కరోనా…! ఆధునిక ప్రపంచానికి పాఠం…!

Share

వేలాది మందిని చంపేస్తుంది…!
లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…!
కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…!
ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…!

ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే కనిపెట్టేసే ఉంటారు. కరోనా…! ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇది చేస్తున్నచెడు కంటే… ఆధునిక ప్రపంచానికి నేర్పిస్తున్న, చెప్తున్న పాఠం ఎక్కువగా ఉంది. బయటకు కనిపిస్తున్న భయంతో పాటు లోపల నేర్చుకుంటున్న పాఠాన్ని తెలుసుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా ఈ ప్రపంచానికి అప్రమత్తత అనే పాఠాన్ని నేర్పిస్తుంది.

చైనాను ఇక నమ్మలేం…!

ఇప్పటి వరకు చైనాపై ప్రపంచ చూపు ఒకలా ఉండేది. ఇకపై ఒకలా ఉంటుంది. చైనా అంటే ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికతతో జయిస్తున్న అద్భుత దేశం. ఆర్ధికంగా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుంటూ, అమెరికాకి సవాలు విసురుతున్న శక్తి. కానీ ఆ ఆర్ధిక, సాంకేతికత శక్తి కంటే ఇప్పుడు చైనా అంటే “కరోనా” గుర్తొస్తుంది. ఆ దేశ ఆహారపు అలవాట్లు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఏది తినకూడదు, తినొచ్చు అనేది చర్చకు దారి తీసింది. మొత్తానికి చైనా నుండి అన్నిటినీ దిగుమతి చేసుకోకుండా సొంతంగా ఉత్పత్తి మంచిది అని ఇతర దేశాలకు తెలిసొచ్చింది. అందుకే ఇండియా సహా, ఇరాన్, పాకిస్థాన్, ఇటలీ వంటి ఇరవైకి పైగా దేశాలు ఇది వరకు చైనా నుండి దిగుమతి చేసుకునే సాధారణ వస్తువులను కాదని, స్వదేశంలో తయారయ్యే వస్తువులకు గిరాకీ ఏర్పడేలా చేశాయి.
(చైనా నుండి ఆధారపడకుండా సొంతంగా ఉత్పత్తి చేసుకోవడం అనే సందేశాన్ని ఇతర దేశాలకు కరోనా ఇచ్చింది, ఇదే సమయంలో కేవలం పది రోజుల్లోనే పదివేల పడకల ఆసుపత్రిని నిర్మించే సత్త ఉన్న చైనాకు తమ బలం, బలహీనత తెలిసేలా చేసింది. ఎంత అడిగిన ఒక్క వైరస్ వచ్చి అతలాకుతలం చేస్తుందంటూ అప్రమత్తత పాఠం నేర్పింది)

వైరస్ వస్తే అంతే…!

మనిషి మెదడు విర్రవీగుతుంది. కంప్యూటర్ సృష్టి, మొబైల్ సృష్టి, రోబో సృష్టి… అంటూ హద్దుల్లేని దశలు దాటి సాంకేతికత పరుగులు పెడుతున్నదశలో కరోనా హెచ్చరిస్తుంది. “మీరెన్నికనిపెట్టిన వైరస్ దాటికి తట్టుకోలేరు” అంటూ అప్రమత్తత చాటుతుంది. ఒకప్పుడు ఫ్లూ, తర్వాత క్షయ, తర్వాత పోలియో.., తర్వాత ఎయిడ్స్ వచ్చి భయపెట్టాయి. కానీ ఇవేమి ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదు. కరోనా ఉనికి ప్రపంచానికి తెలిసి కేవలం మూడు నెలలే అయింది. కానీ కరోనా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోజుకి సగటున పది వేల మందికి సోకుతుంది. వారిలో రోజుకి సగటున వేయి మంది మరణిస్తున్నారు. ప్రస్తుత లెక్కలు చుస్తే చైనాలో అధికారికంగా 3410 మంది, ఇటలీలో 2200 మంది మరణించారు. ఇరాన్, స్పెయిన్, దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ లో అధికారిక లెక్కల ప్రకారం 130 మందికి ఖరారు చేయగా, వారిలో ముగ్గురు మరణించారు. ఇలా సాంకేతికత, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్న ప్రపంచాన్ని ఒక్క వైరస్ ఆపేసింది. ముందు “తనను జయించండి” అంటూ సవాలు విసిరింది. మానవ మెదళ్ళకు, శాస్త్రవేత్తల పరిశోధనలకు పెనుసవాలుగా మారింది. దీని తర్వాత మరోటి వస్తే ఎలా? అనే భయాన్ని కలిగించింది. అందుకే ఎంత సాంకేతికత, ఆధునికత ఉన్నా శుభ్రం, ఆహార శుద్ధి ముఖ్యమనే ప్రాధమిక సూత్రాన్ని ప్రపంచం గుర్తించేలా మేలు చేసింది కరోనా.

మార్కెట్లు ముంచింది…!

రూపాయి విలువ తగ్గిపోతుంది. అమెరికా డాలర్ విలువ పెరుగుతుంది. బంగారం ధర పెరిగిపోతుంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల ఆదాయం మాత్రం పెరగడం లేదు. వాటన్నిటికీ కరోనా కంట్రోల్ చేసింది. అక్కడకు అలా ఆపింది. చమురుని కిందకు దించింది. చమురుని ఉత్పత్తి చేసి, ఎగుమతులు చేసే 14 దేశాలు ప్రస్తుతం కరోనాతో అల్లాడుతున్నాయి. అక్కడ ఉత్పత్తి అయితే పెరిగింది. కానీ ఇతర దేశాల్లో వాడకం తగ్గింది. అంటే ఉత్పత్తి పెరిగి, వాడకం తగ్గితే నిల్వలు పెరిగి ధరలు దిగి రావాల్సిందే. కరోనా కారణంగా సరఫరా తగ్గి, నిల్వలు ఎక్కువయ్యాయి. ఈ ఫలితంగా ధర కూడా తగ్గింది. ఇదే సమయంలో చమురు చుట్టూ అల్లుకుని ఉండే మార్కెట్ ధరలు తగ్గాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లు, బంగారం తదితరాలపై పడింది. మధ్య తరగతికి కాస్త ఊరట కలిగించేలా ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఇటు ఖర్చులు తగ్గి, అటు ప్రయాణాలు తగ్గి, మరోవైపు ధరలు తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఊరట లభించింది. ముఖ్యంగా మార్కెట్ సూచీలు ఆకాశం నుండి డమాలని నేలకు పడ్డాయి. ఇది మార్కెట్ ని ముంచినప్పటికీ, మదుపరులకు అప్రమత్తత చెప్పింది.

శుభ్రత పాఠాలు బోధించింది…!

షేక్ హాండ్స్(కరచాలనం) .., హగ్గులు(కౌగిలింతలు) ఎక్కువయ్యాయి. పాశ్చాత్యపు సంస్కృతిని దేశం కూడా నలుమూలలా విస్తరించింది. నమస్కారం చేసుకోవడం దాదాపు కనుమరుగయ్యింది. మారిపోతున్న జీవన శైలిలో శుభ్రతకు కూడా షార్ట్ కట్లు వచ్చేసాయి. వాటన్నిటి నుండి ఈ ఒక్క వైరస్ పాఠం నేర్పించింది. పూర్వపు నమస్కారాన్ని మళ్ళీ అలవాటు చేసింది. షేక్ హాండ్స్, హగ్గులు వలన వైరస్లు వ్యాప్తి ఉంటుందని పాఠం చెప్పింది. శుభ్రతకు షార్ట్ కట్ మానుకుని రోజుకి ఆరు సార్లు శుభ్రం చేసుకోవాలని చాటింది. మొత్తానికి మానవుడు తనను తానూ రక్షించుకోవాలంటే కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పింది.

ఖర్చులు తగ్గించింది… అందరినీ ఇంటిలో చేర్చింది…!

ఆధునికత, సాంకేతికత పెరిగి షాపింగులు, సినిమాలు విపరీతమయ్యాయి. మధ్య తరగతి వాళ్ళు కూడా వీటికి బానిసలవుతున్నారు. కరోనా ఆ కొరత తీర్చింది. ఖర్చులు మిగిల్చింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సహా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఈ ప్రభావంతో ఇంటిల్లిపాదీ ఇంటికే పరిమితమై ఉంటున్నారు. ఖర్చులు తగ్గాయి, ఇంట్లో గడిపే అవకాశం వచ్చినట్లయింది. పూర్వపు రోజుల్లో ఇంటిల్లిపాదీ ఇళ్లల్లోనే గడుపుతూ ఆహ్లాదంగా గడిపేవారు కరోనా పుణ్యమా అంటూ ఇలా మళ్ళి ఆ అవకాశాన్ని కల్పించింది.

Srinivas Manem


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

44 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago