Pushpa 2 The Rule Teaser: “పుష్ప 2 ది రూల్” టీజర్ విడుదల కావడం జరిగింది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ లో చిన్నపాటి యాక్షన్ సీన్ చూపించడం జరిగింది. అల్లు అర్జున్ జాతరలో రౌడీలతో ఫైట్ చేస్తూ డిఫరెంట్ లుక్ లో కనిపించడం జరిగింది. ద రూల్ బిగిన్స్ ఆగస్టు 15 అంటూ టీజర్ లో సినిమా విడుదల తేదీ మరోసారి కన్ఫామ్ చేశారు. అల్లు అర్జున్ జాతరలో చేసిన ఈ ఫైట్ సినిమాకి హైలెట్ గా తీసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. జాతర కాస్ట్యూమ్ గెటప్ కూడా అల్లు అర్జున్ కి బాగా సెట్ అయ్యింది.
కానీ టీజర్ లో ఎలాంటి డైలాగులు వినిపించలేదు. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021లో “పుష్ప” మొదటి భాగం విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. బన్నీ కెరియర్ లోనే మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు గెలవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్ర. ఎందుకంటే తెలుగులో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అల్లు అర్జున్ తప్ప అంతకు ముందు ఎవరు అందుకోలేదు. ఈ సినిమాతో బన్నీ మార్కెట్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
“పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. దర్శకుడు సుకుమార్ మొదటి భాగం కంటే రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ఊహించని విధంగా విజయం సాధించటంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పైన చాలా వర్క్ చేసి అన్ని రకాలుగా సెట్ అయినాక..సెట్స్ మీదకు తీసుకెళ్లారు. దాదాపు ఏడాది నారనుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసి.. అభిమానులను అలరించారు.