Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి అనేక సంచలనాల వార్తలు వస్తున్నాయి. ఆడియన్స్ అంచనాలకు మించి ఎలిమినేషన్ లు జరుగుతున్నాయి. బీబీ టీం ఇంటిలో ఉన్న కొంతమందికి మద్దతు ఇచ్చే రీతులో వ్యవహరిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారన్నది ఎవరికి అర్థం కావటం లేదు. హౌస్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ స్టార్టింగ్ లో గీతూ గేమ్ చాలా హైలెట్ అని అందరూ మాట్లాడుకోవటం తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో రాకముందు షోకి సంబంధించి రివ్యూలు ఇచ్చి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ ఛాన్స్ అందుకున్న గీతూ…. బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ముందు గేమ్ స్టార్ట్ చేసి అదరగొట్టేసింది. ఈ సీజన్ సిక్స్ లో చాలామంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న రీతిలో గేమ్ ఆడుతుండగా…గీతూ మాత్రం తన స్టేటస్ లతో ఇంటి సభ్యులతో ఓ ఆట ఆడుకుంది. స్టార్టింగ్ లో అంతా బాగానే ఉన్నా తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు… బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలకు విరుద్ధంగా గీతూ చెత్త లుప్స్ ఆమె కొంపముంచాయి. దీంతో హౌస్ నుండి ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఎనిమిదవ వారంలోనే ఎవరు ఊహించని రీతిలో గీతూ… హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ సమయంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు ఏడవని రీతిలో..గీతూ లబోదిబోమంది. తన ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. కచ్చితంగా టైటిల్ గెలిచేస్తా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆమె వ్యవహరించిన తీరు చూసే ఆడియన్స్ కి చిర్రెత్తుకొచ్చి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేటట్లు చేశారు.

ఇదిలా ఉంటే హౌస్ లో ఆమె గేమ్ ఆడుతున్న సమయంలో చిత్తూరు చిరుత అని సోషల్ మీడియాలో ఆమెకు.. ఫాలోవర్స్ ముద్దు పేరు పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె అవసరం ఉంటే బయటకు రావడంతో … చిరుత పులి చర్మం టాటూ తన కాలిపై వేయించుకుని… చిత్తూరు చిరుత గీతు అని మరోసారి నిరూపించుకుంది. గీతూ సొంతూరులో చిత్తూరు కావడంతో అందరూ ఆమెను ఈ రీతిగా సోషల్ మీడియాలో సంభోదించేవారు. చిరుత చర్మం తరహాలో వేయించుకున్న టాటూ వీడియో గీతూ… ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.