(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై మహారాష్ట్ర పరిణామాలతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ ఫడ్నవీస్ ప్రమాణస్వీకారాన్ని ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా నమ్మక ద్రోహానికి పాల్పడడం కింద అభివర్ణించింది. తెల్లారేసరికి ఎదురయిన షాక్‌కు కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవరా స్పందన మరోరకంగా ఉంది. ప్రఖ్యాత మాఫియా సినిమా గాడ్‌ఫాదర్ నుంచి ఒక కొటేషన్‌ను ఆయన ట్వీట్ చేశారు. నీ స్నేహితులను దగ్గరగా ఉంచు. శత్రువులను మరింత దగ్గరగా ఉంచు.
Keep your friends close, but your enemies closer ~ @godfathermovie pic.twitter.com/h6AaX4WJdn
— Milind Deora | मिलिंद देवरा ☮️ (@milinddeora) November 23, 2019
మేరియో ప్యూజో రాసిన సూపర్ హిట్ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. సినిమా మరింత హిట్ అయింది. శత్రువుల పన్నాగాలు తెలియాలన్నా, వారిని మనం గమనిస్తున్నామన్న సంగతి శత్రువులకు తెలియకుండా ఉండాలన్నా వారిని మిత్రుల కన్నా ఎక్కువ సన్నిహితంగా ఉంచాలని చెప్పేందుకు తండ్రి మరణం తర్వాత గాడ్‌ఫాదర్ వారసత్వం స్వీకరించిన చిన్న కుమారుడు మైకేల్ కార్లియోన్ అంటాడు. ఈ డైలాగు చాలా పాపులర్ అయింది.
మహారాష్ట్ర పరిణామాలకు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కూడా స్పందించారు. అర్ధరాత్రి పూట రహస్యంగా జరిగేది చట్టవ్యతిరేకమైన దుష్టపూరితమైన పనులు. ఎంత సిగ్గుమాలిన పనంటే ప్రమాణస్వీకారం కూడా రహస్యంగా జరపాల్సివచ్చింది. ఈ అక్రమ ప్రభుత్వం ఏర్పాటు స్వీయవిచ్ఛిన్నానికి దారి అని ఆయన ట్వీట్ చేశారు.
Illegal and evil manoeuvres take place in the secrecy of midnight
Such was the shame that they had to do the swearing in hiding
This illegitimate formation will self destruct
— Ahmed Patel (@ahmedpatel) November 23, 2019