(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును స్వాగతిస్తూ లోక్సభలో చేసిన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకున్న లద్దాఖ్ బిజెపి ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ నమ్గ్యాల్ 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని లెలో జరుపుకుంటూ చిన్నపాటి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. వార్తాసంస్థ ఎఎన్ఐ దానిని వీడియో తీసింది.
#WATCH BJP MP from Ladakh, Jamyang Tsering Namgyal (in front) dances while celebrating 73rd #IndiaIndependenceDay, in Leh. pic.twitter.com/KkcNoarPPB
— ANI (@ANI) August 15, 2019
నమ్గ్యాల్ ఆగస్టు ఆరున పార్లమెంటులో చేసిన ప్రసంగం వీడియో వైరల్ అవడంతో ఆయనపై దేశ ప్రజల దృష్టి పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నమ్గ్యాల్ ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. నమ్గ్యాల్ బ్రహ్మండంగా మాట్లాడారనీ, లద్దాఖ్ ప్రజల ఆశయాలను తన ప్రసంగంలో ప్రతిబింబించారనీ ప్రధాని ట్వీట్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1158703283327778816
జెండా పండుగను లద్దాఖ్ ముఖ్యపట్టణం లెలో జరుపుకున్న నమ్గ్యాల్, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, లద్దాఖ్ ప్రాంతం సంప్రదాయ వస్త్రమైన గౌచా ధరించి వీడియోలో కనబడతారు. మరికొందరు డాన్సర్లతో కలిసి ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి.