NewsOrbit
టాప్ స్టోరీస్

తారా తోరణాల మధ్య హోర్డింగులు!

రాత్రి పూట తల పైకెత్తి చూస్తే ఏం కనబడుతుంది. చుక్కలు పరచుకుని ఉంటాయి. వాటి మధ్య చందమామ వెలిగిపోతూ ఉంటుంది. రాత్రి పూట ఆరుబయట వెల్లికిలా పడుకుని ఆకాశంలోకి చూస్తూ నిద్రపోవడం ఒక గొప్ప అనుభవం. ఉండేకొద్దీ రాత్రి ఆకాశం అందాలు తగ్గిపోతూ వస్తున్నాయి. కారణం భూమ్మీద మనం వెలిగించే విద్యుద్దీప కాంతులు మరీ ఎక్కువ కావడం. వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం లాగా ఇప్పుడు కాంతి కాలుష్యం ఒక సమస్యగా మారుతోంది. కొన్నాళ్లు పోతే ఈ సమస్యకు ఒక కొత్త కోణం వచ్చిచేరవచ్చు.

త్వరలో ఆకాశం లోకి చూడగానే మీకు ఏ కోకాకోలా ప్రకటనో, ఏ స్టార్‌బక్స్ ప్రకటనో కనబడవచ్చు. అంతరిక్షంలో వ్యాపార ప్రకటనల వ్యాపారం చేద్దామనుకుంటున్న సంస్థ స్టార్ట్‌రాకెట్ ఆలోచనలు కార్యరూపం దాలిస్తే జరిగేది అదే. ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలు నక్షత్ర సముదాయాలను రాశులుగా విభజించి వాటికి పేర్లు పెట్టారు. గ్రీకుల తర్వాత అంతరిక్షంలో గీతలు గీసిన ఖ్యాతి తనకే దక్కాలని ఈ సంస్థ సిఇఓ వ్లాడ్ సిత్నికోవ్ అంటున్నారు.

ఈ ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది కానీ, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు అసలీ ఆకాశ ప్రకటనలు ఎలా సాధ్యమో తెలుసుకుందాం. సిత్నికోవ్ పధకం ప్రకారం అంతరిక్షం లోకి క్యూబ్‌శాట్స్ అనే  వందలాది చిన్నిచిన్ని కృత్రిమ ఉపగ్రహాలు పంపుతారు. వాటికి సౌరవిద్యుత్ తయారుచేసే తెరలు ఉంటాయి. అవన్నీ భూమికి సుమారు 500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తుంటాయి. అధునాతన టెక్నాలజీ ద్వారా వాటిని భూమి మీదకు కనబడాల్సిన పద్ధతిలో అమర్చుతారు. ఆ అమరిక బట్టి భూమి మీద  నుంచి చూసిన వారికి అక్షరాలు అయితే అక్షరాలు, బొమ్మ ఏదన్నా అయితే బొమ్మ కనబడతాయి.

కాంతి కాలుష్యం ఇవాళ చాలా పెద్ద సమస్యగా మారుతోంది. 

తాము ఈ ఆలోచనను వీడియో ద్వారా ప్రకటించినప్పటి నుంచీ చాలా మంది తమను సంప్రదించారని సిత్నికోవ్ చెబుతున్నారు. ప్రాజెక్టుకు 15 కోట్ల  డాలర్ల వరకూ ఖర్చు కావచ్చన అంచనా. ప్రతి ఎనిమిది గంటల ప్రకటనకూ రెండు లక్షల డాలర్ల చొప్పున వసూలు చేయాలని స్టార్ట్‌రాకెట్ భావిస్తోంది. ప్రకటన సైజు సుమారు అర్ధచంద్రుడి సైజులో ఉంటుంది. భూమ్మీద ఎక్కడనుంచైనా ఒకసారికి ఆరు నిముషాల పాటు కనబడుతుంది.

అంతరిక్షం వ్యాపారాల ఆలోచనలు ఇదే కొత్త కాదు. అంతరిక్షంలో హోటళ్లు పెట్టాలన్న ఆలోచన నుంచి గ్రహశకలాలలో గనుల తవ్వకం వరకూ రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ ఆలోచనలకు పెట్టుబడి పెట్టేవారు కావాలి. ఇప్పుడు సిత్నికోవ్ ప్రతిపాదనకూ పెట్టుబడిదారులు కావాలి.

దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంతరిక్షంపై హక్కులు ఎవరికి ఉంటాయన్న ప్రశ్న కూడా తలెత్తింది. అంతరిక్షంలో జరిగే కార్యకలాపాలపై ఎలాంటి  నియంత్రణ ఉండాలో ఇప్పటికైనా ఆలోచించాలని బ్రిటన్‌కు చెందిన అంతరిక్ష చట్టాల ప్రొఫెసర్ క్రిస్టఫర్ న్యూమెన్ అంటున్నారు. అంతరక్షంలో వాణిజ్య ప్రకటనలు అంతరిక్ష పరిశోధనకు ఆటంకం కలిగిస్తాయన్న విమర్శ వస్తోంది. ఇప్పటికే ఎక్కువయిన కాంతి కాలుష్యాన్ని ఇవి ఇంకా ఎక్కువ చేస్తాయని కూడా అంటున్నారు.రాత్రి ఆకాశం అనే అద్భుత దృశ్యాన్ని నాశనం చేసే ఖరీదయిన, పనికిరాని పని తప్ప ఈ ఆలోచన మరోటి కాదని బ్రిటిష్ రాయల్ అస్ట్రనామికల్ సొసైటీ ఎక్జిక్యూటివ్ డైరక్టర్ రాబర్ట్ మాస్సీ అంటున్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment