అందంగా ఆరోగ్యం గా బరువు తగ్గాలంటే ఇవి తినండి!!

కొంతమంది బరువు ఎందుకు పెరుగుతున్నామో  తెలియకుండానే పెరిగిపోతుంటారు. ఇలాంటి వారు తిరిగి బరువు తగ్గించుకునేందుకు అనేక పాట్లు పడుతుంటారు. రోజూ పండ్లను తినడం  వల్ల మంచి ఆరోగ్యం తో పాటు బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. ఆ పండ్లను తెలుసుకుందాం.

అందంగా ఆరోగ్యం గా బరువు తగ్గాలంటే ఇవి తినండి!!

బొప్పాయి  లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగాలభిస్తాయి.  ఈ పండు ని తినడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గి సులువుగా బరువు తగ్గుతారు. మిరియాల పొడి చల్లుకుని బొప్పాయి ముక్క ల ను తినడం వల్ల మరింత ప్రమోజనం పొందవచ్చు. బొప్పాయిపండు ను  ఒక 2, 3 నెలలు తినడం వలన తేడా మీకే తెలుస్తుంది అంటున్నారు డాక్టర్లు. స్ట్రాబెర్రీస్ లో  ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారని కేన్సర్ కారకాల తో పోరాడతాయని నిపుణులు చెబుతున్నారు.నిమ్మ ఇందు లోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అదుపుచేస్తుంది. తేనె, నిమ్మ కలిపి తీసుకుంటే స్త్రీలు బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.

ఆపిల్స్ రోజు కి ఒకటి తినడం వల్ల శరీరం లో ని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు పొటాషియం ద్రాక్ష లోఎక్కువగాఉండడం వలన  బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది. ఇందు లోని ప్రత్యేక గుణాలు అధిక  దాహాన్ని కూడా తగ్గిస్తాయి. ఆరెంజ్ ఇది చాలా ఆరోగ్యకరం. ఉదయం నిద్ర లేచిన వెంటనే, ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ, ఆరెంజ్ ను తినడం కానీ చేస్తే శరీరం బరువు తగ్గుతుంది.ఇలా పళ్ళు తింటూ బరువుతగ్గితే ఆరోగ్యం అందం కూడా..

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి