NewsOrbit
టాప్ స్టోరీస్

విజయగర్వంతో సభలోకి..!

అమరావతి: వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై చర్య లేనందుకు నిరసనగా రెండేళ్ల క్రితం శాసనసభను బహిష్కరించిన ఆనాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విజయగర్వంతో అదే శాసనసభలోకి సభానాయకుడిగా అడుగుపెట్టారు.

2014లో 67 సీట్లకు పరిమితమయిన వైసిపి 2019 ఎన్నికలలో 50 శాతం వోట్లు సాధించి 175 స్థానాల అసెంబ్లీలో 151 సీట్లు సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని పార్టీ అధినేత ఒంటిచేతితో సాధించారనే చెప్పవచ్చు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ గత అయిదేళ్ల  కాలంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ధైర్యం కోల్పోలేదు.

నవ్యాంధ్ర మొదటి శాసనసభలో సభానాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడు ఈసారి ప్రతిపక్షనేత హోదాలో కూర్చున్నారు. టిడిపి తరపున 23 మంది మాత్రమే ఎన్నికయ్యారు. మిగిలిన ఒక్క సభ్యుడూ జనసేన ప్రతినిధి. ఈసారి అసెంబ్లీలో విశేషం ఏమంటే జాతీయ పార్టీలకు దేనికీ కూడా ఈ సభలో ప్రాతినిధ్యం లేదు.

రాష్ట్రవిభజన జరిపించి 2014 ఎన్నిలలో మట్టి కరిచిపోయిన కాంగ్రెస్ పార్టీ అయిదేళ్ల తర్వాత కూడా ఒక్క సీటూ గెలవలేకపోయింది. జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సిపిఐ, సిపిఎం గెలవడం కాదుకదా అసలు ప్రభావమే చూపలేకపోయాయి. బిఎస్‌పి కూడా జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది కానీ ఫలితం లేకపోయింది.

బుధవారం సభ ప్రారంభం అయిన తర్వాత సభా నాయకుడిగా వైఎస్ జగన్ మొదట సభ్యుడిగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. అనంతరం సభ్యులు వరసక్రమంలో ప్రమాణం చేశారు. 13వ తేదీన ఆముదాలవలస సభ్యుడు తమ్మినేని సీతారాంను సభ స్పీకర్‌గా ఎన్నుకుంటుంది. డిప్యూటీ స్పీకర్‌ను కూడా ఈ సమావేశాలలోనే ఎన్నుకుంటారు.

14 వ తేదీన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాలు 18 వ తేదీ వరకూ జరుగుతాయి.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment