NewsOrbit
న్యూస్

AP Assembly: అసెంబ్లీలో మార్చి 21న ఏం జరగబోతోంది?న్యాయవ్యవస్థతో మరోసారి ఢీకి సిద్ధమవుతున్న సీఎం?

AP Assembly: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి న్యాయవ్యవస్థతో నేరుగా ఘర్షణకు దిగే సూచనలు గోచరిస్తున్నాయి.

What's going on in the AP Assembly on March 21?
Whats going on in the AP Assembly on March 21

హైకోర్టు ఇటీవల అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు జగన్ సర్కార్ స్పందించలేదు.హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పలేదు.అలాగని సుప్రీంకోర్టులో అప్పీలు కు కూడా వెళ్లలేదు.దీంతో ఇది పెండింగులో ఉంది.ఇక అమరావతికి తిరుగులేదనే ధీమాతో తెలుగుదేశం పార్టీ వర్గాలు విజయోత్సాహంతో ఉన్నాయి.

AP Assembly: మూడు రాజధానుల పై తగ్గేదేలేదన్న జగన్!

అయితే అకస్మాత్తుగా ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే సోమవారం నాడు తిరిగి జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టనున్నదనే వార్త ఒకటి గుప్పుమంటోంది.బహుజన పరిరక్షణ సమితి ప్రతినిధులు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసి కొన్ని కోరికలు కోరినప్పుడు జగన్ వారికి ఈ నెల ఇరవై ఒకటో తేదీన రాజధాని విషయమై అసెంబ్లీలో చర్చించి క్లారిటీ ఇస్తామని తెలిపారని టాక్ వినిపిస్తోంది.అదే సమయంలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటానని జగన్ వారికి చెప్పినట్లుగా వినవస్తోంది.

AP Assembly: వైసీపీ ఎమ్మెల్యేలను కూడా ప్రిపేర్ చేస్తున్న సీఎం!

కాగా ఇటీవల జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ముఖ్యమంత్రి మూడు రాజధానుల విషయమై చర్చకు సిద్దం కావల్సింది గా తమ పార్టీ వారికి హింట్ ఇచ్చినట్లు సమాచారం.శాసనసభ వ్యవహారాల్లో హైకోర్టు జోక్యంపై కూడా మాట్లాడడానికి కొందరు సీనియర్ ఎమ్మెల్యే లను జగన్ ఎంపిక చేశారంటున్నారు. స్పీకర్ కు కూడా ఈ అంశంపై సుదీర్ఘ చర్చకు అవకాశమివ్వాలని సీఎం జగన్ సూచించారని తెలిసింది.

మరోసారి న్యాయవ్యవస్థతో జగన్ ఢీ!

ఇవన్నీ చూస్తుంటే జగన్ న్యాయవ్యవస్థ తో మరోసారి కయ్యానికి కాలుదువ్వినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.హైకోర్టు అమరావతిని కొనసాగించాలంటూ ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా.. అసలు ఉన్నత న్యాయస్థానం తీర్పునే తప్పుబట్టేలా అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వం చర్చ చేపడితే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు.దీన్ని న్యాయవ్యవస్థ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉందని వారు వివరించారు.గతంలో ఇప్పుడున్నసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మీదనే నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేసిన జగన్ ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే అమరావతి విషయంలో కూడా ఆయన అదే పంథా అవలంబించేలా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.మార్చి ఇరవై ఒకటిన ఏం జరుగుతుందో చూద్దాం!

author avatar
Yandamuri

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju