(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఓ బుడతడు షాకిచ్చాడు. ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలోని ఓ స్కూల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రజినికి స్కూలు విద్యార్థులు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు కదిలారు. స్కూలు విద్యార్థులు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి రజిని బుగ్గ గిల్లి, ముద్దు పెట్టుకున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షాక్ తిన్న రజిని… ఆ తర్వాత నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేపై ఆ బాలుడి ప్రేమ చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
https://www.facebook.com/anu.rajeswari/videos/3186368388103631/