NewsOrbit
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని అన్నారు. కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచిందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదని విమర్శించారు. మంత్రులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అధికారంలేదనీ అంతా జగన్ మయమేననీ అన్నారు. నవరత్నాల హామీల అమలు పూర్తిగా నోచుకోకపోయినా కొంత మేరకు కృషి జరిగిందని అన్నారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని రామకృష్ణ కితాబు ఇచ్చారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అంటూ కొత్త ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొన్నదని అన్నారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు.

ఇసుక పాలసీ అంటూ అయిదు నెలల పాటు ఇసుక సరఫరా ఆపివేయడంతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా కాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందుకు పడుతున్నారని ఆయన అన్నారు.

 

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Leave a Comment