NewsOrbit

Month : April 2020

5th ఎస్టేట్

శ్రీకాకుళం కరోనా కథ – ఇంతింత కాదయా ..!

siddhu
  గత కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలే ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్నాయి. వాటిని చూసి మిగతా జిల్లా ప్రజలు కూడా త్వరలోనే తాము కరోనా ని నియంత్రించి ఆ జాబితాలోకి వెళ్ళిపోదామని ఆశగా కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో మొన్న నాలుగు కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రజలంతా అవాక్కయ్యారు. ఆ నాలుగు కేసులు కి కారణం ఒకడే. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు రాగా మిగిలిన వారికి కూడా అంటించాడు. తాజాగా ఇప్పుడు జిల్లాలో మరో కరోనా కేసు నమోదు కాగా ఇంతకుముందు వచ్చిన నాలుగు కేసులకు మరియు ఇప్పుడు వచ్చిన ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. దీనితో ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయింది. విషయం ఏమిటని ఆరా తీస్తే శ్రీకాకుళం జిల్లా పి ఎస్ కాలనీకి చెందిన ఈ విద్యార్థి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. లాక్ డౌన్ కన్నా ముందే ఇంటికి చేరుకున్న కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించడం గమనార్హం. అయితే ఇప్పుడు అతనికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ మర్కజ్ కు హాజరైన వ్యక్తులతో ట్రైన్ ప్రయాణం చేసి ఉండటం వల్ల ఇతనికి కరోనా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇతను అధికారులకు సమాచారం ఇచ్చి క్వారంటైన్ కు వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఏదైనా చాలా అనూహ్యరీతిలో ఒక్కసారిగా ఈ జిల్లాలో ఐదు కేసులు రావడం ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా ఇప్పుడు నమోదైన తాజా కేసు శ్రీకాకుళం టౌన్ లో మొదటిది. ఇంతకుముందు నమోదైన 4 కేసులు పాతపట్నం ప్రాంతానికి చెందినవి. ప్రస్తుతం సదరు విద్యార్థి, టౌన్ లో ఏఏ ప్రాంతాల్లో తిరిగాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అతడు నివశిస్తున్న పీఎన్ కాలనీని పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పోలీసులు-అధికారులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు....
5th ఎస్టేట్

పెద్దల కీ – పేదల కీ తేడా అదేనన్న మాట .. RBI చూపించిన చలన చిత్రం ! 

Siva Prasad
  ఆర్బీఐ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత దేశ ప్రజలకు ఒక మాంచి చలనచిత్రం చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో 68,607 కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తల రుణాలను రైట్ ఆఫ్ చేసింది. ఇవి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన టాప్-50 కి చెందిన జాబితా వారి మొత్తం మాత్రమే కావడం గమనార్హం. ఇది కూడా ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన సమాచారం.   అయితే రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు, బ్యాంకర్లు చెబుతున్న కూడా సాంకేతికంగా రుణమాఫీ అన్నా.. పద్దుల మార్పిడి అన్నా… ఇక వారి దగ్గర నుండి బకాయిలను రాబట్టలేమని చెప్పి చేతులెత్తేయడం. ఎగవేతదారుల హామీగా పెట్టినా ఆస్తులన్నింటినీ వేలం వేశాక.. వీలైనన్ని మార్గాల్లో డబ్బులు వసూలు చేయగా ఇంకా బకాయిలు మిగిలితే చేసేది ఏమీ లేక వాటిని రైటాఫ్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇలా రైట్ ఆఫ్ పొందినవారిలో అత్యధికులు సమాజంలో ధనికులుగా చలామణి అవుతూ కోట్ల రూపాయల విలువ చేసే కార్లలో తిరిగే కుబేరులే. ఇక సామాన్యుల విషయానికి వద్దాం. లాక్ డౌన్ విధించింది ప్రభుత్వమే. అసలు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా కారణం కూడా ప్రభుత్వమే. ఎలాంటిది ఇటువంటి క్లిష్ట సమయంలో మూడు నెలలు ఈఎంఐ కట్టలేము మొర్రో అని అంటే అది వాయిదా వేసుకునే ఛాన్స్ ఇచ్చిన ఆర్బీఐ ఏదో పెద్ద మేలు చేసినట్లు పోజ్ కొట్టి చివరికి ఆ వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ కలిపేసి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సామాన్యులకు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టేంత సీన్ లేదు కదా. అదే బడా పారిశ్రామికవేత్తలు అయితే వీటిని మొండి బకాయిలుగా చేస్తారు. వాళ్లకు ఏమో ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం. ఇలా వాళ్లు వేలాది కోట్లు ఎగ్గొట్టి తిరుగుతుంటే వారిని ఏమీ చేయలేక సామాన్యుల మీద పడి దోచేస్తుంటారు. చివరికి సామాన్యులను ట్యాక్సులు అడగడానికి మనసు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతకీ అలా రుణాలు మాఫీ చేయించుకున్నవారి లిస్ట్ చూస్తే నీరవ్ మోడీ మామ మోహుల్ చొక్సీ, బాబా రామ్ దేవ్, విజయ్ మాల్యా, మన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు. రేపు లాక్ డౌన్ ముగిశాక తమ రుణాలు కట్టడానికి ఇబ్బంది పడే సామాన్యులు ఎవరు అంటే మన ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్న, వెంకట్రావు 20 సంవత్సరాల నుండి సొంత ఇంటి లోన్  కట్టుకుంటున్న రమేషు… వీరి చివర ఆటో నడుపుకునే సైదులు. ఇదీ మనందరం జీవిస్తున్న ఆధునిక జీవిత చలన చిత్రం....
5th ఎస్టేట్

తెలుగునాట రాజకీయం అంతే మరి .. సంచయిత కే అలవాటైంది అంటే అర్ధం చేసుకోండి 

Siva Prasad
మన తెలుగు రాష్ట్రంలో రాజకీయం ఒంటబట్టించుకోవడం అరటికాయ తిన్నంత సులువు. ఏం చదువుకున్నా.. ఎంతటి అనుభవం ఉన్నా.. ఏ పరిస్థితుల మధ్య పుట్టి పెరిగినా ఒక్కసారి పదవి చేతిలో పడింది అంటే చాలు రాజకీయం...
5th ఎస్టేట్

పరీక్ష పెరిగే… ఫలితం పెరిగే…!

Srinivas Manem
  ఏపీలో ఈ మధ్య కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవును నిజమే…! తెలంగాణ లో ఈ మధ్య కరోనా కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అవును. నిజమే…! ఏపీలో కరోనా కేసుల నియంత్రణలో జగన్...
5th ఎస్టేట్

నిమ్మగడ్డ కేసు; కోర్టు వాదనల్లో కొత్త వివాదం…!

Srinivas Manem
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై కోర్టులో వాదనలు భిన్నంగా సాగుతున్నాయి. ఈరోజు ఏకంగా హైకోర్టు సీజే కి ఆగ్రహం వచ్చే ఘటన జరిగింది. దీనిలో కొత్త అనుమానాలు కూడా...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సంచలనం కోసం ఎందుకీ వ్యాఖ్యలు…!

Srinivas Manem
మంత్రి మోపిదేవి వెంకటరమణ నిన్న ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సాధారణంగా రాజకీయంలో అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, అవినీతి కథలు, ఘాటు వ్యాఖ్యలు వినిలిస్తాయి. కానీ ప్రాణాంతకమైన వైరస్ పై కూడా ఒకరిపై...
5th ఎస్టేట్

కరోనా కాటు – ప్రపంచానికి పాఠం

Siva Prasad
sample 7 వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది...
5th ఎస్టేట్

జగన్ మనసు మళ్ళీ మండలి వైపు ?

Siva Prasad
sample 6 ఈ మండలి వ్యవస్థ జగన్ కి అనేక తలనొప్పులు తీసుకొస్తుంది. పాపం మూడు రాజధానుల కథకి విరామం పడడానికి మండలి అడ్డుగా ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డని సాగనంపాలన్న మళ్ళీ...
5th ఎస్టేట్

నష్టాల ఊబిలో ప్రభుత్వాలు – గట్టెక్కే దిక్కు ఇదే?

Siva Prasad
sample 5 కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రులకు తాకిడి మించుతుంది. ఇప్పుడున్న పరిస్థితి వరకు పర్వలేదు. కానీ ఇది కరోనా. అసలు ఆగే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే ఆస్పత్రుల్లో సదుపాయాలు...
5th ఎస్టేట్

న్యూయార్క్ దారుణం వెనక ఊహించని నిజాలు

Siva Prasad
sample 4 పాపం అమెరికా…! ఆర్ధిక, సాంకేతిక, సైన్స్ రంగాలకు పెద్దన్న అమెరికా. అందుకే ఆ దేశాన్ని అగ్రరాజ్యం అంటుంటారు. మరి ఇప్పుడు ఆ అగ్రరాజ్యం అల్లాడుతుంది. కరోనా ధాటికి కోలుకోలేక విలవిల్లాడుతుంది. ఏం...
5th ఎస్టేట్

ఇటలీలో మారణహోమం

Siva Prasad
sample 3 చైనా చితికలపడింది. అమెరికా అల్లాడుతుంది. ఇటలీలో మారణహోమం కొనసాగుతుంది. స్పెయిన్లో కేసుల విజృంభన ఆగడంలేదు. బ్రిటన్ లో సాక్షాత్తు ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రికి వైరస్ సోకింది…! ఇన్ని పెద్ద దేశాలు...
5th ఎస్టేట్

ఫాక్ట్ చెక్ : పోలింగ్ సరళి అనేది నిజమైనదేనా

Siva Prasad
(sample7) తెలంగాణ ఎన్నికలలో పోలింగ్ సరళిని చూస్తుంటే ఓట వేయాలన్నభావన ప్రజలలో పెరిగిందని అనిపిస్తున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి నిలబడి ఉండటం..పలు చోట్ల...
ఫ్యాక్ట్ చెక్‌

ఫాక్ట్ చెక్ : ఇల్లు ఇల్లూ తిరుగుతారు సరే .. గెలుపు సంగతేంటి

Siva Prasad
(sample 6 ) జనసేన జనతరంగం కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం 11 గంటలకు జనసేనాని పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనతరంగం నేటి నుంచి 5...
ఫ్యాక్ట్ చెక్‌

ఫాక్ట్ చెక్ : కొన్ని పేర్లు నమోదు ఐనా లెక్కల్లో లేవు

Siva Prasad
(sample5)  సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్రగ్స్ వాడే వారంతా బాధితులు మాత్రమేనని ఇప్పటికే విస్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ తాజాగా మరికొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందుకు...
టాప్ స్టోరీస్

రూపాయికి రూపాలెన్నో…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ధనవంతుల ను కొట్టి పేదలకు పంచడం అంటే ఇదేనేమో. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుంది.1991లో...
టాప్ స్టోరీస్

కేసీఆర్ కొత్త అనుమానాలు…!!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో తగ్గుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 400 పైగా కేసులు నమోదైతే, తెలంగాణలో మాత్రం 200 లోపే ఉన్నాయి. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఈ వైరస్ విపరీతంగా...
రాజ‌కీయాలు

ఘాటెక్కిన ట్వీటు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఓ వైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూ ప్రభుత్వాన్ని, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. మరో పక్క కరోనా ఆసుపత్రికి మీ పార్టీ భవనం ఇవ్వమంటే, మీ పార్టీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వ్యూహమా…! కయ్యమా…! బాలినేని ఎందుకిలా..?

sharma somaraju
ఏం జరుగుతుంది నియోజకవర్గంలో..? అని ఎవరూ పట్టించుకోరు. ఎందుకిలా చేశారు..? అని ఎవరూ అడగడం లేదు. పార్టీ వ్యక్తులపైనే కేసులేంటి, పిర్యాదులేంటి..? అని ఎవరూ ఆరా తీయరు…! అందుకే ప్రకాశం జిల్లా చీరాలలో సిల్లీ...
టాప్ స్టోరీస్

కరోనాతో “ఆట”లాడొద్దు…!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అక్కడ అష్టా చమ్మా, ఇక్కడ పేకాట సరదా కాలక్షేపం వారికి కరోనా సోకి కొంటి మీద కునుకు లేకుండా చేసింది. వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది....
టాప్ స్టోరీస్

ఇక లాక్ డౌన్ ఆంక్షల సడలింపులే…!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ దశల వారీగా సడలింపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా వినియోగదారులు, వ్యాపారవర్గాలకు ఉరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సాయిరెడ్డి సురకతో కన్నాకు కాలింది…!

Srinivas Manem
బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నాకి బాగా కాలింది. ఆ చురక పెట్టింది విజయసాయిరెడ్డి. అదేం మామూలు చురక కాదు, ఆయన బిజెపి నిధులు కాజేసేసారని, టిడిపి నుండి రూ. 20 కోట్లు తీసుకున్నారని. అందుకే...
బిగ్ స్టోరీ

కరోనా… నీ మూలాలెక్కడ…??

Srinivas Manem
మందులకు లొంగట్లేదు… డబ్బుకి లొంగట్లేదు… మానవ మేదస్సులకు తలొగ్గట్లేదు… చికిత్సకు తగ్గడం లేదు… వ్యాప్తి ఆగడం లేదు… ఏంటి కరోనా? లోకంపై పగపట్టిందా? మనుషులపై పగపట్టిందా? జనజీవనంపై పెద్ద ప్రభావం చూపడానికి వచ్చిందా?? ఇవన్నీ...
బిగ్ స్టోరీ

జగనూ తలవంపులేల…!

Srinivas Manem
ఇల్లు కాలుతున్న వేళన చుట్ట వెలిగించుకుంటున్నట్టు…, ఊరు మునిగిపోతుంటే ఈత నేర్చుకున్నట్టుగా… ప్రపంచం, దేశం, పక్క రాష్ట్రం, మనం కూడా కరోనాతో అల్లాడుతున్న వేళన.., మన రాష్ట్రంలో మాత్రం రాజకీయం ఆగడం లేదు. ప్రతిపక్షం...
టాప్ స్టోరీస్

రెండు విధాలా “మహా”గండాలే..!!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒ పక్క కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. మరోపక్క రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడే సూచనలు ఆయనకు...
టాప్ స్టోరీస్

మూడుతో మూడదు…! మే మొత్తం తప్పదు…?

Srinivas Manem
మే మూడు తో లాక్ డౌన్ ముగుస్తోందా…? ఇక సాధారణ జీవనంలోకి వెళ్లిపోవచ్చా? అన్నీ తెరుచుకున్నట్టేనా? ఇవన్నీ సగటు మనిషి సందేహాలే. దేశం మొత్తం కాళ్ళు, చేతులు కట్టుకుని ఇప్పటికీ నెల దాటింది. పనుల్లేవు,...
టాప్ స్టోరీస్ సినిమా

సినీ సెలబ్రిటీల రియల్ మ్యాన్ ఛాలెంజ్ అదుర్స్

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరు నెల రోజులుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్ లు సైతం నిలిచిపోవడంతో ఎప్పుడు...
5th ఎస్టేట్

ఇదో ఎట్టి చాకిరీ…!

Srinivas Manem
నీటిలో గాలం వేసి చేప కోసం వేచి చూడడం… అడవిలో వల వేసి జింక కోసం చూడడం… ఆ సంస్థలో ఉద్యోగుల చిన్నపాటి తప్పుల కోసం వేచి చూడడం సహజంగా మారింది. పాపం వెట్టి...
న్యూస్

డాక్టర్లపై దాడి చేస్తే నో బెయిల్

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఇకపై దేశంలో ఎక్కడైనా వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేయనున్నారు. నేర తీవ్రత ఆధారంగా ఆరు నెలల నుండి ఏడేళ్ల వరకు...
టాప్ స్టోరీస్

హై కోర్టుని కాదని సుప్రీంకి…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే విషయంలో విపక్షాల నుండి ఎన్ని విమర్శలు ఎదురైనా, హైకోర్టు సదరు జివోలను రద్దు చేసినా జగన్ ప్రభుత్వం ముందుకే సాగాలని నిర్ణయించుకున్నదా?...