శృంగారం తో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి తగ్గడం తో పాటు , ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందిట. ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం కలుగుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయట! శృంగారం మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతం లో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలు వివరిస్తున్నాయి.
శృంగారంలో అందరి కంటే ఎక్కువగా ఆనందించేది ఎవరనే సందేహం కొంతమందికి వస్తుంటుంది. అలాంటి సందేహమే యూకేలో ని లేలో అనే సర్వే సంస్థకు కూడా వచ్చింది. దీంతో శృంగార జీవితాలపై ఓ సర్వేచేసింది. 2వేల మంది పురుషులు, స్త్రీలు ఈ సర్వేలోపాల్గొన్నారు. వివిధ రకాల ఉద్యోగాలు,వృత్తులు, చేసేవారు ఈ సర్వేలో పాల్గొన్నారు.ఆ సర్వే ప్రకారం.. అత్యంత ఎక్కువగా శృంగారాన్ని ఆనందించేది రైతుల ని తేలింది.
రైతులు తీసుకొనే ఆహారం, శారీరక శ్రమ వారిని శృంగార విషయం లో అగ్రస్థానం లో నిలిపిందిట .రైతులు తమ శృంగార జీవితం అద్భుతంగా ఉందని 33 శాతం మంది తెలిపినట్టు సర్వే సంస్థ వెల్లడించింది. రోజుకు కనీసం ఒక్కసారైనా తాము తమ భాగస్వామి తో శృంగారం లో పాల్గొంటామని చెప్పారు.రైతుల తర్వాత పడక గదిలో బీభత్సంగా ఆనందించేవారు ఆర్కిటెక్ట్‌లు అట.
ఆర్కిటెక్ట్‌లు తమ శృంగార జీవితం ఉల్లాసభరితం గా ఉత్సాహంతో ఉందని 21 శాతం మంది చెప్పారు. రైతులు, ఆర్కిటెక్ట్‌ల తర్వాతస్థానం లో హెయిర్ డ్రెస్సర్లు ఉన్నారు. హెయిర్డ్రెస్సర్లు తమ శృంగార జీవితం బాగుందని 17 శాతం మంది చెప్పారు. ఉపాధ్యాయులు ,న్యాయవాదులు తమ శృంగార జీవితం నిస్సత్తువగా సాగుతోందని చెప్పారు. జర్నలిస్టులు అందరికంటే చివరి స్థానంలో ఉన్నారు. జర్నలిస్టులు కనీసం నెలలో ఒక్కసారి కూడా తాము పడక సుఖా న్ని అందుకోలేకపోతున్నామని తెలిపారు..