39 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన జస్ప్రీత్‌ బుమ్రా


ఆస్ర్టేలియా(మెల్‌బోర్న్) టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 39 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ ‌చేశాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అడుగిడిన బుమ్రా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో బుమ్రా బంతితో రికార్డును సాధించాడు. తన బౌలింగ్‌తో మార్కస్‌ హ్యారీస్‌, షాన్‌ మార్ష, ట్రావిస్‌ హెడ్‌, టీమ్‌ పైన్‌, లయన్‌, హజల్‌వుడ్‌లను పెవిలియన్‌కు పంపించాడు. టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రంచేసిన ఏడాదిలోపే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు స్పిన్నర్‌ దిలీప్‌ దోషి పేరిటవుండగా బుమ్రా అధిగమించాడు. 1979లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన దిలీప్‌ దోషి అదేయేట 40 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌నుసాధించగా, మళ్లీ 39 ఏళ్ల తర్వాత బుమ్రా ఈ రికార్డును బ్రేక్‌ చేశాడు. దిలీప్‌ తర్వాత 37 వికెట్లతో(1996) వెంకటేశ్‌ ప్రసాద్‌, నరేంద్ర హిర్వాణీ 36(1988), శ్రీశాంత్‌ 35(2006)లున్నారు. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 9 టెస్ట్‌ మ్యాచ్ లలో మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. బూమ్రా రికార్డుపై భారత, జట్టు సభ్యులతోపాటుగా ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అభినందనలతో ముంచెత్తారు.

SHARE