ప్రస్తుత కాలం లో స్త్రీ, పురుషులలో శృంగార సామర్థ్యం గణనీయం గా తగ్గిపోతోంది. దీంతో వారు శృంగారంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ సమస్యకు పలు ఆహారాలు మార్గాన్ని చూపిస్తున్నాయి. వీటినిప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరగడంతోపాటు శృంగారంపై ఆసక్తి ని కూడా కలిగిస్తాయి.
శృంగార సామర్థ్యాన్నిపెంచడానికి అరటి పండ్లు బాగా ఉపయోగ పడతాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి, ట్రిప్టోఫాన్, పొటాషియం, బ్రొమెలీన్ లు జననావయవాలకు రక్తసరఫరాను పెంచుతాయి. దీంతో శృంగార సమస్యలు ఉండవు. బీట్రూట్ నైట్రేట్స్ ను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిత్యం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తసరఫరా కూడా బాగా జరుగుతుంది. మూడ్ ని మార్చుతుంది. శృంగారం పట్ల ఆసక్తి గా అనిపిస్తుంది. ఇవి శృంగార సామర్థ్యాన్నిపెంచడానికి ఉపయోగ పడతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ప్రతి రోజు 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యం గా ఉం చడంతోపాటు శృంగారం పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తాయి .ప్రతి రోజు 1 లేదా 2 టీస్పూన్ల యాలకులను తీసుకుంటే వీర్య వృద్ధి జరుగుతుంది . అలాగే నపుంసకత్వం సమస్య కూడా తగ్గుతుంది. శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్ఖలనం ఒక సమస్య గా ఉంటుంది. దానికి యాలకుయాలకులు మంచి ఔషధం. యాలకులు తీసుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనవచ్చని ఆయుర్వేదం లో చెప్పబడింది. రోజూ రాత్రి నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలలో యాలకుల పొడివేసుకుని తాగడం వల్ల శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు.