర్ట్స్ వంటి ఫైటింగ్ పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ చెంప దెబ్బలకు కూడా ఒక టోర్నమెంట్ నిర్వహిస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు. వింతగా ఉన్నా ఇది నిజమే.

రష్యాలోని క్రాస్నోయర్స్క్ ప్రాంతంలో ప్రతియేటా వారాంతపు రోజుల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గత వారం 16 ,17 తారీఖుల్లో ఈ పోటీలు జరిగాయి. సైబీరియన్ పవర్ షో స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ టోర్నీని నిర్వహిస్తుంటారు.

టోర్నమెంట్‌లో పాల్గొనాలంటే మన చేతుల్లో బలం, ప్రత్యర్థి కొట్టే చెంప దెబ్బలను తట్టుకునే సామర్థ్యం మనకు ఉంటే చాలు. పెద్దగా కసరత్తు చేయాల్సిన పని ఉండదు.

ఈ చెంప దెబ్బల పోటీలో ఒక్కొక్క పోటీదారుడికి మూడు చాన్సులు ఇస్తారు. ఆ మూడు దెబ్బల్లో అవతలి వ్యక్తిని చెంప దెబ్బలు కొట్టడం ద్వారా మట్టికరిపించాలి.

గేమ్ విధానం:

  • వేదిక మీద ఒక టేబుల్ ఉంటుంది. టేబుల్‌కు ఇరువైపులా పోటీదారులు నిలుచుంటారు. కామెంటేటర్ కమ్ అంపైర్ సమక్షంలో చెరో మూడు దెబ్బలు కొట్టాలి.
  • ఇక్కడ దయాదాక్షిణ్యాలకు చోటు ఉండదు. ఎంత గట్టిగా కొట్ట గలిగితే అంతగా టైటిల్‌కు చేరువ అవుతారు.
  • అంత గట్టిగా దెబ్బలు తిన్నాక చెంపలు కందిపోవటం, దవడలు పగిలిపోవడం సర్వసాదరణం. కాబట్టి పోటీ ముగిసిన వెంటనే డాక్టర్‌తో వైద్యపరీక్షలు చేయించి అవసరమైతే ఉచితంగా చికిత్స అందిస్తారు.
  • ఇక, ఈ టోర్నమెంట్ లో విజేతకు రష్యాన్ కరెన్సీలో 30 వేల రూబుళ్ల బహుమానాన్ని నిర్వాహకులు అందజేస్తారు.

30 వేల రూబుళ్లు అంటే మన దేశీయ కరెన్సీలో 32 వేల రూపాయలు. ఈ ఏడాది జరిగిన పోటీల్లో వాసిలీ కామోట్స్కీ అనే యువకుడు విజేతగా నిలిచాడు.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Leave a Comment