Agent OTT Release: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ దాదాపు థియేటర్లలో విడుదల అయ్యి ఏడాది కావస్తున్నప్పటికీ ఇంకా ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. ఈ స్పై యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ ఓటిటి కొనుగోలు చేసింది. ఏజెంట్ ను ఓటిటిలో రిలీజ్ చేసేందుకు సోనీ లీవ్ పలుమార్లు ప్రయత్నించింది. కానీ నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఉన్న కోర్ట్ గొడవలతో పాటు రీ ఎడిటింగ్ సమస్యల వల్ల ఏజెంట్ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ స్పై మూవీ ఓటిటి రిలీజ్ పై అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ మూవీ ని ఓటీటీలో చూడడం కాలేనని అఖిల్ అభిమానులు ఫిక్స్ అయ్యారు.
తాజాగా అఖిల్ ఏజెంట్ ఓటిటి రిలీజ్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో అఖిల్ అక్కినేని తో పాటు అనిల్ సుంకర ను ట్యాగ్ చేస్తూ ఏజెంట్ ను ఓటీటీలో రిలీజ్ చెయ్యండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆ నెటిజంట్ వీటికి అనిల్ సుంకర రిప్లై ఇచ్చాడు కూడా. ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ కు అమ్మినట్లు ఆయన తెలియజేశాడు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని గుర్తు చేశాడు. అతి త్వరలోనే ఏజెంట్ మూవీ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అనిల్ సుంకర ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఈయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్ సుంకర ట్వీట్ ను బట్టి తొందర్లోనే ఏజెంట్ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుంది. ఏజెంట్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వ్యవహరించాడు. స్పై యాక్షన్ కళతో దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. గత ఏడాది ఏప్రియల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అలా డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ. నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. తెలుగు తో పాటు మలయాళంలో రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రేక్షకులని మెప్పించ లేక పోయింది ఏజెంట్ మూవీ.
ఇక ఈ మూవీకి ఓ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ సురేందర్ రెడ్డి వ్యవహరించారు. ఏజెంట్ మూవీలో మలయాళ అగ్ర హీరో ముమ్మట్టి కీలక పాత్ర పోషించగా డినో మారియా విలన్ గా నటించాడు. ఏజెంట్ మూవీ తో సాక్షి విద్య హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇందులో రిక్కీ అలియా స్ రామకృష్ణ అనే ఏజెంట్ పాత్రలో అఖిల్ పోషించాడు. చైనా తో కలిసి ఇండియాను నాశనం చేసేందుకు గాడ్(డీనో) అనే వ్యక్తి చేస్తున్న కుట్రను మహాదేవ్ (ముమ్మట్టి) సాయంతో రిక్కి ఎలా ఎదుర్కొంటాడు అనే కథనే ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ రానుంది.