అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ‘మంచి సిఎం కాదు-జనాన్ని ముంచే సిఎం’ అంటూ టిడిపి ఒక చిన్న పుస్తకం విడుదల చేసింది. ఇచ్చిన పథకాలకన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ, మాట తప్పారు- మడమ తిప్పారు, అభివృద్ధి రివర్స్ అని పేర్కొంటూ పలు ఫోటోలతో కూడిన 24 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా టిడిపి నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రజలు ఒక్క ఛాన్స్ ఇద్దామని గెలిపిస్తే వారిని మోసం చేశారని విమర్శించారు. ఆరు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఇప్పటికే 62వేల కోట్ల రూపాయలు అప్పు చేశారన్నారు. ఉద్యోగుల జీత భత్యాలు కూడా చెల్లించలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని ఆయన విమర్శించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్ అవినీతిని అరికడతారా అని ప్రశ్నించారు.
A4-24-PAGES-180-DAYS-JAGAN-BOOK