(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రిషి సనాక్ బ్రిటన్ నూతన ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు. గత జూలై నుంచి ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న రిషిని ఆర్ధికమంత్రిగా నియమించిన విషయాన్ని ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. బడ్జెట్ సమర్పణకు నెల ముందు ఆందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆర్ధికమంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేయడంతో రిషిని ఆ పదవిలో నియమించారు. రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి అల్లుడు.
39 ఏళ్ల రిషి యార్క్‌షైర్‌లోని రిచ్మండ్ నుంచి పార్లమెంట్‌కు గెలిచారు. భారతీయ సంతతికి చెందిన మరో ఎంపీ ప్రీతి పటేల్ బ్రిటన్ హోంశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆర్ధిక మంత్రిగా ప్రధాని తర్వాత ముఖ్యమైన పదవి నిర్వహించే రిషి ప్రధాని ఆధికార నివాసం నంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్ పక్కిల్లు అయిన నంబర్ 11 డౌనింగ్ స్ట్రీట్‌లో చేరతారు.