NewsOrbit
వ్యాఖ్య

ఎవరిదీ పాపం!?

కంచే  చేను మేసింది
పశు  వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి
కేవలం లేగ దూడలు
ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి
ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు
నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు
ఇవన్నీ చదివితే గుండె ముక్కలైపోతోంది
నరాల్లో వణుకు పుడుతోంది
దేశమంతా భయంతో వణుకుతోంది
మనిషి చచ్చిపోయేక పిశాచమవుతాడంటారు
పొరపాటు అది ఒకప్పటిమాట
ఇప్పుడు బతికుండగానే పిశాచాలు అవుతున్నారు
ఆధ్యాత్మికవేత్తలూ మీరేమంటారు
చంపేదెవరు చచ్చేదెవరు  అని భగవద్గిత వల్లె వేస్తారా
జ్యోతిష్కులూ మీరేమంటారు
అంతా  ఆ పైవాడి లీల  అంటారా
పైవాడికి అదేం సరదా
ఇలాటి ఆటలు ఆడడానికి
దేవుడు కూడా దానవుడు అవుతున్నాడా
ఇంతకీ మీరేమంటారు
వాళ్ళకి సంతాన  స్థానం  దెబ్బ తిన్నది అంటారా
అమ్మాయికి ఆకస్మికమరణం ఉందంటారా
శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు కదూ
శివుడి మాట చీమ వింటుందేమోకాని మనిషి వినడు
ఇంతకీ మనం ఉంటున్నది మనుషుల మధ్యనా  రాక్షసుల మధ్యనా
ఆడ వాళ్ళని ఎందుకు ఆలా చంపేస్తున్నారు
ఆ అమ్మాయి అంత నరకం అనుభవించడం ఎంత అమానుషం
ఈ పాపం ఎవరిది
లైసెన్స్ లేని డ్రైవరుని పెట్టుకున్న ఓనరుదా
లైసెన్స్ లేకుండా ఓవర్లోడుతో వెళుతున్నా గానీ పట్టుకోని  ఆర్టీఓదా
అక్రమ పార్కింగ్‌లో ఉన్నాగానీ పట్టుకోని పోలీసులదా
ఎవరిది ఈ పాపం
తిలా పాపం తలా పిడికెడు
ఇందులో ఏ ఒక్కరు నిజాయితీగా ఉన్నా ఈ ఘోరం జరిగేది కాదు
ఒకటి మాత్రం నిజం
ఆడవాళ్ళకి భద్రత లేదు
ఇంతకీ ఈ  అఘాయిత్యం చేసింది ఎవరు
యిరవై ఏళ్ళ కుర్రాళ్ళు ఒళ్ళు తెలీకుండా తాగేరు
ఇదివరకే చెప్పేను
అన్ని నేరాలకూ మూలం తాగుడు
ఇది నామాట కాదు
అత్యాచారాల కారణాల సర్వేలో తేలినది
మనకి కావలసినది సర్వేలు లెక్కలు కాదు
వాటిని ఆపడం
ఆపడం లేదు సరికదా పెరుగుతున్నాయి
నూటికి పది మందికి కూడా శిక్షలు పడడంలేదు
వీటికి ప్రత్యేకంగా కోర్టులు  పెట్టి వెంటనే శిక్షలు వేస్తె కొంతవరకు తగ్గుతాయి
కానీ మనకి అన్నికొరతల లాగాగే కోర్టులు కూడా కొరతే
మరి రెచ్చిపోక  ఏవిచేస్తారు
ఎనభై శాతం తాగుడే కారణం అని తేల్చేరు
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని స్లోగన్లు వేస్తున్నారు
హాని ఆరోగ్యానికి కాదు
సమాజానికి
మొన్న స్టూడెంట్లు చావడానికి కారణం తాగుడు
కొన్నిటికి మాత్రం తాగడం కారణం కాదు
కేవలం మానవత్వం  నీతి  వావివరసలు మంట కలవడం
మూడురోజుల కిందట చదివేను
భార్య హాస్పిటల్‌లో ఉంటె పదమూడేళ్ల కూతురి మీద కన్న తండ్రి అత్యాచారం చేసేడు
ఆ పిల్ల ఎవరితో చెప్పుకుంటుంది
కాపాడే వాడే కాటేసేడు
కాపాడవలసిన తండ్రి కబళిస్తే ఇంక దిక్కెవరు
దిక్కు  అంటే జ్ఞాపకం వచ్చింది
ప్రతి సంఘటనకి రెండు కోణాలు ఉంటాయి
ఆ కుర్రాళ్లకి శిక్ష పడుతుంది సరే
కానీ వాళ్ళవి పూట గడవని కుటుంబాలు
ఆ కుటుంబాల మాట యేవిఁటి
ఒకడు చేసిన తప్పుకి కుటుంబం నాశనం అవుతుంది
వాళ్లలో ఆ కుర్రాడి తల్లి యేవందో  తెలుసా
వాడిని చంపెయ్యండి నన్ను చంపెయ్యండి అంది
అప్పుడు నాకు గోర్కీ కథ గుర్తుకు  వచ్చింది
అవును తల్లి సృష్టించనూ  గలదు శిక్షించనూ  గలదు
ఆ తల్లికి మరో తల్లి బాధ తెలుసు
ఆవిడకి ప్రపంచం తెలీదు చదువులేదు
కానీ మంచి మనసు ఉంది
తన కొడుకు తప్పు చేసేడని తెలుసు
ఆ తప్పు కూడా చిన్నది కాదని తెలుసు
భ్రష్టుడైన కొడుకుని ఏ తల్లీ భరించదు
ఒకప్పుడు అంటే ఆటవిక యుగంలో వావి వరసలు లేవు
ఎంతో  మోడరన్ అంటున్న మనం ఏ యుగంలో ఉన్నాం
ఇంత  భయం బతుకులు ఎలా బతుకుతాం
ఇంక  కొన్నేళ్ల కి  ఆడ  జాతి మిగులుతుందా
ఇది మన శాపవా  పాపవా
పరిణామక్రమంలో కొన్ని జాతులు అంతరించి పోతాయి
అలా ఆడ జాతి కూడా అంతరించి పోతుందా
మరీ మంచిది
సృష్టి ఆగిపోతుంది

 

బీనా దేవి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment