న్యూఢిల్లీ: జార్ఖండ్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్ 30వ తేదీ నుండి అయిదు దశల్లో ఎన్నికలు జరుగుతాయని చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు.
ఈ నెల ఆరవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయన్నారు. నవంబర్ 13వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు.
నవంబర్ 30న తొలి దశ పోలింగ్, డిసెంబర్ ఏడున రెండవ దశ, డిసెంబర్ 12న మూడవ దశ, డిసెంబర్ 16న నాల్గవ దశ, డిసెంబర్ 20న అయిదవ దశ ఎన్నికలను నిర్వహిస్తారు. డిసెంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వెల్లడించింది.
ప్రస్తుత అసెంబ్లీ గడువు జనవరి అయిదవ తేదీతో ముగియనుంది.