NewsOrbit
వ్యాఖ్య

ఔరా… ఔరవురా…

 

ఓవైపు ఎముకలు విరగ్గొడుతున్నా…. మరోవైపు పిడికిళ్ళు బిగించి ఎగిసిపడుతున్న ఆ పిల్లలకు అండగా……

నిన్నటి ఆ గొప్ప సంఘటన పట్ల స్పందించయినా రేపు మనమూ……

ప్రియమైన మిత్రులారా,

నిన్న… అదే “నిర్భయడే” రోజు… రాత్రి సమయం.. .. కాదు…. రాత్రికి కొద్ది ముందే….. అదే… చీకట్లు ఇంకా ముసరక ముందే…. ఔనౌను… అది సంధ్యా సమయమే.. అప్పుడు అక్కడ ప్రారంభమైన ఆ… అమరదృశ్యం ఏమిటంటే…. ఓహో….అది ఎక్కడ అంటారా?… ఔను మిత్రులారా! నాలో పొంగి పొరలే భావావేశంలో ఆ వివరాలు చెప్పడం మరిచిపోయా… మన్నించండి… అదే… మనదేశ రాజధాని ఢిల్లీలో… ఓహో.. అది ఎక్కడో కూడా చెప్తా… అది దేశం నలుమూలల నుండి వచ్చే నిత్య జన సంచారంతో కిక్కిరిసే చోటు… అది నిత్యం…. పలకరింపులూ… పులకరింపులతో… పరవశించే సందడి స్థలం….. దాని పేరు….. అది అందరూ ఎరిగినదే… అదే… ఇండియా గేటు… అదేనండీ…. నాడు ‘నిర్భయ’ సంఘటనపై జన నీరాజనాలతో నిలువెత్తు నిరసనతో పోటెత్తిన స్థలమే సుమా… అనుకోకుండా మళ్లీ ‘నిర్భయడే’ నాడే… ఏడేళ్ల తర్వాత అదే రోజు… అదే చోట.. మరిచిపోయా… అదే గడ్డకట్టే చలిలో కూడా… ఐతే చలిని తరిమివేసే వేడి పుట్టిన… ఔను… ఉడుకెత్తే రక్తనాళాలు, పొంగే నరాలు పుట్టించే కవోష్ణ వాతావరణంలో….

నిన్న సంధ్యా సమయం నుండే… ప్రారంభమై…. రాత్రి 10 గంటల వరకూ… నాలుగు గంటలకి పైగా… అక్కడ కూడిన 7 నుండి 8 వేల మంది… పోలీసు నిఘా మధ్య…. సిసి కెమెరాల ఆధారంగా క్రిమినల్ కేసులు పెడతామనే పోలీసు బెదిరింపుల మధ్య….. ప్రతి విద్యాసంస్థ నుండి ఎవరి కదలికలు ఏమిటో గూఢచారి వ్యవస్థ వెంటాడే స్థితిలో…. అట్టి వాతావరణంలో కూడా… వాళ్ళను ఎవరు ఎలా సమీకరిస్తే అక్కడకు వచ్చారు? సందేహమా… ఎవరికి వాళ్లే… ఆఘమేఘాలపై… ఆ సమీకరణకు తరలిన…. పోస్టర్లు లేవు… కరపత్రాలు లేవు…. ఓ రెండు రోజుల వ్యవధి లేదు. కనీసం ఒక్క రోజు కూడా…. ఐనా ఓ వెల్లువ… అది కేవలం ఏకవాక్య సందేశంతోనే… అది ఏమిటా? “నిన్నటి పోలీసు భీభత్సంపై సమాలోచన కోసం ఈరోజు ఇండియా గేటు వద్ద కలుద్దాం” అనేది ఆ సందేశం…. ముందస్తు వ్యూహం లేదు. సమీకరణకు పధకమూ లేదు… పై పోస్టింగ్ సోషల్ మీడియాలో నిన్నటి ఉదయాన వెలిసింది. అది కూడా కేవలం ఓ 200 లేదా 300 మంది సమీకరణ అంచనాతోనే… ఆ ఏకవాక్య సందేశం జీవిత కాలం… ఎంతో తెలుసా? గరిష్ఠంగా ఓ ఐదారు గంటలే! అది చరవాణిలో చక్కేర్లు కొట్టి…. ఒకరి నుండి ఒకరికి… ఒక కళాశాల నుండి మరో కళాశాలకు…., అలాగే విశ్వ విద్యాలయాలకూ…. అది నలుమూలలా తలుపు తడుతూ ప్రయాణం…. అట్టి ప్రచార కృషిలో అధ్యాపక వర్గాల పాత్ర కూడా అద్భుతం..

సూర్యుడి సాక్షిగా 500 మంది… సూర్యుడు అస్తమించాక తన కాంతిని ఇంకా ప్రసరిస్తుండగా ఆ సంఖ్య 1000కి… సంధ్యవేళ ముగుస్తున్న వేళ అబ్బురమే… JNU, DU, జామియా మిలియా ఇస్లామియా, అవే కాకుండా మరొకట్రెండు కళాశాలల నుండి మాత్రమే, అది కూడా కొందరేసి చొప్పునే… కేవలం సమాలోచన కోసం… అదే తొలి అంచనా… తప్పిన ఆ అంచనా… చీకట్లు ముసిరే సరికే ఇండియా గేటు వైపు బారులు తీరి దూసుకొచ్చే దృశ్యాలు… రాత్రి 7 గంటలకు దాటిన ఐదు వేల మంది… 8pm…. 9pm… ఇంకా వస్తూనే… ఇది తెలియని వాళ్ళు కూడా ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసి ఉరుకులు, పరుగులతో… మరో రెండు వేల వరకూ… వచ్చే వాళ్ళు 9 pm వరకూ… రాత్రి 10 గంటల వరకూ కొనసాగిన ఆ సమాలోచన… అలవాటులో పొరపాటు మాట్లాడా.. అది సమాలోచన కాదు, సమైక్య సమర సందేశమిచ్చే సభగా రూపాంతరం…

ఆ అనూహ్య, అసంఖ్యాక సమూహం… వెంటనే ఓ కొత్త ఐడియా… ఓ గొంతు లేచి “కొవ్వొత్తులు వెలిగిస్తే” అని అడిగింది… ‘ఔను, వెలిగిద్దాం’ అంటూ వంత పలికిన వేల గొంతులు… పావుగంటలో కొవ్వొత్తుల రాక… ఇంతలో మాయదారి చీకటి రాజ్యపు మనుషులు.. అదే పోలీసులు.. “వెలిగిస్తే నేరం” అంటూ నిషిద్ధ ఆజ్ఞ జారీ… ఔను వాళ్లేమి చేస్తారు? వాళ్లకు మోడీ, షా ఆజ్ఞ… వాళ్ళకి “పెట్టుబడిదార్ల” ఆజ్ఞ…. అదే జనం భాషలో “అ”, “ఆ” లు.. అర్ధం కాలేదా? అ ఆ అంటే అమ్మ ఆవు కాదు… అది పాత పాట, గత మాట! నిఘంటువు మారింది. కొత్త అర్ధం ‘అ’ అంటే అంబానీ, ‘ఆ’ అంటే ఆదానీ! వీళ్ళ కోసమే “నమో”! అంటే మోడీ, షా! వాళ్లు ప్రేమించేది చీకటినే… తెరమీద “నమో”! తెర వెనుక “అ ఆ”! ఔను, చీకటి పాలనే వాళ్ళ లక్ష్యం! కాదు, వారి నడక చీకటి నుండి చిమ్మచీకటి పాలన వైపు… మోడీ, షా ల భగీరథ తపస్సు! అందుకే నమో అంటే చీకటి ప్రియులు… వారికి గబ్బిలజాతి జీన్స్ ఉన్నాయేమో! వెలుతురు పై ద్వేషం… వెలుగుపై పగ! గాన కొవ్వొత్తుల వెలుతురుపై కూడా అక్కసు… ఆ వెలుగు రేఖలు కాగడాలై తమ చీకటి కొట్టాలను తగలబెడతాయనే భయం…. దివిటీలై దగ్ధం చేస్తాయనే భీతి… అందుకే కొవ్వొత్తుల వెలిగింపుని నిషేదిస్తూ రాజ్య హుకుం… ఆ రాజ్య హుకుం పై నిన్నరాత్రి అక్కడ కొన్ని క్షణాలు మీమాంస… ఇంతలో అందులో ఓ మెదడుకు తట్టిన ఓ గొప్ప ఐడియా.. వెంటనే ఆ గొంతు అరిచింది. ‘ఇదిగో, ఇదే టార్చ్ లైట్’ అంటూ… ఆయన తన చేతిలో సెల్ ఫోన్ టార్చ్ లైట్ ని వెలిగించి చూపిస్తూ…. ఇకచూడండి.. క్షణాలలో… తమతమ జేబులో నుండి బయటకు తీసిన ఫోన్లు… ఒక్కసారిగా వెలిగిన వేల కొవ్వొత్తులు… వెలుగొందిన ఆ ప్రాంగణం… మౌనంగా పోలీసు… చీకటి రాజ్య పాలన పై పోరాడే ఉద్యమదీక్షకి స్ఫూర్తి ఇచ్చే….. ఆ ప్రోగ్రాం… రాత్రి 10 గంటల వరకూ…. గడ్డకట్టే చలిలోనే… కదలని ఆ జన సమూహం… చెదరని వారి సంకల్పం… ఇక ముగిద్దాం అనెంత వరకూ కొనసాగిన తీరు… ఆహా… ఏమి ఆ అపురూప దృశ్యం…

అక్కడ నిన్న రాత్రి గుమిగూడిన ఆ వేల మంది… వారి రెండేసి చేతులు… అవి బిగిసిన పిడికిళ్ళయ్యు…. ఎగిసిన ధర్మాగ్రహ మంటలై, ఎగిరే సమర పతాకాల ప్రతీకలై, అహో.. ఏమని వర్ణించాలి ఆ అద్భుత సన్నివేశాన్ని? ఆ వేల కంఠాలు ఎలుగెత్తే స్వరాలై… ఖండించే శరాలై… గర్జించే గళాలై…. ‘హమ్ ఏక్’ నాదమై… ‘జీతేగా’ నినాదమై.. మిన్నంటే శబ్దమై… కళ్లు చెదిరే అమర దృశ్యమై…. అహో… చీకటిపై పోరాడే ఆ జ్వాలాతార మండల కమనీయ దృశ్యం…

ఓహో… ఇంతకూ వాళ్ళు ఎవరనేది సందేహమా? ఔను, అంతకు ముందు రోజు బీభత్స రాజ్య దాడికి గురైన వాళ్లే! అదే పిల్లలు… ఐతే తెల్లారేసరికి అంత ధైర్యాన్ని వాళ్లేలా కూడదీసుకున్నారనే కదా సందేహం… ఔను, వాళ్ళు ఆ ముందు రోజు ఎముకలు విరిగిన… కండలు కమిలిన… తలలు పగిలిన… వాళ్లే… ఐతే మరిన్ని విద్యాసంస్థల నుండి కూడా…. అనేక కొత్తకళాశాలల నుండి… ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల నుండి…. హయ్యర్ టెక్నీకల్ కోర్సుల నుండి…. మరిచిపోయా… IIT ల నుండి…. మెడికల్ కళాశాలల నుండి…. ఎప్పుడూ ఇలాంటివి ఎరుగని ప్రయివేటు అశోక విశ్వవిద్యాలయం నుండి కూడా… ఇంకో మాట… పిల్లలకు పాఠాలు బోధించే అధ్యాపకులు కూడా అందులో ఓ ఐదారు వందల మంది….. మరో రెండు, మూడు వందల మంది మేధో, ప్రజాతంత్ర వర్గీయులు కూడా! ఆ కదలిక ఓ అద్భుత దృశ్యం! ఇంకో మాట! ముందురోజు గాయపడ్డ విద్యార్థులు ఆ బొబ్బలెక్కిన చర్మాలతోనే…. కారే నెత్తుటి గాయాలతోనే… ఆ గాయాలకు కట్లు కట్టుకునే…. అనుమనమా? ఇది నిజం! ఇండియా గేటు సాక్షిగా…. అబ్బే అతిశయోక్తి కానే కాదు. ఆ ఇండియా గేటు మీద వెలిగే అమర జ్యోతిని అడగండి… సాక్ష్యం చెబుతుంది…

నిన్న రాత్రి అక్కడ ఆ నాలుగు గంటలూ ఓ పెద్ద కలకలం… కోలాహలమూ…. అయ్యో, అవతల వాళ్ళ గుండెల్లో కలవరం కూడా…. ఆహా… ఏమి ఆ హోరు… జోరు కూడా…. పులకరించిన ఆ పుడమి తల్లి… ప్రతిధ్వనించిన ఆ జనసమూహం… కళ్ళు చెదిరే ఆ అద్భుత దృశ్యం….. రేపటి గూర్చి ఆశలు రేపే ఆ మధుర ఘట్టం…. దేశయువతరానికి ఉద్యమ సందేశమిచ్చే వాళ్ల సంకల్పం… వారిని వెన్ను తట్టిలేపే ఆ నెత్తుటి మరకల కుర్రవాళ్ల పట్టుదల… అహో..

ఓహో… వాళ్ళపై అలా అవతలి వాళ్ళు అలాంటి ఆరోపణలు చేయొచ్చని సందేహమా… అర్ధమైనదిలే… వాళ్లకు అది అలవాటే! ఔను… చీకటిని ప్రేమించే గబ్బిల జాతీయుల కళ్ళకు వాళ్ళు అలాగే కనిపిస్తారు కదా! ఔను మత కళ్ళద్దాలు ధరించే వాళ్ళు అలాంటి ఆరోపణలు చేస్తారు. నిన్నటి వేలమందిలో రెండు వంతులకు పైగా ఎవరంటే… ఆ నిజం చెబితే అపోహలు తొలగి పోతాయి. ఆ పిచ్చి ప్రేలాపనలు చేసే వాళ్ల మతి చలిస్తుందేమో! ఆ పచ్చి అసత్యాలు పలికే వాళ్ళకి తల తిరుగుతుందేమో!

అక్కడ నిన్న బిగించిన పిడికిళ్లలో… ఎగిసిన ధర్మాగ్రహ మంటల్లో…. ఎలుగెత్తిన కంఠాల్లో… గర్జించిన గొంతుల్లో… నెత్తుటి మరకల్లో…. పగిలిన తలల్లో… కమిలిన చర్మదారుల్లో… బొబ్బలెక్కిన దేహాల్లో… గాయాలకు కట్టిన కట్లల్లో… ఆ చీకటి ప్రియుల భాషలో చెప్పాలంటే, మూడింట రెండు వంతులకు పైగా హిందువుల పిల్లలే…. ఇంకో మాట… ఆకాశంలో సగం రాజకీయాల్లో నేడు గాలిలోని నినాదం కదా! సగం కాకపోయినా, అందులో మూడో వంతు మందికోసం పెట్టిన బిల్లు పార్లమెంట్ హాలు లో అటక మీద బూజు పట్టి….. కానీ అదే పార్లమెంట్ కు కూతవేటు దూరంలోని ఇండియా గేటు వద్ద దేశ యువతరానికి సందేశమిచ్చే నిన్నటి నిరసన ప్రదర్శకుల్లో సగం మంది అమ్మాయిలే! అదో అపూర్వ కదలిక! ఓ సందేశమే!

అంతకు ముందు రోజు, సరిగ్గా 24 గంటల ముందు, అంటే 15వ తేదీ సాయంత్రం, మరో విశేషం కదలిక…. ఔను ఆరోజు మధ్యాహ్నం జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై యుద్ధకాండ తెలిసిందే! ఆ మృత్యుకాండ రోజు సాయంత్రం ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట వేలాది మంది విద్యార్థుల నిరసన…. భీరత్వం కి దూరంగా… ధీరత్వానికి ప్రతీకలుగా…. గంటల తరబడి…. పైగా ఎముకలు కొరికే చలిలోనే…. ఎక్కడ? ఢిల్లీ నగర నడి బొడ్డున…. ప్యారేలాల్ భవన్ వద్ద… ఆదాయపన్ను చీఫ్ కార్యాలయం దగ్గర… ఆ ఆఫీసు ప్రాధాన్యత ఏమిటో తెలుసా? బడా కార్పొరేట్ కంపెనీలకు ₹లక్షల కోట్ల రాయుతీలిచ్చే… వేతనజీవుల నుండి ₹లక్షల కోట్లు పిండుకునే బందిపోటు పన్ను వ్యవస్థకు… అది ప్రాతినిధ్యం… అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థకి నాడీ మండల కేంద్ర కార్యాలయం… దాని దగ్గరే! దాని చెంతనే పోలీసు HQ వద్ద వేలమంది చలిలో… గంటల కొద్దీ…. తిరిగి 24 గంటల్లోనే అంతకంటే రెట్టింపు సంఖ్యలో… రెట్టింపు దీక్షతో… రెట్టింపు విద్యా సంస్థల నుండి…. నిన్న తిరిగి ఇండియా గేట్ వద్ద… మరి మన సంగతి…

తెలుగు సమాజానికి గల గత & ఘన నేపధ్య చరిత్రల ప్రస్తావన లోకి వెళ్లడం లేదు. తెలుగు సమాజం నిద్ర పోలేదు. మత్తులో అసలే లేదు. అది స్పృహలోనే ఉంది. అది చీకటి యుగం వైపుకు సమాజ గమనాన్ని అంగీకరించదు. ఇది సందేహం లేని నిజమే! కానీ అది మంచం మీద పడుకొని స్పృహతో చీకటి పాలకుల చర్యలని నిశిత విమర్శనా దృష్టితో పరిశీలిస్తోంది. అప్పుడప్పుడు చీకటి పాలకుల వికృత చర్యలపై అరుస్తోంది. అరుదుగా లేచి కరుస్తానని కూడా హెచ్చరిస్తోంది. రేపటి పోరాటాల గూర్చి యోచన, సమాలోచనలు చేయకుండా మౌనంగా మాత్రం లేదు. ఐతే అది ఇంకా గర్జించే స్థాయికి చేరలేదు. దీన్ని చూసి తెలుగు సమాజం నిద్రలో ఉందనీ, ఇక్కడి పాలక వర్గాలు అండతో దానిని మతమాదక ద్రవ్యాల వినియోగం ద్వారా మత్తులోకి కూడా క్రమంగా తీసుకెళ్లొచ్చనీ ఢిల్లీ పీఠం భ్రమలో వుంది. నిజానికి తెలుగు సమాజం నిద్రపోలేదు. ఐతే అది నిద్రావస్థ లో కాకుండా, జాగృతావస్థలో మంచాలపై పడుకొని ఉందని అనవచ్చునేమో! ఆ మాట కూడా తప్పైతే సవరిద్దాం. కానీ దానికి ఒక ఛాన్స్! ఓ ఛాయిస్! నేడు ఢిల్లీ చీకటి పాలకుల భ్రమల్ని పటాపంచలు చేసే అవకాశం మాత్రం ఇప్పుడు తెలుగు సమాజానికి వచ్చింది.

ఆ పిల్లల్లో సుకుమారంగా పెరిగిన వాళ్ళూ, సుఖవంతంగా జీవించే అవకాశాలు వున్న వాళ్లూ, ఉన్నతోద్యోగాలు పొందే సౌలభ్యం వున్న వాళ్లూ, శ్రామిక వృత్తులతో అనుభవం లేని వాళ్లూ, రాజకీయ సంస్కృతి తో సంబంధం లేని వాళ్లూ, తల్లిదండ్రులతో కూడా ఏనాడూ ఒక్క దెబ్బ తినని వాళ్లూ వున్నారు. ఐనా విశాల దేశ ప్రయోజనాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, భవిష్యత్తు తరాల కోసం ఫాసిస్టు రాజ్య వ్యవస్థ కు వ్యతిరేకంగా నేడు ఉక్కు దీక్షా సంకల్పాలతో సమరశీలంగా ఆ పిల్లలు ఉద్యమిస్తున్నారు. యావత్తు దేశంలో నేడు యువతరం, ముఖ్యంగా విద్యార్థిలోకం పిడికిళ్ళు బిగించి, పోరుదారి లో నడుస్తోంది. ముఖ్యంగా అది నేడు దేశరాజధానిలో మరో ముందడుగు వేస్తోంది.

నిన్న ఏక వాక్య సందేశంతో ఇండియా గేటు దద్దరిల్లింది. మరి తెలుగు సమాజంలో కూడా అలాంటి ప్రయత్నాలు ప్రారంభిస్తే… ఇప్పుడు తమది మొద్దుబారిన మెదడు కాదని నిరూపించుకునే ఒక గొప్ప సువర్ణావకాశం తెలుగు సమాజానికి వచ్చింది. చస్తున్నా… లేస్తున్న వాళ్ళ కోసం….. ఎముకలు విరగ్గొడుతున్నా.. విరగబడి తిరగబడుతున్న వాళ్ళ కోసం… గాయపడ్డా గానమై గొంతెత్తి సమరగీతం పడుతున్న వాళ్ళ కోసం…. మనమూ గొంతెత్తే ఆలోచన చేస్తే… ఆ పిల్లల కోసం రోడ్డెక్కి బాసటగా నిలిస్తే… చీకట్లను ముసరనివ్వకుండా మనమూ ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగిస్తే… అక్కడ మన పిల్లల వంటి వాళ్ళు మనందరి కోసం చస్తుంటే, మనం ఇక్కడ చూస్తుండే వాళ్లుగా మిగిలి పోకుండా…. అట్టి సామాజిక అపరాధం చేయకుండా…. ఈ భావన అందరిలో ఉండనైతే ఉంది. ఉంటుంది కూడా! కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరనేదే అసలు సమస్య! తెలుగు సమాజంలో విజ్ఞులు, మేధావులు, ఆలోచనాపరులు అధిక సంఖ్యలో వున్నారు. అది ఎక్కడో ఓ చోట.. ఓ బృందం ద్వారా… ప్రారంభం కావాలి. ట్యాంక్ బండ్, ఇందిరా పార్కు, లెనిన్ సెంటర్, జగదాంబ సెంటర్, క్లాక్ టవర్… ఇలాంటి ఎన్నో… ఎన్నెన్నో… కూడళ్లు… జనసమాహార కేంద్రాలు…. ఆయా నగరాలు, పట్టణాల్లో… ఇంకా పల్లెలూ, ఊర్లూ… వాడలూ, గూడేలలో… తెలుగుసీమలో ఇలా ఎన్నో… ముసురుకొస్తున్న చీకట్లపై….., మంచుకొస్తున్న ముప్పుపై… గొంతు విప్పే ఓ ప్రయత్నం కోసం… తలకొక్క నూలుపోగు వేస్తే…. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి సంఘాలు కూడా ఒకింత ఎక్కువ చొరవ తీసుకుంటే….. ఢిల్లీ, మరియు దేశవ్యాపిత నిరసన వెల్లువలందించే స్పూర్తితో కదిలే ప్రయత్నం చేస్తే… అందుకై ఎక్కడో ఓ చోట, ఏదో ఓ మేధో బృందం… ఓ లౌకిక… లేదా.. ఓ ప్రజాతంత్ర బృందం…. లేదా మరో మరో సమూహం… ఓ చొరవ చేస్తే… ఓ నిర్దిష్ట ప్రయత్నం చేస్తే… ఫలితం ఉండదా? కదలిక రాదా? ఆశాజీవులుగా… ఆలోచనల్ని పంచుకుంటూ ముందుకు సాగుదాం. నేడు వాళ్ళ కోసం. రేపు మనకోసం. ఎల్లుండి మన పిల్లల కోసం. ఆలోచిద్దామా?

ప్రసాద్ ఇఫ్టు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment