(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జమ్ము కశ్మీర్లో విపరీతంగా కురుస్తున్న మంచు మధ్య డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫొటో ఒకటి వైరల్ అయింది. సరిహద్దులకు కాపలా కాయడం, శత్రువులు జొరబడకుండా చూడడంతో జవాన్ల డ్యూటీ అయిపోతుందనుకుంటే పొరపాటే. ఆ డ్యూటీ చేయడానికి వారు భయంకరమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను భరించాల్సివస్తుంది. అలాంటి పరిస్థితుల్లో విధి నిర్వహిస్తున్న ఒక జవాను ఫొటోను సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కాశ్యప్ కడగట్టూర్ ట్వీట్ చేశారు.
No, this is not Batman. He's Constable Aijaz of CRPF performing his duty in Union Territory of J&K despite massive snowfall. Policing is a 24/7 service. CRPF means business. CRPF stands for professionalism. #Kashmir pic.twitter.com/UvuUoLsHE4
— Kashyap Kadagattur ?? (@iamkash_kr) November 8, 2019
ఈ వ్యక్తి బ్యాట్‌మ్యాన్ కాదు. జమ్ము కశ్మీర్లో హిమపాతం మధ్య విధి నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎజాజ్. పోలీసింగ్ అనేది 24 గంటల డ్యూటీ. సిఆర్పిఎఫ్ అంటే విధి నిర్వహణ. సిఆర్పిఎఫ్ అంటే అంకితభావంతో విధి నిర్వహించడం అంటూ కాశ్యప్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది.
మన సిఆర్పిఎఫ్, సైనిక జవాన్ల త్యాగాలకు శాల్యూట్ అనేది చాలా చిన్న పదం అంటూ ఒకరు ట్వీట్ చేశారు.
Salute is merely a small word to the sacrifices of our CRPF and Army Jawans.
More power to you all for keeping us safe.
???
— Pranavsinh (@Pranavsinh9) November 8, 2019
కశ్మీర్లో కొద్ది రోజుల క్రితం మంచు కురవడం మొదలు పెట్టింది. భారీ హిమపాతంతో మొదట్లోనే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు బందయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనీసం నలుగురు మరణించారు.