NewsOrbit
టాప్ స్టోరీస్

హిట్ కాంబినేషన్!

అమరావతి: జనసేనలో అకస్మాత్తుగా కుదుపు. శనివారం అర్ధరాత్రి సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ జనసేన కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారనగానే మీడియా వర్గాలలో కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం. ఏం జరుగుతోంది? అర్ధరాత్రి చర్చలు లక్ష్మీనారాయణను మరుసటి రోజు జనసేన పార్టీలో చేర్చాయి.

లక్ష్మీనారాయణ చేరిక జనసేనకు మంచి ఊపు తెస్తుందనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ తాను పార్టీ పెట్టిన తర్వాత రాబట్టగలిగిన వారిలో లక్ష్మీనారాయణే పెద్ద వ్యక్తి. పవన్ అన్నయ్య చిరంజీవి పదేళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు ఒక స్థాయి నాయకులు చాలామంది అందులో చేరారు. అందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ జనసేనలో చేరిన వారిలో ఒక్క మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన వారు లేరు.

ఇప్పుడు లక్ష్మీనారాయణ వచ్చి చేరడంతో సీన్ మారింది. ఒక్కడేగా అన్న ప్రశ్న రావచ్చమో గానీ, అత్యంత నిజాయితీపరుడిగా లక్ష్మీనారాయణకు రాష్ట్రంలో ఉన్న పేరు తక్కువది కాదు. పవన్‌ను సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ‘ఇంకో హీరో’ కింద కొట్టిపారేసే వారు కూడా ఆయన చిత్తశుద్ధిని శంకించలేరు. ఇప్పటికిప్పుడు పవన్, లక్ష్మీనారాయణ కాంబినేషన్ జనసేనకు ఎన్ని సీట్లు సాధించిపెట్టగలదో చెప్పలేకపోయినా, ఇప్పటికి అది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

లక్ష్మీనారాయణ తర్వాత ఎవరు?

జనసేనలోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం కనబడుతోంది. కాపులకు బిసి గుర్తింపు కోసం పోరాడుతున్న సీనియర్ రాజకీయవేత్త, కాపు నాయకుడు  ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. కాపులకు బిసి గుర్తింపు అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన ముద్రగడను టిడిపిలోకి చేర్చేందుకు ఒక ప్రయత్నం జరిగింది. కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతాన్ని రాష్ట్రంలో కాపులకు ప్రకటించిన తర్వాత ఈ ప్రయత్నం జరిగింది. అయితే ముద్రగడ టిడిపిలో చేరేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆయనను జనసేనలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అటు టిడిపి, ఇటు వైసిపి అభ్యర్ధుల జాబితాలను ప్రకటించాయి. వైసిపి పూర్తి జాబితాను ప్రకటించగా, టిడిపి ఇంకా 34 అసెంబ్లీ స్థానాలకు, మొత్తం 25 లోక్‌సభ స్థానాలకూ అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఆ పార్టీలలో చోటు దక్కని వారు కొందరు జనసేనలో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment