NewsOrbit
రాజ‌కీయాలు

లోకేష్‌కు వైసిపి నేతల షాక్:డిఆర్‌సి నుండి బహిష్కరణ

గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినందుకు గాను టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు అధికార వైసిపి నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. గుంటురు జిల్లా అభివృద్ధి సమీక్షా (డిఆర్‌సి) సమావేశాలకు లోకేష్‌ను ఆహ్వానించకూడదని తీర్మానం చేశారు. సిఎం జగన్ ఒక సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలను వైసిపి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.

శనివారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో డిఆర్‌సి సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో లోకేష్‌కు డిఆర్‌సి నుండి బహిష్కరణ వేటు పడింది. ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి రంగనాధ్‌రాజు, మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

నారా లోకేష్‌ను డిఆర్‌సి నుండి బహిష్కరించడంపై టిడిపి మహిళా నేత పంచుమర్తి అనురాధ ఘాటుగా స్పందించారు. ’కరకట్ట కాలకేయ ప్రతిపాదించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జై కొట్టారు.’ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఉరి తీయాలి, నడిరోడ్డుపై కాల్చాలి అంటూ మాట్లాడినప్పుడు ఈ కరకట్ట కాలకేయ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని అనురాధ ప్రశ్నించారు.  కరకట్ట కమల్ హాసన్ ఎవర్నో కాపాడాలని ఏదో ప్లాన్ చేస్తున్నారని ఆమె అన్నారు. డిఆర్‌సి సమావేశాలకు లోకేష్‌ను పిలవకూడదని నిర్ణయం తీసుకున్నారంటే లోకేష్ అంటే వారు ఎంత భయపడుతున్నారో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. డిఆర్‌సి సమావేశాలకు పిలవకుండా అడ్డుకోగలరేమో గానీ ప్రజల్లో పెరుగుతున్న మద్దతును అడ్డుకోవడం వారి తరం కాదని అనురాధ అన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Leave a Comment