మన శరీరానికి కావలిసిన ముఖమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. చాలా మంది ఐరన్ లోపంతో ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.నిజానికి మన శరీరానికి ఐరన్ తగినంతగా అందకపోతే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.ఫలితంగా మన శరీరం బలహీనంగా మారి వివిధ రోగాల బారిన పడుతుంది.మన ఎర్ర రక్త కణాలపై ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ తయారు అవ్వాలంటే ఐరన్ పాత్ర చాలా కీలకం అనే చెప్పాలి.రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలన్నా,మన శరీరం ఎదుగుదల, కణాలు సరిగా పనిచేయాలన్న ఐరన్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తింటూ ఉండాలి.
ఐరన్ ఎక్కువగా లభించే ఆహారపదార్ధాలు :
సాధారణంగా మాంసాహారం నుంచి ఐరన్ ఎక్కువగా అందుతుంది. మాంసాహారం తక్కువగా తీసుకునేవారు ఐరన్ ఎక్కువగా లభించే కూరగాయలను తింటూ ఉండాలి.ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.అందుకే కనీసం వారానికి మూడు సార్లు అయినా పాలకూరను తింటూ ఉండాలి. అలాగె బీట్ రూట్ తిన్నాగానీ శరీరానికి కావలిసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది.
ఐరన్ లభించే కాయగూరలు :
ఇక బీట్ రూట్లలో ఉండే క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి ఇతర పోషకాలు శరీరానికి శక్తిని సమకూరుస్తాయి. ఇంకా
బ్రకొలీ, చిలగడదుంప, బఠానీ, తోటకూర, చుక్కకూర వంటి ఆకుకూరలు, సోయాబీన్ వంటి వాటిల్లోనూ ఐరన్ ఎక్కువగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా గుమ్మడి గింజలలో కూడా ఎక్కువగా ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు,ఫ్యాటీ ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్ లాంటి లక్షణాలు ఉన్నాయి.చిక్కుళ్లు, ఎండుద్రాక్ష,గుడ్లు, పప్పు ధాన్యల్లో కూడా ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.