Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో లలో అతి చెత్త సీజన్.. సీజన్ 6 అని ప్రేక్షకులు అంటున్నారు. జనాల ఓటింగ్ బట్టి కాకుండా.. షో నిర్వాహకులు తమకి ఇష్టం వచ్చిన కంటెస్టెంట్లను షోలో కొనసాగిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. హౌస్ లో కంటెస్టెంట్ ల సెలక్షన్ నుండి అంతా కూడా అట్టర్ ఫ్లాప్ మాదిరిగా షోని నడిపించారు. ఇంక సీజన్ సిక్స్ టైటిల్ కోసం పోటీ పడటానికి హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కాంటెస్టెంట్లు సైతం.. స్టార్టింగ్ మూడు వారాలు చెత్త గేమ్ ఆడారు. ఇంకా ఎలిమినేషన్ లో సైతం చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ముందుగానే ఎలిమినేట్ అయిపోయారు.

పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా ఫైనల్ వారానికి ముందు ఇనాయా ఎలిమినేట్ అవ్వటం బయట ప్రస్తుతం పెద్ద కాంట్రవర్సీగా ఉంది. సీజన్ స్టార్టింగ్ వారంలోనే ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోవాలి. కానీ ఆట విషయంలో ప్రతి వారం తన గ్రాఫ్ పెంచుకుంది. హౌస్ మొత్తం ఒక వైపు ఉన్న… ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మంచి పోరాటం పోరాడింది. స్ట్రాంగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు మరి ఆడియన్స్ దృష్టిలో లేడీ టైగర్ అనిపించుకుంది. కచ్చితంగా విన్నర్ మెటీరియల్ కి కావలసిన క్వాలిటీస్ కలిగిన ఇనాయానీ ఎలిమినేట్ కావాలని బయట విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి టాప్ లో ఉన్న ఆమెను..బీబీ టీం కావాలని ఎలిమినేట్ చేసిందని విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎపిసోడ్ టిఆర్పి రేటింగ్ పడిపోయిందట. ఇనాయా ఎలిమినేట్ కాకముందు సాధారణమైన రోజుల్లో 2.96(U+R) రేటింగ్ ఉండేదట. కానీ ఇనాయా ఎలిమినేట్ అయిన తర్వాత సోమవారం ఎపిసోడ్ 0.86(U+R) రేటింగ్ కి పడిపోయిందట. తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ లలో ఇదే అత్యంత… తక్కువ టిఆర్పి రేటింగ్ నమోదు అయిన ఎపిసోడ్ అని ఇనాయా ఎలిమినేషన్ ఎఫెక్ట్ అని వార్తలొస్తున్నాయి. చూసే జనాలను ఎర్రోలు చేస్తే… రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి పురావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని..బీబీ టీంకి వార్నింగ్ లు ఇస్తున్నారు.