హైదరాబాద్: దేశంలో అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని, భారత శిక్షా స్మృతి(ఐపీసీ)ని సవరిస్తూ పార్లమెంట్లో చట్టం తేవాలని ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీలో నిర్భయ దారుణ ఘటన జరిగి.. ఏడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకూ నిందితులకు ఉరి శిక్ష పడలేదని పేర్కొన్నారు. ఇటీవలే తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం జరిగిందని.. దిగువ కోర్టు ఉరిశిక్ష విధించాలని ఆదేశించిందని ఆయన అన్నారు. అయితే.. హైకోర్టు దీనిని యావజ్జీవ కఠిన జైలు శిక్షగా మార్చిందని తెలిపారు.
And the perpetrators have been nabbed. But I wonder how we can offer solace to the grieving family seeking justice for #PriyankaReddy
Justice delayed is justice denied sir. As the parliament is in session, I urge you to take up the issue for a day-long discussion on priority2/4
— KTR (@KTRTRS) December 1, 2019
‘అత్యాచార ఘటనలకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలి. నేరం చేయాలంటే భయపడేలా కఠిన శిక్షలు విధించాలి. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లయినా దోషులకు ఇంకా ఉరిశిక్ష పడలేదు. ఇటీవల తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం ఘటనలో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యువతి కుటుంబానికి మనం ఎలా హామీ ఇవ్వగలం ? ‘ఐపీసీ, సీఆర్పీసీ’ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలి. ఆ శిక్షపై మళ్లీ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండకూడదు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారికి శిక్షలు వేగంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ప్రజల డిమాండ్ మేరకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టం తేవాలి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలి’ అని మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. ఎన్ని చట్టమన్నా.. నిబంధనలన్నా.. ఎలాంటి భయంలేని మృగాళ్ల బారి నుంచి దేశాన్ని రక్షించే సమయం ఆసన్నమైందన్నారు. లక్షలాది ప్రజల తరుపున తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
Let us act swiftly to save our nation from these beasts who seem not to fear law of the land@narendramodi Ji, I appeal to you on behalf of millions of citizens who’re aggrieved yet feel helpless & want us lawmakers to raise up to the occasion & deliver expeditious justice? 4/4
— KTR (@KTRTRS) December 1, 2019