జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులాఉండాలని ఎవ్వరు మాత్రం కోరుకోరు..జుట్టు మూడుపొరలుగా వేల కణాల సమూహంతోకలిపి ఉంటుంది. కురులకు తగిన తేమ దొరకనప్పుడు జుట్టు పొడి బారిపోతుంది. దీని వల్ల జుట్టు మెరుపుకోల్పోయి జీవరహితంగా కనబడుతుంది.
ఆడ మరియు మగ వీరికి ఇద్దరికీ వయ్యస్సుతో సంబంధం లేకుండా పొడిజుట్టు ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.జుట్టుకు సరైన పోషకాలు అందనప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు జుట్టు కు హాని జరుగుతుంది. ముఖ్యంగా అతి వేడి ఉపయోగించడం వల్ల పరికరాల ఒత్తిడి వల్ల జుట్టు చివర్లు చీలిపోవడాన్ని జుట్టు చిట్లిపోవడం అంటారు. అస్సలు జుట్టు ఊడిపోవడానికి ఇవే ప్రధాన కారణాలు..
ఇకపోతే పోషకాహారం తీసుకోకపోవడం,హెయిర్ జెల్, వ్యాక్స్ లు స్ప్రేలు ఎక్కువగా వాడడటం, బ్లో డ్రయర్ లు, హాట్ కోంబ్స్ వంటి స్టయిలింగ్ టూల్స్ ఎక్కువగా ఉపయోగించడం, ఎక్కువసార్లు తలస్నానం చేయడం, అధిక కెమికల్ ట్రీట్ మెంట్స్, క్రమం గా జుట్టు చివర్ల కత్తిరించుకోకపోవడం, చిక్కులు పడినప్పుడు సరిగ్గా తీసుకోకపోవడం, అలంకరణ మరియు జుట్టు సంరక్షణ కోసం రసాయనిక ఉత్పత్తులు ఎక్కువగా వాడడం, బాగా వేడి గా ఉన్న నీరు ఉపయోగించడంకూడా కారణం కావచ్చు.
అయితే చిక్కులు పడిన జుట్టు కు కోసం అవకాడో ఆధారితమైన హెయిర్ మాస్క్ లకు అత్యంత ప్రాధాన్యత ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఇ అవకాడోలో ఎక్కువగా ఉంటుందట. ఇది చిక్కుల ను నివారిస్తుందట. ఇది చర్మకణాలను ఆక్సిడైజింగ్ నుంచి కూడా రక్షిస్తుందంట. ఇది ఒమెగా 3ప్యాటీ యాసిడ్స్ కు మంచినిల్వట. ఈ యాసిడ్స్ చిక్కులతో పాడైనకురులను మెరుగుపరుస్తాయట.దీనికి తోడు నీరు ఎక్కువ తాగడం వలన జుట్టు ఊడడం బాగా తగ్గుతుంది అని నిపుణులు తెలియ చేస్తున్నారు.