(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 1981లో విడుదలైన ఆకలిరాజ్యం సినిమాలో కమల్‌హాసన్ ఓ ఇంటర్వ్యూకు వెళ్తాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. దీనికి కమల్ బదులిస్తూ..’ఈ రోజా..? నిన్నా..? మొన్ననా..? ఎందుకంటే అక్కడ రోజుకొకరు మారుతున్నారు కదా!’ అని సమాధానమిస్తాడు.
Video Courtesy: VEGA
ప్రస్తుతం మహారాష్ట్రలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్ నాలుగు రోజుల్లోనే రాజీనామా చేశారు. ఈ నెల 28న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీంతో ఆకలిరాజ్యం సినిమాలో కమల్ చెప్పిన డైలాగ్ కు సంబంధించిన సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.