అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యంపై జరిగిన బదిలీ వేటు లో నూతన కోణం ఉన్నట్లుగా బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాలలో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమానం అని పేర్కొన్నారు. సిఎస్ ను తొలగించే అధికారం సీయమ్ కు ఉన్నా ఈ తొలగించిన విధానం సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం.. ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.
https://www.facebook.com/IYRKRao/photos/a.1898171613840394/2477744035883146/?type=3&eid=ARC2b7HLxVMty9mhcqpQv7dVqeDrCpUCS2B3SemXEWiSMB8aZGmo0N1jc3tpxKyZSiUkSEfxeIc71mHU&__xts__%5B0%5D=68.ARB8B9S8rt8yiHapb59-U2R1MGw-SAlmqcwOFDYcadsjV0mGYoivlX_C8J3jmeaKq8n-tlJsGbTJNpq_5jRoeFAAwGMpJYgCDIrOI3OqZa68dOhzZpdhNDo5Rn7ZiGXNrql05LSBycqd2w073GSIgeBfCGROD3Z0nXOQRH_7a3ioR4rTzGlg4BYI8_Clkj9zvFaZpPUoRO5OrsNZXE7_3rVJhn6UI1pUOeCxFDNQKU_6pvm_5M1lNVgCXRsQ5JWXbm3ubZIqMwWoPl6st0u5tesv8hjbSRaq0QFElfMPY4p1MPnanoXLtJtRpPCR83Vf21tMpJK9XnXwrOslU0aJ9UPRw4jM&__tn__=EEHH-R