ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) నుండి అమెరికా ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇంతకు ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ కు అమెరికా ఫండింగ్ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అసలు ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసుకదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనా చెప్పుచేతల్లో ఉందని, చైనాను నిలువరించలేకపోతుందని, చైనా అజెండా ను అమలు చేస్తుందని ట్రంప్ ఆరోపణ. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా తప్పుకోవడం వల్ల జరిగే నష్టాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ పరిణామం మంచిది కాదు అని మేధావి వర్గం భావిస్తున్నది. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరి చేయలేకానీ ఇలా తప్పుకుంటే.. అటు అమెరికాకు, ఎటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు, మానవాళికి నష్టమేనని ప్రముఖ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు. ప్రపంచ స్థాయిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రత్యామ్నాయంగా మరే సంస్థ లేని ఈ తరుణంలో అమెరికా తప్పుకోవడం వల్ల ఆ దేశానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమి ఉండదు. అమెరికాలో వైద్య పరిశోధనలపైనా ఈ ప్రభావం పడుతుంది అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధికంగా నిధులు కేటాయించే దేశం అమెరికా అన్న విషయం అందరికి తెలిసిందే. అమెరికా ఏటా 45 కోట్ల డాలర్ లు ఇస్తుంటుంది. ఈ నిధులు ఆగిపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్ధికంగా బలహీన మవుతుంది. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందున అక్కడి కోర్టులు దీన్ని నిలువరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏమిజరుగుతుందో వేచి చూడాలి.
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. ఈ మహమ్మారి విషయంలో ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యం వహించిందని, దీనికి చైనా కూడా కారణం అని అభియోగాలు ఉన్నాయి.