NewsOrbit
మీడియా

విజువల్ మారింది… బైట్ మారుతోంది!

తరం మారుతోంది… స్వరం మారుతోంది – అని కవితాత్మకంగా అంటూంటారు. అలాగే ఇపుడు తెలుగు టీవీ న్యూస్ చానళ్ళకు సంబంధించి విజువల్ మారింది – బైట్ మారుతోంది అని చెప్పుకోవాల్సి ఉంది.

కన్.ఫ్యూజన్ లేదు… ప్రజలకు క్లారిటీ ఉంది – అని ఎన్.టీవీ మహిళా యాంకర్ నాలుగైదు వాక్యాలకోసారి అనడం ప్రారంభించారు కౌంటింగ్ రోజు. ఎవరికి కన్.ఫ్యూజన్? ఆమె ఉద్దేశ్యంలో ప్రజలకు! కానీ తనకి తెలియని విషయం ఏమిటంటే – ఈ కన్ ఫ్యూజన్ ప్రజలకు లేదు – చానళ్ళకూ, యాంకర్లకు మాత్రమే. ఇదే మహిళా యాంకర్ ప్రచార సమయంలో వివిధ ప్రాంతాల కార్యక్రమాలలో చెబుతున్నవారికి పదే పదే అడ్డుతగిలి ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నారా అనిపించేట్లు చేసేది. ఇది అందరూ గుర్తించిన విషయం. ఇలా అడ్డుతగలడం టీవీ 9, టీవీ 5, ఎన్.టివీ.. ఇంకా ఎన్నో చానళ్ళలో తరచు ఉండేది. అందువల్ల ఆ పార్టీ కాకుండా మరోపార్టీకి మెజారిటి అంటే వీరికి అంగీకారం కాదు. సముదాయపడేంత సమయంలేదు.

సుమారు రెండురోజులకు సర్దుకున్నారు. ఇపుడు అనవసరమైతే వెంకటకృష్ణలాగా గత పాలకపక్షంపై అలవోకగా విమర్శలు ఎక్కుపెట్టగలరనుకోవాలి.

లీడ్ కనబడుతున్న సమయంలో కాస్త అనుకూలంగా కొంత పాత సమాచారం – నచ్చని పార్టీకి తక్కువ, తమ పార్టీకి ఎక్కువలా చూపగలరు. అయితే అదే రకంగా ఎక్కువ కాలం చూపలేరు కాబట్టి ఇతర రాష్ట్రాల మీద పడ్డారు. ప్రచార సమయంలో వేరే రాష్ట్రాల గురించి ఊసెత్తని చానళ్ళు ఇపుడు మిగతా రాష్ట్రాల గురించి చెప్పడం: శుక్ర, శనివారాలు ఆయా రాష్ట్రాల పార్టీల గెలుపోటముల గురించి చర్చించడం కొనసాగించారు. ఎబిఎన్, మహాలాంటివారికి నరేంద్రమోడిగారి విజయం గురించి ఎక్కువసేపు చర్చించడం ఇష్టం ఉండదు. మహాటీవీ కౌటింగ్ రోజు తెలుగుదేశం పరాజయం పాలవుతోందని ధ్రువపడగానే చర్చాకార్యక్రమం రద్దుచేసి యాంకర్‌కూ పానెల్ ఎక్స్‌పర్ట్స్‌కూ విశ్రాంతినిచ్చింది.

తెలుగు టీవీ న్యూస్ చానళ్ళు  మొదలయ్యే కాలానికే మన జర్నలిజంలో పాక్షిక దృష్టి, అపసవ్య వాదనా విధానం స్థిరపడ్డాయి. ఈ ధోరణి న్యూస్ చానళ్ళు రాకతో మరింత బలపడింది, మరిన్ని న్యూస్ చానళ్ళతో అది మరింత స్థిరపడింది. ఇది దశాబ్దమున్నర మించి సాగుతున్న తంతు. చంద్రబాబు, పాతిక అసెంబ్లీ సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించండి – అని అన్నట్టు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇదే రీతిన మన యాంకర్లు నాలుకలు కరుచుకోవడం పెరిగిపోయింది. ఇపుడు కాస్త కుదురుకున్నారు.  నూతన ముఖ్యమంత్రి కోసం కొన్నిరోజులో; లేదా పర్మనెంట్ గానో తెలియదు కానీ – సాక్షి టీవీ ఇపుడు విజయవాడ నుంచి లైవ్ కార్యక్రమాలిస్తోంది. కనుక ఉదయం, సాయంత్రం ఏడున్నరకు కొమ్మినేని శ్రీనివాసరావు గంటపాటు వీటిని నిర్వహిస్తున్నారు. కనీసం ఇపుడైనా ఏపి మీడియా ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతే – రెండు రకాలుగా మాట్లాడడం తగ్గవచ్చు. అయితే ఏ పార్టీ ఆర్థికమూలాలు అయినా హైదరాబాదులోనే ఉన్నాయి.

ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వాల కారణంగా టీవీ9 మాజీ సిఈఓ వార్తలు కాస్త అప్రధానమయిపోయాయి. వారి పేరు రవిబాబు అని ఈ కేసుల వల్ల మనకు తెలుస్తోంది. కొన్ని ముడులు వీడి,, ఆయన మరింత లోతుగా చిక్కుకు పోతున్నారని తెలుస్తోంది. గరుడపురాణం శివాజీ వీడియో విడుదల చేసినట్టుగానే, రవిబాబు కూడా వీడియో వదిలారు. 10 టీవీలో దీని మీద అరగంటపాటు వాయించి వదిలారు. ఇది వరకు ఎవరికారణంగా ఉతుకుడు స్థిరపడిందో, అదే ఉతుకుడు వారికే ఇపుడు నిరంతరం ఎదురవుతోంది. ఈ 10టీవీ కార్యక్రమంలో యాంకర్ ఈశ్వర్ ప్రెజెంటేషన్ విభిన్నంగా ఉంది. రవిప్రకాశ్ – నువ్వు చెప్పు – శ్రీనిరాజు ఇచ్చిన 12 కోట్లు సిబ్బందికి ఇవ్వకుండా ఏమి చేశావో తెలుసు అన్నట్టు సాగింది. ఇటు కెసిఆర్, జగన్ అటు మోడి రావడంలో – అది కూడా మంచి మెజారిటీతో ప్రభుత్వాలు రావడంతో ఎన్నో మీడియా లీలలు ముగిసాయి. అందులో రవి ప్రకాశ్ సీరియల్ ఒకటి!

జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడిని కలవడానికి వెళ్ళినపుడు వి6 కెమెరామెన్ చక్కని సమయస్ఫూర్తి ప్రదర్శించారు, మిగతా సిబ్బంది దాన్ని గుర్తించి, అడ్డు చెప్పలేదు. సగం స్క్రీన్ మీద దూరం నుంచి చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య మెట్లు ఎక్కే విఐపిలు చాలాసేపు కనబడ్డారు. ఎన్.టీవీ.లో కూడా ఇలాంటి పచ్చదనం కొంత కనబడింది. స్టూడియోలో ఉండే యాంకర్లకు పచ్చదనం కొంత కనబడింది.

స్టూడియోలో ఉండే యాంకర్లకు ఏమి అడగాలో తెలియదో, లేక చెప్పరో తెలియదు. ఎన్.టివీ ఢిల్లీ ప్రతినిధి అరుణ – ఇది కర్టసి విజిట్, ఇరువురూ ప్రమాణస్వీకారం చేయలేదు. కనుక బయటికి రాగానే జగన్మోహనరెడ్డి ఏమీ చెప్పకపోవచ్చు. అయితే ఆంధ్రాభవన్ మీటింగ్.లో ఆయన కొన్ని విషయాలు మాట్లాడవచ్చు అని విడమర్చి యాంకర్.కు చెప్పారు. అది అరుణకున్నక్లారిటీ!

శుక్రవారం రాత్రి ఫోర్త్ ఎస్టేట్.లో సాక్షి టీవీ బాపట్ల ఎం.పి. నందిగం సురేష్ తన భయంకర పోరాటం గురించి చెప్పినపుడు చర్చను ఇంటర్య్వూగా మార్చింది. గంటకు మించిన సాగిన ఈ వీడియో నెట్.లో  వైరల్ అవుతోంది. వళ్ళు జలదరిస్తోంది ఈ  విషయాలు తెలుస్తుంటే! అదే సమయంలో సాక్షి టీవీ యాంకర్లు ప్రత్యర్థిపార్టీ గురించి ప్రస్తావించేటప్పుడు మరికొంత గాంభీర్యం ప్రదర్శిస్తే – ముందు ముందు చానల్ విశ్వసనీయతకు మంచిది.

– డా. నాగసూరి వేణుగోపాల్

Related posts

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Mahesh: ఎమోషనల్ అయిన మహేష్‌బాబు పోస్ట్ వైరల్.!

Deepak Rajula

Petrol : కేవలం రు.1/-కే లీట‌ర్ పెట్రోల్‌ దొరకడంతో పోటెత్తిన జనం.. రంగంలోకి పోలీసులు!

Deepak Rajula

Iliyana: టాప్ హీరోయిన్ ఇలియానా సూసైడ్.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాక్!

Deepak Rajula

Sherbet: బ్రిటీష్ వారి నుండి రక్షణ కోసం మొదలెట్టిన షాప్…. ఇప్పుడు కలకత్తా ఫేమస్ ‘పారమౌంట్ షర్బత్’

arun kanna

CJI Ramana: మీడియా తీరుపై హ‌ర్ట‌యిన సీజేఐ ర‌మ‌ణ‌.. సుతిమెత్త‌గా క్లాస్ తీసుకొని…

sridhar

Revanth Reddy: ఇప్పుడుంటుంది అస‌లు మ‌జా… పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్‌!

sridhar

Breaking News: మైనర్ బాలిక ప్రేమించడం లేదని నాటు తుపాకీతో కాల్చాడు – చిత్తూరు జిల్లాలో ఘటన..!!

Srinivas Manem

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

sridhar

Times Indu Jain: మహమ్మారి కాటుతో దేశంలోని మీడియాధిపతి.., కుబేర వనిత కన్నుమూత..!

Srinivas Manem

KCR: బ్రేకింగ్ః తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క‌రోనా

sridhar

Tv Debates : మీడియా చర్చల్లో ముష్టియుధ్దాలే మిగిలాయా..!? చానెల్స్ చేసేది ఇదేనా..?

Muraliak

Leave a Comment