Weight Lose: బరువు తగ్గడం కోసం ఏదైనా చేయండి .. కానీ ఇలా చేస్తే మాత్రం దెబ్బ తింటారు !

Share

Weight Lose:  మనిషి ఉండవలసిన బరువు కన్నా,అధిక బరువు ఉండటం ఎప్పటికీ మంచిది కాదు.  బరువు   ఆరోగ్యకరం గా తగ్గాలి అంటే కచ్చితంగా కొన్ని పద్ధతులు  అనుసరించాలి. చాలా మంది  త్వరగా బరువు తగ్గాలనే  ఆలోచన తో  డైటింగ్ చేస్తూ దానితో సమానం గా ఎక్సర్‌సైజ్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు అని నిపుణులు తెలియచేస్తున్నారు.  దీని వలన   ఎముకలు ప్రమాదం లో పడతాయి అని  అంటున్నారు .  దీనికి గల కారణం  డేటింగ్  చేయడం తో శరీరానికి అందించవలసిన ఆహారం బాగా తగ్గించేస్తారు.
   అలాంటప్పుడే  ఎక్సర్‌సైజ్ చేస్తే,శరీరంలో ఉన్న కొవ్వు  కరగడం తో పాటు కండరాలకు,ఎముకలకు కూడా సరిపడినన్ని  పోషకాలు అందవు. ఒకే సమయంలో  శరీరంలో ఎక్కువ మొత్తం  పోషకాలు తగ్గడం వల్ల ఎముకల్లో పటుత్వం కోల్పోతాయి అని  ఆరోగ్య నిపుణులు తెలియ చేస్తున్నారు.ఈ విషయంలో ఆడవారు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వయస్సు పెరుగుతున్నప్పుడు  సహజంగానే స్త్రీ  ఎముకలలో బలం తగ్గిపోతుంది.  బలం గా ఉండటానికి పౌష్టికాహారం  అవసరం చాలా ఉంటుంది  డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిపై నార్త్ కెరొలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ  పరిశోధన  చేశారు.
Yoga is the best way for weight loss part 1
Yoga is the best way for weight loss part 1
దానిలో తెలిసిన విష్యం ఏమిటంటే   ఎముకల మధ్యలో ఉండే బోన్‌మ్యారో‌లో ఫ్యాట్ పెరుగుతుంది. సరైన పోషకాలు అందకపోవడం వల్ల  ఎముకలు మొత్తం  ఫ్యాట్‌తో నిండిపోతున్నాయి. ఇది ఎముకల పటిష్టత దెబ్బ తినేలా చేస్తుంది.30 ఏళ్ల వయసున్న  స్త్రీలు రోజుకు 2,000 కేలరీల శక్తి కి  సరిపడా ఆహారం కచ్చితం గా తీసుకోవాల్సిందే. అయితే డైటింగ్ చేసేవారు  30 శాతం తక్కువ ఆహారం తీసుకుంటున్నారు ఈ కారణం గా కేలరీల సంఖ్య  పడిపోతోంది.  ఈ కారణంగా స్త్రీ ల బరువు లో వారానికే చాలా తేడా కనిపిస్తుంది.ఇలా జరగడం వల్ల దీర్ఘకాలంలో ఎముకలకి సంబంధించిన   సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి డేటింగ్   మానేసి… మంచి ఆహారం తీసుకుంటూ  ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చెయ్యడం మంచిది అంటున్నారు నిపుణులు.ఇంకొన్ని జాగ్రత్తలు పాటించడం వలన కూడా బరువు పెరగకుండా చూసుకోవచ్చు.

ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా బాగా  నమిలి  తినడం అలవాటు చేసుకోండి. ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా  తీసుకోవడం వల్ల త్వరగా పొట్ట  నిండి  ఆకలి తగ్గడం వల్ల శరీరంలో తక్కువ మొత్తం లో కేలరీలు చేరుతాయి.పీచు పదార్థాలు బాగా ఉన్న ఆహారం తింటే  చాలా సేపటి వరకు ఆకలి వేయదు.   నీటిని ఎక్కువగా  తాగడం వల్ల ఆహారం తక్కువగా  తినడం జరుగుతుంది. భోజనానికి ఒక గంట ముందు నీరు తాగడం  వల్ల కొంచెం   తిన్న  పొట్ట  నిండిపోతుంది. భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతున్నారు.  ఆహారం తినేటప్పుడు ఫోన్ , టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం  వంటివి  చేస్తే.. ఎంత తింటున్నామనే ఆలోచన లే  ఎక్కువ తినేస్తారు.  బరువు తగ్గడానికి కంటి నిండా నిద్ర చాలా అవసరం.  వీటితో పాటు షుగర్ బేవరేజెస్‌ జోలికి  వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది.


Share

Related posts

Black Fungus: బ్లాక్ ఫంగస్ బాధితులకు హైద‌రాబాద్‌లో చికిత్స ఎక్క‌డంటే..

sridhar

hair: జుట్టుకు సంబంధించిన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం ఇదే… తెలిస్తే ఆశ్చర్య పోతారు!!(పార్ట్-1)

siddhu

కరోనా ఎంత దారుణమైనదో ఈ ఉదంతమే చెబుతోంది!

Yandamuri