చెన్నై: బైక్ మీద వెళ్లేటప్పడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నిబంధన ఉంది. కానీ చాలా మంది దానిని పట్టించుకోరు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అయితే, బైక్పై వెళ్తోన్న ఓ వ్యక్తి తాను హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా తన వెనుక కూర్చున్న కుక్కకు కూడా హెల్మెట్ పెట్టాడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్పై శునకంతో కలిసి వెళ్తున్నాడు. తాను హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నాడు. శునకం తలకు కూడా హెల్మెట్ పెట్టాడు. మనిషి మాదిరిగానే శునకం వెనుకాల కూర్చుంది. ఆ కుక్క తన ముందు కాళ్లను డ్రైవ్ చేస్తున్న తన యజమాని భుజాలపై ఉంచి సపోర్టు తీసుకుంది. అది కూడా దర్జాగా కూర్చొని హాయిగా ప్రయాణం చేసింది. ఇది చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుక్క హెల్మెట్ ధరించిన దృశ్యాలను ప్రమోద్ మాధవ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశాడు.
https://twitter.com/madhavpramod1/status/1214415853065666560
‘భద్రత కోసం కుక్క హెల్మెట్ ధరించింది. శునకంపై ఆ యజమానికి ఉన్న సంరక్షణను ప్రశంసించాల్సిందే’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను పెంచుకుంటోన్న కుక్కకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ ద్విచక్ర వాహనదారుడు తీసుకున్న జాగ్రత్తలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను చూసైనా హెల్మెట్ పెట్టుకోని వారు మారతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, రద్దీ ఉండే రహదారిలో కుక్కను ఇలా బైక్పై కూర్చోబెట్టుకుని వెళ్లడం సరికాదని, దానికి ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యులు అని మరికొందరు ప్రశ్నించారు.
This is not correct method to travel with pet animals.
— KangeyanD (@kangeyan50) January 7, 2020
https://twitter.com/AlfaShenoy/status/1214465927351136256
దేశంలో ముంబై, బెంగళూరు, న్యూ ఢిల్లీ లాంటి నగరాల్లోనే బైక్ వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. మోటార్ వెహికల్ చట్టంలో ఈ నిబంధన ఉంది. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించి, వెనుక సీట్లో ఉన్న వారికి హెల్మెట్ లేకపోతే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదాల్లో బైక్ వెనుక కూర్చున్న వ్యక్తులు చనిపోయిన కేసులు పెరుగుతుండటంతో.. ట్రాఫిక్ పోలీసులు బైక్పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి అని అంటున్నారు.