పవన్ కల్యాణ్ దారి పూర్తిగా మారినట్లేనా!?

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: జనసేన నేత పవన్ కళ్యాణ్ దారి మారిపోయిందన్న వాదు క్రమంగా బలపడుతోంది. వైసిపితో లోపాయకారీ అవగాహన ఉన్న బిజెపి అమరావతి విషయంలో ఆయనను క్రియాశీలంగా లేకుండా చేసేందుకే అకస్మాత్తుగా జనసేనతో పొత్తు పెట్టుకున్నదని బలంగా ప్రచారంలో ఉంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు బిజెపి నేతల ప్రవర్తన కూడా దానిని బలపరిచే విధంగానే ఉన్నది.

తాజాగా పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు వెళుతున్నారు. విషయం ఏమిటయ్యా అంటే అప్పుడెప్పుడో అత్యాచారానికి గురయిన ఒక యువతికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేయడం కోసం స్వయంగా కర్నూలు వెళ్లాలని పవన్ నిర్ణయించారు. నిజానికి అందులో తప్పు పట్టడానికి  ఏమీ లేదు. కానీ ఒక అభాగ్యురాలి కోసం కర్నూలు వెళ్లగలిగిన పవన్ రాజధాని మార్పిడి వంటి అంశంలో ఎలాంటి పోరాటం చేస్తున్నారన్న ప్రశ్న ఆ వెంటనే వస్తోంది.

రాజధానిని విశాఖ తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు రాజధాని గ్రామాలలో పర్యటిస్తుండగా బిజెపి పెద్దల నుండి వచ్చిన పిలుపు మేరకు ఆయన అకస్మాత్తుగా  ఢిల్లీ వెళ్లారు. అక్కడ రెండు పార్టీలూ పొత్తు ప్రకటించాయి. అమరావతి విషయంలో ఉమ్మడిగా పోరాడతామని కూడా రాష్ట్ర బిజెపి నాయకులు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.

పొత్తు తర్వాత రాజధాని ప్రాతంలో లాంగ్‌మార్చ్ నిర్వహిస్తామని ఇరు పార్టీల నాయకులు ప్రకటించారు. అది కూడా పది రోజుల తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. తీరా చూస్తే అది కూడా జరగలేదు. అనివార్య కారణాల వల్ల లాంగ్ మార్చ్ వాయిదా వేస్తున్నామనీ, ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలుపుతామనీ ప్రకటించారు. ఆ తర్వాత ఇంతవరకూ రాలేదు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే కాస్త గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామని కన్నా ఎంత గట్టిగా చెబుతున్నారో రాజధాని మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమనీ, కేంద్రం జోక్యం చేసుకోబోదనీ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అంతే గట్టిగా చెబుతున్నారు. టిడిపి నుంచి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా అమరావతి తరపున మాట్లాడుతున్నారు. బాహటంగా వ్యక్తమవుతున్న ఈ భేదాభిప్రాయలను సరి చేసేందుకు బిజెపి అగ్ర నాయకత్వం ఇంతవరకూ ప్రయత్నించలేదు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

12 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

21 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago