NewsOrbit
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల ఆందోళనకు బిజెపి మద్దతు’

అమరావతి: రాష్ట్రంలో వైసిపి నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. సిఎం జగన్ వద్ద నుండే ఈ పరిస్థితి చూస్తున్నామన్నారు. రాజధాని విషయంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుతున్నామే గానీ పరిపాలన వికేంద్రీకరణ కోరడం లేదని చెప్పారు.బిజెపి విధానంలో ఎటువంటి మార్పులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసిపి ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఆయన హితవుపలికారు. రాజధానికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. 151 సీట్లు ఉన్న సిఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారనీ, ఎందుకో తెలియడం లేదనీ కన్నా అన్నారు. రాజధాని రైతులకు సంఘీభావంగా బిజెపి కూడా పోరాడుతుందని ఆయన తెలిపారు. రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగితే అవినీతి పరులపై చర్యలు తీసుకోవచ్చనీ, ఎవరు అడ్డుపడ్డారనీ ఆయన ప్రశ్నించారు. అవినీతి పరులను పక్కన పెట్టి అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని కన్నా అన్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

Leave a Comment