NewsOrbit
టాప్ స్టోరీస్

ఆధారాలు చెప్పలేదని..

అమెరికాలో జర్నలిస్టు ఇంటిపై పోలీసుల దాడి
అమెరికాలో పత్రికాస్వేచ్ఛను ఇనుప కాళ్లతో అణిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్రీలాన్స్ విలేకరిగా పనిచేస్తున్న బ్రయాన్ కార్మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఉదయం లేవగానే పోలీసుల అరుపులు వినిపించాయి. ఏంటా అని చూస్తే తుపాకులతో కొంతమంది వచ్చి అతడి ఇంటిని సోదా చేయాలన్నారు. సెర్చివారంటుతో వచ్చి ఇల్లంతా వెతికారు. తనను ఏదో ఒక డ్రగ్ డీలర్ లా చూశారని ఆయన చెప్పారు. ఆయన చేసిన తప్పల్లా.. ఒక కథనం రాయడమే. నగరానికి చెందిన పబ్లిక్ డిఫెండర్ జెఫ్ అడాచీ మరణం గురించి ఒక రహస్య పోలీసు నివేదికను ఆయన సంపాదించి కథనం రాశారు. దానికి ఆధారాలు చూపించాలని అంతకుముందు రెండు వారాల క్రితం పోలీసులు అడగ్గా, అందుకు ఆయన నిరాకరించారు. ఎఫ్.బి.ఐ. ఏజెంట్లు కూడా తనను ప్రశ్నించినా, వారికీ తాను ఏమీ చెప్పలేదని అన్నారు. తన న్యాయవాది సమక్షంలోనే మాట్లాడతానన్నారు.

దాదాపు ఆరు గంటల పాటు చేతికి బేడీలు వేసి కూర్చోబెట్టారు. ఉదయం. 8.22 నుంచి మధ్యాహ్నం 1.55 వరకు అతడు పోలీసు కస్టడీలోనే ఉన్నట్లు రిలీజ్ సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. ఇంట్లో గాలించిన పోలీసులకు ఒక బీరువాలో తమకు కావల్సిన రిపోర్టు దొరిరకింది. సెర్చివారెంటులో.. ‘దొంగతనం చేసిన లేదా ద్రోహపూరితంగా తెచ్చిన ఆస్తి’ కోసం వచ్చినట్లుంది. రిపోర్టు లీక్ చేసిన వ్యక్తికి, తనకు తప్ప భూమ్మీద ఎవరికీ ఆ విషయం తెలియదని కార్మోడీ అన్నారు. అడాచీ మరణం గురించి తాను మూడుచోట్ల కనుక్కున్నా, ఆ వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అతడు ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసి, నేరాలకు సంబంధించిన వార్తలు సేకరించి టీవీ చానళ్లకు అమ్ముకుంటారు. తాను ఫ్రీలాన్సర్ కావడం వల్లే పోలీసులు తనను వేధిస్తున్నారని, రిపోర్టుకు సంబంధించిన వివరాలు వేరే పత్రికల్లోనూ వచ్చినా వాళ్లను మాత్రం ఏమీ అనలేదని వాపోయారు. అడాచీకి అప్పటికే గుండెవ్యాధి ఉండటం, దానికి తోడు మద్యం, డ్రగ్స్ కలిపి ఇవ్వడం వల్లే అతడు మరణించినట్లు ఆ రిపోర్టులో ఉంది.

ఇప్పటికి తాను 29 ఏళ్లుగా రిపోర్టింగ్ వృత్తిలో ఉన్నా, ఎప్పుడూ పోలీసులు ఇలా తన ఆధారాలు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేయలేదని కార్మోడీ చెప్పారు. ఇప్పటివరకు జరిగిన విషయాలతో తాను షాకయ్యానని, ఇప్పటికే ఇవన్నీ తన చేతులు దాటిపోయాయని అన్నారు.
(వాషింగ్టన్ పోస్ట్ సౌజన్యంతో)

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment