ముంబై: ఓ అక్క సొంత చెల్లెలి నగ్న చిత్రాలను స్నేహితుడితో పంచుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తన సోదరి స్నానం చేస్తుండగా వీడియో తీసి పెళ్లైన తన బాయ్ ఫ్రెండ్‌కు పంపిన కేసులో 25 ఏళ్ల యువతిని అగ్రిపడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల యువతి బైకుల్లాలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో ఉండే వ్యక్తితో ఆమె సోదరికి పరిచయం ఉంది. అయితే గత నెలలో నవరాత్రుల సందర్భంగా బాధితురాలు.. సదరు వ్యక్తిని అవమానించింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తి.. బాధితురాలిపై కక్ష పెంచుకున్నాడు. అనంతరం బాధితురాలి అక్కకు ఫోన్ చేసి.. ఆమె చెల్లెలి నగ్న చిత్రాలు కావాలని డిమాండ్ చేశాడు. మొదట కుదరదని తెలపిన ఆమె.. పెళ్లి చేసుకోనని బెదిరించడంతో సరేనని చెప్పింది. తన చెల్లెలు స్నానం చేస్తుండగా అతనికి.. ఆమె వీడియో కాల్ చేసింది. దీన్ని అదునుగా తీసుకుని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో బాధితురాలి సోదరితో పాటు ఆమె బాయ్ఫ్రెండ్పైనా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, నిందితురాలిని బెయిల్‌పై శుక్రవారం విడుదల చేశారు. పరారీలో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
previous post
next post