NewsOrbit
వ్యాఖ్య

ఏ నిర్మూలన కావాలిప్పుడు?

ఈ రోజు ఒక మిత్రుడు నా ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లోకి ఒక వీడియో పంపించాడు. ఎవరో యువకుడు రోడ్డు మీద పడి వున్నాడు. కొందరు అతణ్ణి దారుణంగా కొడుతున్నారు. ఒకడు  చేతులతో ముఖం మీద పిడిగుద్దులు కొడుతున్నాడు. ఇంకొకడు పైకి ఎగిరి అతని ఛాతీ మీద దూకుతున్నాడు. చుట్టూ చాలా మంది మూగి వున్నారు. కొడుతున్న వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా కొందరు అదే నినాదానికి వంత పాడుతున్నారు. ఎవరూ ఎవరినీ  ఆపే ప్రయత్నం చేయడం లేదు. అంతా తమాషా చూస్తున్నారు. ఏ పుణ్యాత్ముడో పోలీసులకు ఉప్పందించినట్టుంది. రంగంలోకి పోలీసులు వచ్చారు. అతణ్ణి ఈడ్చుకుంటూ వ్యానులోకి ఎక్కించుకు తీసుకుపోయారు.   అర్థమైంది విషయం ఏమిటో.

నిన్న మొన్ననే కదా మాహాత్మా మహాత్మా అంటూ గాంధీ పాట పాడారు. గాంధీ కలలుగన్న భారతాన్ని నిర్మించామని ప్రపంచానికి ఛాతీ ఉబ్బించి మరీ చాటి చెప్పారు. మరి ఇదేమిటి? చూస్తే మనసంతా వికలమైపోయింది. సంఘటన ఎక్కడ? ఎలా జరిగింది? ఎవరు బాధితుడు? ఎవరు దోషులు? ఈ ప్రశ్నలతో పెద్ద పనేముంది? తెలియని జవాబులు మాత్రం ఏమున్నాయి? కళ్ళు మూసుకుని..చెవులు మూసుకుని..నోరు మూసుకుని గాంధీగారు చెప్పింది విలోమ పద్ధతిలో ఆచరిస్తే పోలేదా? మనకెందుకు ఇదంతా అని సరిపెట్టుకుంటే సరికదా. అబ్బే మనసు వింటుందా? వినదు. లోపల్లోపలే కనలిపోతూ కదిలిపోతూ వుంది. మరి గాంధీ దేనికి ఆదర్శంగా నిలిచినట్టు? అహింస హంస ఎటు ఎగిరిపోయింది? సత్యం వధ ఎవరి చేతుల్లో జరిగింది? ఏ రాజ్యాన్ని గాంధీ కలగన్నాడు,  ఏ రాజ్యం ఏలుబడిలో వుంది? ఏ నీతిని ఏ రీతిని ఏ జాతిని గాంధీ ఆదర్శీకరించాడు? ఆ నీతి..ఆ రీతి..ఆ జాతి ఇప్పుడెక్కడ?

గాంధీ కలగన్న భారతాన్ని నిర్మించామని దేశ ప్రధాని ఆడంబరంగా చేసిన ప్రకటన ఆంతర్యం ఏమిటి? ఏడుపూ రావడం లేదు. నవ్వూ రావడం లేదు. అసహ్యంగా వుంది. బహిరంగ మల విసర్జన నిర్మూలన కోసమే గాంధీ అనే మహాత్ముడు ఈ సనాతన భారతావనిలో జన్మనెత్తినట్టు చివరి చిత్రణ చివరికిలా జరిగిందన్నమాట. కొన్ని మాటలు అనక తప్పడం లేదు..

దృశ్యాదృశ్య హింసోన్మత్త  విసర్జన నిర్మూలన ఎప్పుడు?

హీనాతి హీన అవినీతి విసర్జన నిర్మూలన ఎప్పుడు?

దారుణాతి దారుణ మతోన్మాద నినాద విసర్జన నిర్మూలన ఎప్పుడు?

ఈవీఎం ప్రొడక్షన్ బ్లాక్ బస్టర్ విసర్జన నిర్మూలన ఎప్పుడు?

అనునిత్య అసత్య ప్రేలాపనాలాపనా విసర్జన నిర్మూలన ఎప్పుడు?

పర్యావరణ ప్రదూషిత వాచాలత విసర్జన నిర్మూలన ఎప్పుడు?

స్వయం ఉదర మర్దనోద్దండ స్వోత్కర్ష హర్షోల్లాస విసర్జన నిర్మూలన ఎప్పుడు?

మాయామేయ మహానటనా వైదుష్య విసర్జన నిర్మూలన ఎప్పుడు?

ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు?

విద్వేష విధ్వంస విలయ వికటాట్టహాస విసర్జన నిర్మూలన ఎప్పుడు?

ఇన్ని బహిరంగ మలినాల విసర్జనాల నిర్మూలన ఎప్పుడు?

చెప్పండి అయ్యలారా? కనీసం బాపూ కోసమైనా చెప్పండి ప్రభూ..!!

డా.ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment