NewsOrbit
రాజ‌కీయాలు

‘పవన్ సినీ రీ ఎంట్రీ సరైన నిర్ణయమే’

అమరావతి: నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఉంటారని మాజీ ఎంపి ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేననీ, అదే సరైన నిర్ణయంగా భావిస్తున్నాననీ అయన అన్నారు. గురువారం మీడియా సమావేశంలో పవన్ సినీ రీ ఎంట్రీపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా వ్యాఖ్యానించారు.

పవన్ సినిమాల్లో నటించాలని మొట్ట మొదట కలిసినప్పుడే చెప్పానన్నారు ఉండవల్లి. అయన ప్రధాన వృత్తి అదే కాబట్టి సినిమాలు మాత్రం ఆపొద్దని సూచించానన్నారు. రాజకీయాలు, సినిమాలు రెండూ కుదరవని నాడు పవన్ చెప్పాడనీ, కానీ ఇప్పుడు కుదురుతోందనీ అన్నారు.

అప్పట్లో తాను సీఎం అయ్యే అవకాశాలున్నాయని భావించి సినిమాలు వద్దనుకునుంటాడనీ, ఇప్పుడు నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని నిర్ణయం తీసుకుని ఉంటాడనీ ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి స్పందిస్తూ, పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదని అన్నారు. పొత్తులకు సిద్ధాంతాలతో  పని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చనీ అదే విధంగా పవన్ కల్యాణ్ పరిస్థితీ పెద్దగా తేడా లేదని ఉండవల్లి అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Leave a Comment