మండలి రద్దుపై ఐవైఆర్ ఏమన్నారంటే

Share

అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఏపీలో మండలి రద్దుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్పుడు మండలి రద్దు ఎలా జరిగిందన్న వివరాలను ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

“ఎన్టీ రామారావు గారి సమయంలో నేను ఆర్థిక శాఖలో ఉన్నప్పుడు మండలి రద్దుపై ఆనాటి శాసనమండలి సభ్యులు కొణిజేటి రోశయ్యగారు చెప్పిన ఒక ఉదంతం గుర్తుకు వస్తోంది. రోశయ్యగారి ధాటికి తట్టుకోలేక రామారావు గారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దగ్గరకు పోయి ఆయనను నియంత్రించమని మొరపెట్టుకున్నారు. ఆమె చూస్తానని హామీ ఇచ్చి పంపించారు. తిరుగు ప్రయాణంలో రామారావు గారితో పాటు  ప్రయాణం చేసిన రామానాయుడు గారికి… అతి త్వరలో రోశయ్య గారికి పిలుపు వస్తుందని, చీవాట్లు పడటం ఖాయమని ఎన్టీఆర్ చెప్పారు. రామానాయుడు గారు ఈ విషయం చెప్పడంతో రోశయ్య గారు కలవరపడ్డారు. అనుకున్నట్లే ఇందిరా గాంధీ గారి నుంచి పిలుపు వచ్చింది. ఇందిరను రోశయ్య కలిసినప్పుడు ఏ విధంగా తగ్గాల్సిన అవసరం లేదని, నీ ఉద్ధృతిని అదేవిధంగా కొనసాగించాలని సలహా ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మండలిని ఎన్టీఆర్ రద్దు చేశారు” అని ఐవైఆర్ తెలిపారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

https://www.facebook.com/IYRKRao/photos/a.1898171613840394/2559202497737299/?type=3&eid=ARAMf0BNiBt2iit4tI_jHcEwfG7wR0zs6pqc1Yz2pwEC5hBPfaWccka82G448p4apWIEbG1t1fEAQjcS&__xts__%5B0%5D=68.ARC18jKpmhMmNMyoYu1VzLkAHPHve8Lx1ZO-Rt1uSEO25n_F0ZczI4p3E4DU7MLuwjSYdpEIzYpuRyp1CEbRBDyVKsqF8qCBjfyl3AQ01B2H1g4RzKS5DcIwBapBvXroUUYOFQjyGesZ_wqPlb-8uTm_XuQ86mmSVrORCeFNRvDidegdcVRMSFEmdCnuv45PAGAe3TQcE7W7Uo3qowwu59jPzPn1h_PeJEZZrc2P2BYdrvCWHZ1EqMfJfuS4gQcO4H_wUsOCdkkLDXktcqyGLJ2S9uh5MPkR9PMa4I_rYeWaItGKgWbAvohp6_Utee5vtBZNVkBWbEeVvf9AWGr_2kfqRir1&__tn__=EEHH-R


Share

Related posts

‘ఆ బంధమే వారిని కలిపింది’

somaraju sharma

‘ఏపి రాజధాని ఏదో!?’

somaraju sharma

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జీవిత రాజశేఖర్ ధర్నా..!!

sekhar

Leave a Comment