NewsOrbit

Category : 5th ఎస్టేట్

Read the best editorial news from the newsorbit. We provide in depth information on editorial news(సంపాదకీయం వార్తలు).

5th ఎస్టేట్

నాయకుడి భుజం పై పార్టీ…, పత్రిక…!

Srinivas Manem
ప్రస్తుత రోజుల్లో రాజకీయ పార్టీలు…, దిన పత్రికలు ఈ రెండిటి మధ్య బంధం మహా భారతంలో కర్ణుడు – దుర్యోధనుడి బంధం లాంటిది…! ఆపత్కాలంలో ఒకరికి ఒకరు ఉపయోగపడుతుంటారు. అది మరోసారి నిరూపితమైంది. దేశంలో..,...
5th ఎస్టేట్

జగన్ అధికారం లోకి వచ్చాక ఇదే అతిపెద్ద పాజిటివ్ వైబ్?

siddhu
  దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకతకు గురైన మద్యం అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఒకపక్క కరోనా బారిన పడి ప్రజలంతా అలాడిపోతుంటే ఈ సమయంలో మందు షాపులు తెరవడం వల్ల ఆ వ్యాధిని మరింత వ్యాపించినవారు అవుతారని ప్రభుత్వాలపై ప్రజలు విరుచుకు పడుతుంటే జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఇప్పుడు పలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక్కసారిగా మద్యం పెంచడం వల్ల మందు తాగే వాళ్ళ సంఖ్య మెల్లగా తగ్గిపోతుంది అన్న జగన్ ఆలోచనలను ప్రతిపక్ష నేతలు ఎంత ఎగతాళి చేశారో అందరికీ తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో నుండి రిపోర్టులు వచ్చాక వారి ఆరోపణల్లో మరియు విమర్శల్లో ఎటువంటి పస లేదు అన్న విషయం స్పష్టంగా అర్థం అయిపోయింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లతో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను తెరిచారో.. మందుబాబులు అంతా ఒక్కసారిగా మద్యం షాపుల పై ఎగబడ్డారు. అయితే మొదటి రోజు జగన్ అప్పటి ధరలపై 25 శాతం అదనంగా పెంచగా…. రెండవ రోజుకు మరో 50 శాతం పెంచారు. అలా లాక్ డౌన్ ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 75% ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ విషయం ఎలా ఉన్నా జనాలు షాపుల ముందు మీద మీద పడి మ్ద్యం కొనుగోలు చేయడంతో సామాజిక దూరం సాధ్యం కాలేదు. అయితే కొద్దిరోజులుగా మద్యం షాపుల దగ్గర జనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా నాలుగవ రోజు నుండే రాష్ట్రంలోని మెజారిటీ మద్యం షాపుల ముందు క్యూలు కనిపించలేదు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 4వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తర్వాత మరో నాలుగు రోజులు పర్వాలేదనుకున్న అమ్మకాలు మొన్నటి 9వ తేదీన బాగా పడిపోయింది. 9వ తేదీన 41 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అంటే 4వ తేదీ నుండి చూస్తే 9వ తేదీకి 30 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి.  ఇంకా 10వ తేదీ లెక్కలు రావాల్సుంది. మొత్తం మీద ధరలు పెంచేసి మందుబాబులకు షాక్ ఇవ్వాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తోంది....
5th ఎస్టేట్

నిర్మాణాత్మక పోరాటం వదిలేసి – బ్యాడ్ నేమ్ దిశగా చంద్రబాబు! 

siddhu
  అధికార పక్షం చేసే ప్రతి పని లోని లోపాలను ఎత్తి చూపే నాయకులుగా పేరు తెచ్చుకున్న ది గ్రేట్ కామ్రేడ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల దెబ్బకు ఏం చేయాలో పాలు పోక ఇంటికే పరిమితమయ్యారు. జగన్ ప్రభుత్వం వరుసగా అమ్మఒడి, పేదలకు ఇళ్ల పంపిణీ, రైతు భరోసా మరియు స్థానికులకు 70 శాతం పరిశ్రమల్లో ఉద్యోగాలు వంటి నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల మన్నన పొందుతుండగా…. కామ్రేడ్స్ ఏ పనీ లేక మౌనం పాటిస్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఉన్న ఒకే ఒక ఆయుధం రాజధాని మార్పు. అమరావతి విషయంలో కొద్ది రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సిపిఎం నేతలకు కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన సమాచారంతో వారు కూడా అది విరమించుకున్నారు. ఇక సీపీఐ వారు మాత్రం ఇక కనీస వ్యతిరేక ప్రభావం చూపించ పోతే బాగోదు అన్నట్లు కనిపించీ కనిపించని పోరాటం చేస్తున్నారు. అంతెందుకు తాజాగా విశాఖ లో గ్యాస్ లీక్ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించిన తీరుకి కామ్రేడ్ సైతం విస్తుపోయారు. ఏ సీఎం అయినా ఇంతకన్నా ఏం చేస్తారని సిపిఐ పార్టీ నాయకుడు నారాయణ అభిప్రాయపడడమే ఇందుకు ఉదాహరణ. ఇక రాష్ట్ర చీఫ్ రామకృష్ణ కూడా ఎటువంటి విమర్శలు చేయక పోవడం గమనార్హం. జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించిన తర్వాత వారి నోట మాట రాలేదు. ఇలా కామ్రేడ్లు జగన్ పాలన చూసి అత్యధిక సందర్భాల్లో మౌనం వహించి ఆచితూచి అడుగులు వేస్తున్న సమయంలో చంద్రబాబు మాత్రం కూసింత విచక్షణ లేకుండా జగన్ కోటి రూపాయలు ఇచ్చిన దానిపై కూడా తీవ్రమైన విమర్శలు చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డబ్బులు ఇస్తే సరిపోదు అంటూ కొత్త పల్లవి అందుకున్న బాబు ప్రభుత్వం స్పందించడం కాదు పరిశ్రమ స్పందించేలా చేయాలని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ముందు ప్రభుత్వమే స్పందిస్తుంది అని తెలియని చంద్రబాబు పద్నాలుగేళ్ల అనుభవానికి ఏం చెప్పాలో ఎవరికీ పాలుపోవడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కామ్రేడ్ లతో కలిసి ముందుకు వెళ్తానని పదే పదే చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కనీసం వారు ఆలోచిస్తున్న విధంగా కూడా ఆలోచించలేకపోవడం గమనార్హం. చంద్రబాబు పాలనలో ఏర్పేడు లో ఇసుక తవ్వకాల నేపథ్యంలో హత్యలు, గోదావరి పుష్కరాలు బాధితులకు పరిహారం చాలా తక్కువ అన్న అభిప్రాయం ఉంది. అవి కూడా కొన్ని సరిగ్గా అందలేదు అన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాఖ అదే స‌మ‌యంలో కంపెనీ నుంచి వ‌చ్చేదీ రానిది ప‌క్కన పెడితే.. జ‌గ‌న్ ప్రభుత్వం వెంట‌నే స్పందించి కోటి న‌ష్ట ప‌రిహారం ప్రక‌టించింది. వెంటనే చెల్లించింది కూడా. దీనిని కూడా ఏమీ చేయ‌న‌ట్టుగా ప్రొజెక్టు చేయ‌డాన్ని చూస్తే.. చంద్రబాబు క‌న్నా కామ్రేడ్లు బెట‌ర్ అనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. బాబు గారు ఇకనైనా నిర్మాణాత్మక పోరాటం మొదలెట్టి అసలైన పాయింట్ తెర మీదకు తెస్తే మంచిది.లేకపోతే ఆయన మాతలు వినే వారే కరువైపోతారు....
5th ఎస్టేట్

టివి 9 కి మరోసారి ఛీ కొట్టించుకుంది…!

Srinivas Manem
కొన్ని మీడియా చానెళ్లు, పత్రికలు తమ వార్తా కథనాలతో అనేక సార్లు ప్రజాగ్రహానికి గురవుతుంటాయి. ఛీ కొట్టించుకుంటాయి. పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఎక్కువగా ఈ కోవకు చెందుతుండగా, ఛానెళ్లలో టివి 9 ఇదే కోవకు చెందుతుంది....
5th ఎస్టేట్

నిర్లక్ష్యమే అసలు డేంజర్… కే‌టి‌ఆర్ కూడా మూర్ఖంగా ప్రవరిస్తే ఎలా?

siddhu
ఈరోజుల్లో అవతలి వారిని అదరగొట్టాలంటే కత్తులతో.. కర్రలతో బెదిరించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా ఒకసారి దగ్గినా లేక “హాచ్చి…!“ అని తుమ్మినా చాలు… జనాలు వణికిపోతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి. అలాంటిది ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మాయదారి రోగం యొక్క లక్షణాల్లో జలుబు మరియు దగ్గు చాలా కీలకం. అయితే అలాంటి వేళలో జాగ్రత్తగా వ్యవహరించి సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సిన నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తమ ఆరోగ్యం తో పాటు అవతలి వారి ఆరోగ్యాన్ని కూడా రిస్క్ లో పడేస్తే ఏమనాలి? వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఎంతో మంచి నాయకుడిగా పేరున్న విషయం అందరికీ తెలిసిందే. అతనిపై మరియు అతని స్ఫూర్తిదాయకమైన నాయకత్వంపై ఎప్పుడూ ప్రశంసల వర్షం కురుస్తూ ఉంటుంది. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. మంత్రి కేటీఆర్ తీవ్రమైన జలుబు మరియు తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉండగా అదే సమయంలో అయినా సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో టెక్స్ టైల్స్ పార్కులో పనులను ప్రారంభించారు.  అయితే ఆ సందర్భంగా చాలా మంది ప్రజల మధ్యలో ఉన్న అతను పదేపదే తుమ్ముతూ మరియు కర్చీఫ్ తో ముక్కుని తుడుచుకుంటూ కనిపించారు.  అసలు చేతిలో ఏనాడూ తువ్వాలు కానీ కర్చీఫ్ కానీ పట్టుకొని తిరిగే అలవాటులేని కేటీఆర్ అందుకు భిన్నంగా ఒక గులాబీ రంగు తువ్వాలుని పట్టుకొని పదేపదే తుమ్మడం మరియు జలుబు వల్ల ముక్కు ని శుభ్రం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. బాధ్యతారాహిత్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో వీలైనంత వరకూ ఎవరిని గుమిగూడవద్దు వద్దు అని ఆదేశించాల్సిన నాయకులే స్ఫూర్తిని మరచి అందుకు భిన్నంగా తుమ్ముతూ…. దగ్గుతూ…. చీదుతూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే వివ్వెరపోవడం ప్రజల వంతు అయింది. నాలుగు రోజుల పాటు డెవలప్ మెంట్ పనుల్లో పాల్గొనకుంటే ఏమైనా నష్టం వాటిల్లుతుందా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. నలుగురికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్.. తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం సరికాదంటున్నారు. మరి దీనికి మంత్రి గారి సమాధానం ఏంటో..? ...
5th ఎస్టేట్

‘కామాంధుల’ కరోనా… ఇదేమి దరిద్రం…? 

siddhu
ఒకపక్క దేశమంతా కరోనా దెబ్బకు అల్లాడిపోతుంటే కొంతమందికి మాత్రం ఎవరి సరదాలు వారికి తీరాలి.. వాళ్ళ సరసాలు వారికి కొనసాగాలి. విషయం లోకి వస్తే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోకి తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా వైరస్ నిర్థారణ టెస్టులు తక్కువగా చేస్తున్నారని అంతా వాపోతుంటే కొంతమంది బాధ్యత రాహిత్యం ఆ రాష్ట్రాన్ని మరింత పెద్ద ప్రమాదంలో పడేస్తోంది. ఒకపక్క వైద్య పరీక్షలు నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటే మరొకవైపు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ఏవీ సక్రమంగా జరగడం లేదు అన్నా ఆరోపణలు కూడా భారీగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వనస్థలిపురం మున్సిపల్ వైస్ చైర్మన్ యొక్క రాసలీలల విషయం బయటికి వచ్చింది. తెలంగాణలో రోజు నమోదవుతున్న కేసుల్లో 90 శాతం హైదరాబాద్ పరిధిలోనివే అందులో అతి కీలకమైన వనస్థలిపురం సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటి. అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి అనుమానిత రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు కూడా. ఒక పక్క పరిస్థితి ఇలా ఉంటే మన వైస్ చైర్మన్ అనిల్ తన సరదాలు తీర్చుకుంటూ ఉన్నాడు. రోజూ టైం కి కరెక్టుగా బయటికి వెళ్తాడు. కీలక పదవిలో ఉన్నాడు కదా బయట పనులు ఉంటాయి అని అనుకుంది భార్య. అయితే కొద్ది రోజులకే భర్త మరి బిజీ అయిపోవడం గమనించింది. అతని వాలకం చూస్తే కరోనా విధుల్లో మిగతా వారికి సహకరించడానికి వెళ్లినట్లు లేదు. తీరా ఆరా తీస్తే అతను చేసేవి కరోనా సహాయక చర్యలు కావని గ్రహించింది. ఏంటి విషయమని కొంచెం లోతుగా వెళితే అప్పుడు అసలు విషయం బయటపడింది తన ఇంటికి దగ్గరలోనే లాడ్జి లోని ఒక రూం తీసుకుని అందులో అతను అమ్మాయిలతో జల్సా చేస్తున్నాడు. దీనితో కోపం ఆపుకోలేక స్వయంగా వైస్ చైర్మన్ భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్ పై రైడ్ చేశారు. వైస్ ఛైర్మన్ తో పాటు ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైస్ ఛైర్మన్ ఫ్రెండ్, లాడ్జ్ ఓనర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో హైదరాబాద్ వాసులు ఇవేమి పనులు రా దరిద్రుల్లారా అంటూ మండిపడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయినప్పుడు కరోనా ఉన్నా పట్టించుకోరనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ....
5th ఎస్టేట్

ఆ రెండు కులాల పెళ్ళంటా..! రాధాకృష్ణ పంతులట…!

Srinivas Manem
రాష్ట్రంలో ఓ కొత్త కులం రాబోతుంది…! రెండు ప్రధాన కులాలు కలిపి ఓ కులంగా అవతరించబోతున్నాయి…! ఆ కులానికి ప్రధాన కర్త, కర్మ, క్రియ… సర్వమూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండనున్నారు. గౌరవ అధ్యక్షుడి హోదాలో...
5th ఎస్టేట్

అందుకే చంద్రబాబు… అంతర్జాతీయ అపర మేధావి…!!

Srinivas Manem
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తామన్నారు. ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వాళ్ళకి రూ.10 లక్షలు అన్నారు. సాదాసీదా చికిత్స పొందుతున్న వారికి రూ. పాతిక వేలు అన్నారు. ఫ్యాక్టరీపై కేసులు అన్నారు. విచారణ...
5th ఎస్టేట్ టాప్ స్టోరీస్

విపక్షాల నోర్లు కట్టేసిన జగన్

Srinivas Manem
సీఎం జగన్ చేసిన ఒక ప్రకటన ప్రతిపక్షాల నోర్లు కట్టేసింది… ఏమి డిమాండ్ చేయకుండా చేసేసింది. ఒక రకంగా చంద్రబాబు ముద్రని కూడా అక్కడ చెరిపేసేలా చేసింది…! ఇంతకు ఏమిటా ప్రకటన.., చంద్రబాబు ముద్ర...
5th ఎస్టేట్

కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ..! 

siddhu
భారతదేశంలో లాక్ డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని మరియు ఇక మిగిలిన వారందరికీ వ్యాక్సిన్ ద్వారా నయం చేస్తారని భావిస్తున్న ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చింది. ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని వార్తల ప్రకారం కొద్ది రోజులకి కరోనా ను నయం చేసే వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చేస్తుందని… ఇక ఆ మహమ్మారి కి విరుగుడు వచ్చినట్టే అని…. ఇక ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆశతో ఉన్న ప్రజలందరూ ఇప్పుడు నిర్ఘాంతపోయే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ బయటపెట్టింది. ప్రపంచ ప్రజలందరూ త్వరలోనే కరోనా మందు అందుబాటులోకి వస్తుందని ఆశించడం తప్పు అని చెప్పిన డబ్ల్యుహెచ్వో…. ఇప్పట్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. కరోనా కు వ్యాక్సిన్ కనుగొనడం ఇప్పట్లో జరిగే పనిగా తాము భావించడం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త డేవిడ్ నబారో తెలిపారు. ఒక వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ ను తయారు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పిన ఆయన…. ఇందులో ఎన్నో దశలు ఉంటాయని వాటన్నింటిని ఖచ్చితత్వంతో పూర్తి చేస్తేనే వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు అనుమతి వస్తుందని వివరించారు. మొదటి దశలోనే వ్యాక్సిన్ ను మనిషికి ఇస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని చెప్పిన ఆయన ప్రస్తుతానికి మనిషికి ప్రయోగించి ఆ వ్యాక్సిన్ వైరస్ ను చంపుతుందా లేదా అని గుర్తించారని అన్నడు. దీని తర్వాత మూడో దశలో వ్యాక్సిన్ వల్ల మనిషికి ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా వస్తాయా అని పరీక్షిస్తారని.. ఇక నాలుగో దశ విషయానికి వస్తే వ్యాక్సిన్ వల్ల ఇప్పటికే ఒక మనిషికి ఉన్న జబ్బుల పై ఎలాంటి ప్రభావం పడుతోందని పరిశీలించిన తర్వాత ఇవన్నీ పాస్ అయితే చివరి దశలో ఈ వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తుందో పరిశీలించి అప్పుడు మార్కెట్లోకి వదులుతారు అని వివరించారు. ఈ ఐదు దశల్లో ఏ ఒక్క చోట విఫలమైనా మళ్ళీ మొదటినుంచి పరిశోధన చేసి అన్ని దశలలో పాస్ అయితేనే మందు బయటికి తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే డెంగ్యూ, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమైన వైరస్ లకు వ్యాక్సిన్ కనిపెట్టలేదని…. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అదే పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.ఎయిడ్స్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచంలో 3.2 కోట్ల మంది మరణిస్తున్నారని.. ఇప్పుడు కరోనాది అదే పరిస్థితి అని వివరించారు. అందుకే ఇప్పట్లో కరోనా వైరస్కు మందు రాదని.. జాగ్రత్తలు పాటించి సమాజం నుంచి ఆ వైరస్ను వెళ్లగొట్టడమే తక్ష కర్తవ్యమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్త డేవిడ్ నబారో మాటల వెనుక ఉన్న అర్థం....
5th ఎస్టేట్

రాజకీయాల్లో ‘అది’ లేకపోతే ఎలా… కే‌సి‌ఆర్ నుంచి జగన్ నేర్చుకోవాల్సింది ఇదే ! 

siddhu
  రాజకీయ జీవితంలో అయినా…. వ్యక్తిగత జీవితంలో అయినా మనం ఏ పని చేసినా దానిని అవతలివారికి మన అజెండా అర్థమయ్యేలాగా లౌక్యంగా పని చేయడం ముఖ్యం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి చాలా వ్యత్యాసం ఉంది. ఒక వైపు కేసీఆర్ లౌక్యంగా మాట్లాడుతూ ప్రజలను మెప్పిస్తూ విపక్షాలకు నోట మాట లేకుండా చేస్తుంటే…. జగన్ మాత్రం అతను తీసుకున్న ప్రతి నిర్ణయానికి తీవ్రంగా విమర్శల పాలు అవుతూ ఉన్నారు. కానీ ఇద్దరూ చేస్తున్న పని ఒక్కటే అయినా మాటకారితనం లేకపోవడం మరియు పరిస్థితిని అర్థం అయ్యేలా చెప్పలేకపోవడంతో జగన్ కెసిఆర్ కన్నా ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు అనే చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఒకటే. ఇద్దరు చేస్తున్నది ఒకే రకమైన పాలన. అయితే అన్ని విషయాల్లో కేసీఆర్ తరువాత తన నిర్ణయాన్ని తెలిపిన జగన్…. సరిగ్గా మినహాయింపుల విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం కన్నా ఒక రోజు ముందు ఉన్నారు. దాంతో ఎలాంటి మీడియా సమావేశం లేకుండా ఉన్నట్టుండి మద్యం దుకాణాలు తెరవగా… రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు ప్రజల మందు కోసం ఎగబడితే అతను విమర్శల పాలయ్యారు. ఇక ఇదే పనిని కేసీఆర్ ఒక రెండు రోజులు ఆగి చాలా లౌక్యంగా చేశారు. మరీ ముఖ్యంగా రెండు గంటల మీడియా సమావేశంలో చివరి అంశంగా మద్యం షాపులు తెరవడం గురించి ప్రస్తావించిన ఆయన తెలంగాణలో గుడుంబా, అక్రమ మద్యం, సారా మరియు కల్తీ మద్యం ఏరులై పారకుండా మద్యం షాపులు తెరుస్తున్నామని కారణంగా చెప్పి ఈ విషయాన్ని చాలా సాఫ్ట్ గా వ్యవహరించారు. జగన్ లాగే రెడ్ జోన్ లలో కూడా మద్యం షాపులు తెరిచిన కేసీఆర్ ఈ విషయంలో మాత్రం తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కేంద్రం ఆదేశాలతోనే ఇవన్నీ చేస్తున్నానని చెప్పి అటు విపక్షాల నోర్లు మూయించేశారు. ఇకపోతే జగన్ మొదటి రోజు లిక్కర్ పై 25 శాతం మరియు రెండవ రోజు 50% రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కెసిఆర్ మాత్రం 16 శాతం మాత్రమే మద్యం ధరలు పెంచి చీప్ లిక్కర్ పై 11 శాతానికి పెంచారు. మద్యపాన నిషేధం లో భాగంగా జగన్ ఈ పనిని చేశామని చెబుతున్నా…. ప్రజల బలహీన సమయాన్ని చూసి దోచుకుంటున్నారని ఇప్పటికే విమర్శకులు మీద ఎక్కేశారు. కాబట్టి ఇకనైనా జగన్ మేలుకొని ఒక ఇష్యూ ని సాఫ్ట్ గా ఎలాంటి రిస్క్ లేకుండా ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే మంచిది....
5th ఎస్టేట్

టీవీ9 మీద తెలంగాణ ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది…!

siddhu
  రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా సంస్థలలో టీవీ9 చాలా కాలం నుండి అగ్రగామిగా వెలుగొందుతోంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్యన పొద్దున లేచినప్పటినుండి సోషల్ మీడియాలో టీవీ9 ఛానల్ కు ఒకటే తిట్లు.. శాపనార్ధాలు. వారి వార్తలు ప్రజెంటేషన్ మరియు డిబేట్ కోసం తీసుకునే అంశాలు… వారు వేసే వార్తల్లో ఉండే కంటెంట్ చాలామందికి నప్పదు. అంతేకాకుండా జాతీయవాదులు ఈ ఛానల్ ని ఎక్కువగా ద్వేషిస్తుంటారు అని అపవాదు కూడా ఉంది. ఇక నాస్తికుడిగా చెప్పుకునే రవి ప్రకాష్ నాటి నుండి ప్రస్తుతం ఆస్తికుడిగా కనిపించే మై హోమ్ రామేశ్వరరావు వరకూ ఎవరి చేతుల్లోకి వచ్చినా కూడా ఛానల్ పైన ప్రజలకు అభిప్రాయం మారలేదు అనే చెప్పాలి.   ఇక తాజాగా ఈ ఛానల్ పైన వచ్చిన విమర్శ ఏమిటంటే… వారు మొన్ననే ఒక స్క్రోలింగ్ వేశారు. “హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ…. ప్రాంతం ఏదైనా మరే ఛానల్ కి అందనంత దూరంలో మా టీవీ9 తెలుగు” అని. దీంతో తెలంగాణ వాసులకి ఈ ఛానల్ పై చిర్రెత్తుకొచ్చింది. తెలంగాణ పోరాట సమయంలో కూడా ఆ ఛానెల్ పై తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉండేది. ఎక్కువగా ఆంధ్ర జర్నలిస్టులు ఉండటం మరియు ప్రజల ఆకాంక్షల మేరకే మా పంథా అని రవి ప్రకాష్ అన్నా అటువంటి భావాన్ని ఎప్పుడూ ఆచరణలో చూపించకపోవడం దానికి కారణాలు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ వారి పాలనను వెక్కిరిస్తూ చాలా రోజులు ప్రభుత్వ ఆగ్రహానికి గురై కనిపించకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ మరియు తెలంగాణ లను వేర్వేరుగా చూపించడం ఏమిటని వారిపై తెలంగాణ ప్రజలకు గుస్సాయిస్తున్నారు. అసలు వారి పబ్లిసిటీ కోసం ఈ హెడ్డింగ్ వాడడం కూడా కొంచెం ఓవర్ అనే చెప్పాలి. టీవీ9 కి సెల్ పబ్లిసిటీ అవసరమే లేదు. ఎంతోకాలంగా నిజంగానే రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా ఉంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే… హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు వేరు వేరు అన్నది టీవీ9 చేసిన సొంత వర్గీకరణ అయితే కాదు. బార్క్ అనే రేటింగ్ సంస్థ మూడు విభాగాలుగా రేటింగ్ లు ఇస్తూ వస్తోంది. పత్రికలకు ఏబీసీ, ఐఆర్ఎస్ ఎలాగో…. టీవీ చానళ్లకు బార్క్ అలాగ. రేటింగ్స్ నిర్ధారణకు లెక్కలోకి తీసుకునే ప్యారామీటర్ల సంఖ్యపై, ఎంచుకునే ప్రతిపాదనల శాస్త్రీయత పై విమర్శలు ఉన్నప్పటికీ టీవీ9 లాంటి చానెళ్లకు బార్క్ మాత్రమే ప్రామాణికం. ఈ బార్క్ రేటింగ్స్ ఆధారంగా పెద్ద పెద్ద కంపెనీలు యాడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, హైదరాబాద్ లను విడివిడిగా చూస్తూ ఉంటారు. అంతేతప్ప విషయంలో టీవీ9 కు ఎటువంటి కక్ష మరియు ద్రోహం బుద్ధి కానీ లేవు. ఆ విమర్శలు సరైనవి కావు. పాపం టీవీ 9 ప్రజల ఆగ్రహానికి అనవసరంగా గురై తిట్లు తిన్నది....
5th ఎస్టేట్

మద్యమే మార్గమా…!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మద్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల కిందట ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు ప్రారంభించడంతో యుద్ధం మొదలైంది. అసలే కరోనాతో జనం విలవిలలాడుతుంటే మద్యం కారణంగా భౌతికదూరం సాధ్యం...
5th ఎస్టేట్

‘కుల’ పిచ్చి రాజకీయాలకి జగన్ మార్క్ సంకెళ్ళు…! 

siddhu
  రాజకీయాల్లో అవతలి వారు వేయబోయే ఎత్తును ముందుగానే పసిగట్టి దానికి పైఎత్తు ను సిద్ధం చేసుకోవడం చాలా కామన్. అయితే ఎవరి ఊహకు అందకుండా ఒక మాస్టర్ ప్లాన్ వేసి అవతల వారిని సందిగ్ధతలో పడేయడం అన్నది కేవలం కొద్దిమంది వల్ల మాత్రమే అవుతుంది. అటువంటి కోవకే చెందుతారు వైసిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎలాంటి అడ్డు లేకుండా నడిపించేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇన్ని రోజులు కులాల పరంగా రాజకీయాలు చేసేందుకు మొగ్గు చూపిన విపక్షాలకు చెక్ పెట్టేందుకు తగిన ఈక్వేషన్ లతో జగన్ సన్నద్ధమయ్యారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కూడా ఒక మంచి వ్యూహంతో అడుగుపెట్టిన జగన్ ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మెట్ట ప్రాంతం క్రిందకు వచ్చే నియోజకవర్గాల్లో కమ్మ వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తనకు అత్యంత సన్నిహితులైన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి కి ఆయన అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పటికే గమనించాం. అదే కాకుండా చింతలపూడి, దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమ్మవారికి ప్రాధాన్యతను పెంచారు. ఏలూరు మరియు పోలవరం నియోజకవర్గంలో కూడా వ్యూహాత్మకంగా కమ్మ వర్గం వారికి ఎక్కువ పదవులు ఇస్తూ వైసీపీ వైపు తిప్పుకోవడానికి మరియు తన వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కూడా జగన్ శ్రీకారం చుట్టారు. ఇక ఈ జిల్లాలోని మరో కీలక ప్రాంతమైన డెల్టా రీజియన్ లో కూడా జగన్ అడ్డు లేకుండా చెలరేగి పోతున్నాడు. డెల్టా ప్రాంతం క్రిందకు వచ్చే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్షత్రియ మరియు బిసి వర్గాలు బలంగా ఉన్నాయి. అక్కడ బలంగా ఉండాలంటే వారి ఓటు బ్యాంకు అత్యంత కీలకం. నిజానికి టీడీపీకి క్షత్రియ బలం పెద్దగా లేదు. అంతే కాకుండా తూర్పు కోనసీమలో కూడా రాజకీయాల్ని శాసించేది క్షత్రియులే. ఈ విషయాన్ని గమనించిన జగన్ గారికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇక బీసీ వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు కి మంత్రి పదవి కట్టబెట్టిన జగన్ అదే ప్రాంతంలో వైసిపి సమర్థవంతంగా ముందుకు సాగేందుకు కృషి చేసిన ముదునూరి ప్రసాదరాజు రాబోయే రోజుల్లో కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసేసారు. ఇక జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత చైర్మన్ ప‌ద‌వి సైతం కౌరు శ్రీనుకే ద‌క్క‌నుంది. ఇక బీసీ వ‌ర్గానికే చెందిన య‌డ్ల తాతాజీకీ డీసీఎస్ఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఇలా జ‌గ‌న్ టీడీపీకి చెక్ పెట్టే క్రమంలో ప‌శ్చిమ‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి ప్రతిగా టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి...
5th ఎస్టేట్

సంపూర్ణ మద్యపాన నిషేదం గురించి ‘ బాబు గారి ‘ ప్రవచనాలు ..

siddhu
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు వస్తున్నాయి. ఒక పక్క రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేని సమయంలో మద్యపాన నిషేధానికి సరైన సమయం ఇదే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంతా మండిపడుతున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి సగటున రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చెప్పుకోవడం లో తప్పు ఏమీ లేదు కానీ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం లిక్కర్ మరియు పొగాకు ఉత్పత్తుల నుండి వస్తుంది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే చంద్రబాబు ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చేసిన వ్యాఖ్యలు మరియు అతని రెండు నాలుకల ధోరణికి…. ప్రజలంతా నాయుడి గారి డబుల్ స్టాండర్డ్స్ కు ఇది ఉదాహరణ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992లో సంపూర్ణ మద్య నిషేధం విధించారు. అయితే ఆ సమయంలో పలు రాష్ట్రాల నుండి నకిలీ మద్యం సరఫరా పెద్దఎత్తున జరిగింది. లిక్కర్ మాఫియా కూడా పెరిగిపోయింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ నుంచి అధికారం దొరకబుచ్చుకుని చంద్రబాబు వాటిని అదుపు చేయాల్సింది పోయి ఏకంగా మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయడం అప్పట్లో అందరినీ విస్మయపరిచింది. ఇప్పుడు ఇదే విషయాన్ని పట్టుకొని నెటిజన్లు అతనిని ట్రోల్ చేస్తున్నారు. నెల రోజుల నుంచి మద్యం కోసం ఆవురావురుమంటున్న మందుబాబులు అంతా నిన్న లాక్ డౌన్ మినహాయింపులలో భాగంగా మద్యం దుకాణాలను తెలిసిన వెంటనే బారు షాపుల వద్ద క్యూ కట్టారు. నిజానికి ఇది ప్రభుత్వ వైఫల్యమే. దుకాణాలు ప్రారంభించబోతున్న విషయం ముందుగా ప్రభుత్వానికి తెలుసు మరియు మద్యం కోసం ప్రజలు ఎంత విపరీతంగా ఎగబడి భౌతిక దూరాన్ని పాటించాలి అనే విచక్షణ మరచిపోతారో కూడా తెలుసు. ఈ సమయంలో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు లేదా పరిమిత సంఖ్యలో మద్యం పంపిణీ చేసేలా ఏదో ఒకటి చేయాలి. అయితే చంద్రబాబు వాటి గురించి ఏమి ప్రస్తావించకుండా ప్రభుత్వంపై ఎలాంటి లాజిక్ లేకుండా చేసిన ఈ విమర్శలను చూసి ప్రజలంతా నవ్వుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో అతను గతంలో తీసుకున్న నిర్ణయాలను అతనికే గుర్తు చేస్తున్నారు. అదీ కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దేశంలో మద్యం షాపులు తెరవలేదు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలలో కూడా మద్యం దుకాణాలు తెరిచారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఎప్పుడూ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉంటామని.. దశల వారిగా మద్యం అమ్మకాన్ని నిషేధిస్తామని ఈ సందర్భంగా ప్రస్తావించినా కూడా బాబు ఇలాంటి విమర్శలు చేయడం తగదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు....
5th ఎస్టేట్

‘మీడియా’ పై జనాల అసహనం… రాళ్ళతో కొట్టడం వెనక కథ ఇదే 

siddhu
మీడియా అనేది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తుందన్నది గతంలో నానుడి. కానీ ఇప్పుడు…. ఏ సమాచారాన్ని అయినా తమకు తగ్గట్టుగా మార్చేసి ప్రజలకు వారికి నచ్చిన రీతిలో తెలియజేసే ఒక అబద్ధపు మాధ్యమం. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఒక బిహారీ మౌల్వీ చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారిలో ఒక అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెబితే వారు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. అక్కడితో కథ అయిపోయింది అంతా అనుకుంటారు. అయితే ఇదే విషయం పై మరింత క్లారిటీ కోసం తల్లిదండ్రుల వద్ద వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళిన స్థానికుల పైన మరియు విలేకరులపైనా అక్కడివారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఎక్కడలేని ద్వేషంతో ఒక వర్గం వారిని వార్తల్లో ఘోరంగా చూపిస్తున్నారు. రోగాన్ని మోసుకొచ్చిన తబ్లిగీలను వీళ్ళు మసీదులో దాచి పెడతారు. కావాలని అందరికీ రోగాన్ని అంటించి సమాజాన్ని రోగగ్రస్తం చేస్తారు. మీకు వ్యాధి నయం చేస్తాం టెస్ట్ చేయించుకోండి అంటే వాళ్ళ పైన రాళ్ళ దాడి చేస్తారా…? అంటూ వారందరినీ దోషులను వెనకేసుకుని వచ్చేవారిలా చూపిస్తున్నారు. అసలు మీడియా వారు తెలుసుకోవాల్సిన అంశం చిన్న పిల్లలపై లైంగిక దాడి గురించి. అది ఎంత సున్నితమైనదో మన మీడియా ప్రతినిధులకు తెలియనిది కాదు. అసలు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్థానికులే దేహశుద్ధి చేసి దోషులను అక్కడి నుండి తరిమేస్తారు. ఇక ఒక వేళ కేసు పెడితే కేసు వివరాలను పోలీసులు విలేకరులకు కూడా అందివ్వరు. వారు దర్యాప్తు చేసి ఏదైనా ముఖ్యమైన ఆధారాలు కోసమే బాధితుల తల్లిదండ్రులను సంప్రదిస్తారు. ఎందుకంటే సాక్ష్యం కోసం వెళ్లినప్పుడు స్థానికంగా…. కుటుంబాలకు సంబంధించిన పరువు విషయం అని పోలీసులు ఈ విషయాన్ని సున్నితంగా డీల్ చేస్తూ ఉంటే…. అసలు ఈ మీడియా వారు ఏం తెలుసుకోవడానికి అక్కడికి పరుగులు పెట్టినట్లు? సున్నితమైన విషయాన్ని కూడా తమదైన శైలిలో ప్రసారం చేసి అంశాన్ని ప్రక్క దోవ పట్టించి రచ్చరచ్చ చేస్తారని మీడియాపై ప్రతిచోటా స్థానికులు సందేహిస్తున్నారు. కేవలం వివరాల కోసమే వెళ్తుంటే స్థానికులు వాళ్ళ పై రాళ్ల దాడికి పాల్పడుతున్నారు అంటే వారి అరాచకం ఏ లెవల్లో ఉందో మరియు వారు ఎలాంటి క్రెడిబిలిటీని ప్రజల వద్ద సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. సున్నితమైన విషయం అయినా విపరీత ధోరణితో చెప్పడంలో మీడియాదే ప్రధాన పాత్ర. ఇక్కడ స్థానికులు సరిగ్గానే స్పందించారు అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో సమాజం యొక్క శ్రేయోభిలాషులు మీడియా వారు అన్న పేరుని వారు పూర్తిగా కోల్పోయారు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం....
5th ఎస్టేట్

బెడిసికొట్టిన ‘కే‌సి‌ఆర్ సేఫ్టీ ప్లానింగ్’ – అనుకున్నదొక్కటి అయినది మరొకటి 

siddhu
  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్థులకు తన వ్యూహాలతో ఊపిరి సలపకుండా చేయగల సమర్ధుడు అని అందరికి తెలిసిందే. అయితే కంటికి కనపడని వైరస్ కు కూడా తన అంతుచిక్కని వ్యూహాలతో చెక్ పెట్టాడని తెలంగాణ ప్రజలంతా సంబరపడిపోతున్నారు. గత వారం రోజుల నుండి తెలంగాణలో అతి తక్కువ కేసులు నమోదు కావడం గమనిస్తూనే ఉన్నాం. ఇక రాజకీయం విషయానికి వస్తే కెసిఆర్ అంతటి వ్యూహకర్త దేశంలోనే లేడు అని అందరూ కొనియాడుతూ ఉంటారు. తన మొదటి టెర్మ్ లోనే ఆరు నెలలు ఉండగానే అసెంబ్లీని రద్దు చేసిన ఆయన బంపర్ మెజారిటీతో అన్ని వైపుల నుండి సానుకూలత దొరకబుచ్చుకొని రెండవ మారు అధికారంలోకి వచ్చారు. అయితే పైకి చూసేందుకు అంతా బాగానే ఉన్నా లోపల వ్యవహారం మాత్రం మరోలా ఉంది. కేసీఆర్ ఇప్పటిదాకా వేసుకున్న లెక్కలన్నీ ఒక్క సారిగా తప్పాయి. కేటీఆర్ అదే ఊపులో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రధాని అవుతారని టిఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేసినా భారీ ఆధిక్యతతో మోడీ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రజలకు అతను చేసిన వాగ్దానాలు అన్ని నెరవేర్చి కొడుకు చేతిలో అధికారం పెట్టి జాతీయ రాజకీయాల వైపు పయనిస్తారు అనుకుంటే కరోనా దెబ్బకు పరిస్థితి అంతా మళ్లీ మొదటికి వచ్చింది. హైదరాబాద్ వంటి మహా నగరం రాష్ట్రంలో పెట్టుకుని సంపన్న రాష్ట్రంగా నిలదొక్కుకున్న తెలంగాణ లాక్ డౌన్ పుణ్యమాని ఆర్థికంగా పూర్తిగా కుదేలు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాబడి గణనీయంగా తగ్గిపోగా ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. రాజకీయంగా కూడా అతనికి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎక్కడ సందు దొరుకుతుందా…. ఎప్పుడు మీద పడి దాడి చేద్దామా అని తెలంగాణ బిజెపి కాచుకుని కూర్చుని ఉంది. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందటి స్థితికి తీసుకొని రావాలి అంటే కెసిఆర్ వల్లనే సాధ్యం అవుతుంది అన్న మాట కూడా టిఆర్ఎస్ లో ఉంది. కావున ఇటువంటి సమయంలో కొడుకు చేతికి పగ్గాలు అప్పగించి అతను జాతీయ రాజకీయాల వైపు మళ్లితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విపక్ష రాజకీయ పార్టీలు అన్నీ రెచ్చిపోయి టార్గెట్ చేస్తాయి. దీనితో కేసీఆర్ లెక్క తప్పినట్లే ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరో మూడు సంవత్సరాల పాటు తానే సీఎం గా కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ సాధారణ స్థితికి వచ్చే సమయానికి 2023 లో రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు కూడా మొదలై పోతాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన తరువాత 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలను చూసుకుని కేసీఆర్ తెలంగాణాను కొడుకు చేతిల్లో పెడతారని అంటున్నారు. అంటే ఈ టెర్మ్ కి ఎటువంటి మార్పూ లేకుండా కేసీఆరే సీఎంగా కొనసాగుతారు. మొత్తానికి కరోనా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ని ఒక్కసారిగా తల్లకిందులు చేసేసింది అని చెప్పాలి...
5th ఎస్టేట్

గుడ్ న్యూస్: వాళ్లకి కరోనా వచ్చే ఛాన్సే లేదు

siddhu
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక తాజా వార్త బయటకి వస్తోంది. ఆటు ప్రపంచ దేశాలు మరియు మన దేశంలోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మానవజాతి కలిసి మరికొంత కాలం...
5th ఎస్టేట్

కోతలు… తీతల ఈనాడు…!

Srinivas Manem
తెలుగు పత్రికా రంగంలో లో ఓ వెలుగు వెలిగిన ఈనాడు ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమాని నెమ్మదిగా కిందకు  దిగుతోంది. కేవలం 40 రోజుల వ్యవధిలో భారీగా పడిపోయిన సర్క్యులేషన్ కాపాడుకోలేక.., నష్టాల్ని ఓర్చుకోలేక..,...
5th ఎస్టేట్

బాబు గారికి బీపీ తెప్పిస్తున్నా ‘ విజయవాడ ‘ రాజకీయం ..

siddhu
  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గత ఐదేళ్ల పాలనలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే కృష్ణా జిల్లాకు ఆయన చేసింది చాలానే ఉంది. అన్ని జిల్లాల్లో మంత్రులను మార్చినప్పటికీ…. ఆ జిల్లా నుండి ఇద్దరికి ఇచ్చిన మంత్రి పదవులు మాత్రం ఆయన తన పాలనా కాలం మొత్తం కొనసాగించారు. అదీ కాకుండా కేబినెట్ లో కీలక పదవులైన డిప్యూటీ స్పీకర్ మరియు విప్ కూడా ఆ జిల్లాకు చెందిన నాయకులకే చంద్రబాబు కట్టబెట్టారు. ఇలా టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కృష్ణా జిల్లా నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అదే సమయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య చాలా వివాదాలు కూడా నడిచాయి. కానీ గత ఏడాది సీన్ రివర్స్ అయిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా నాయకులు ఏమన్నా బాసటగా నిలుస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉండే నాయకుడు అయితే కనీసం పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టి కొన్ని నెలలు అయిపోయింది. వీరిలో చాలామంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయారు. జిల్లాలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా మంత్రి దేవినేని అప్పట్లో వన్ మ్యాన్ షో కొనసాగించగా ఇప్పుడు మాత్రం ఏదో నామ్ కె వాస్తు వైసిపి పార్టీ పై అడపాదడపా విమర్శలు చేస్తున్నారు తప్పించి పార్టీ ఎదుగుదలలో సమర్థవంతంగా అతని కృషి అయితే కనిపించడం లేదు. వీరందరి ప్రవర్తన చూస్తుంటే చంద్రబాబు కి ఎక్కడలేని బిపి వస్తుందని ఆ పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. అప్పట్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ టిడిపి బోర్డులో సభ్యుడిగా బాబు చాన్స్ ఇవ్వగా…. బుద్ధ వెంకన్న కు విప్ హోదాతో పాటు విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్ గా నియమించగా.. బుద్ధ ప్రసాద్ కి డిప్యూటీ స్పీకర్ ఛాన్స్ ఇచ్చారు. వీరిలో మండలి బుద్ధ ప్రసాద్ ఇప్పటివరకు ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చేయకపోగా.. కనీసం టిడిపి వాయిస్ కూడా బయటకు వినపడనివ్వని పరిస్థితి. ఇక బుద్ధ వెంకన్న, బోండా ఉమ మీడియాతో టచ్ లో ఉంటూ ఉన్న కూడా జిల్లాలోని పార్టీ నేతలందరినీ కలుపుకొనిపోయి ఒక శక్తిగా ఎదిగింది అయితే ఏమీ లేదు. ఇక గన్నవరం నుండి గెలిచిన వంశీ అయితే ఏకంగా పార్టీని వదిలి వెళ్ళిపోయాడు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. కరోనా నేపథ్యంలో ఆయన దీక్షకు దిగినా అది పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత వృథా కాగా.. పార్టీలో సీనియర్లను హైకమాండ్ వేధిస్తుండడంతో గమనార్హం....
5th ఎస్టేట్

కరోనా దారుణం: గౌరవప్రదమైన ‘చావు’ కోసం…

siddhu
  ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో హృదయ విచారకర సంఘటనలను చూడాల్సి వస్తోంది. డాక్టర్లు మరియు ఇతర హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బారిన పడిన వారికి చికిత్స చేస్తూ ప్రాణాలు వదిలిన తీరు… హృదయాన్ని కలచి వేసే సంఘటనలు… ఎన్నో ఉన్నాయి. వీటి మధ్య లాక్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వలస జీవులు సుదూర ప్రాంతాలకు తన ప్రాణాలను లెక్కచేయకుండా కాలి బాట పట్టడం కూడా ఇప్పుడు మనం ఉన్న దయనీయమైన స్థితిని గుర్తు చేస్తోంది. చంకలో చంటిబిడ్డ…. నెత్తిన పాతాళానికి తొక్కేంత బరువు ఉన్న మూటలు వేసుకొని హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుండి ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు రోడ్డు వెంబడి నడుస్తూ.. సైకిళ్లపై శ్రమిస్తూ వేలాది కిలోమీటర్ల ప్రయాణించడానికి వలస కార్మికులు పడుతున్న శ్రమ ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. ఒక పసి బిడ్డ అయితే అడవుల్లో పడి తన సొంత రాష్ట్రానికి వెళుతూ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఇంకొక వయసుమళ్ళిన వ్యక్తి అయితే కాలినడకన పొరుగున ఉన్న సొంత రాష్ట్రానికి తరలిపోతూ జాతీయ రహదారిపై విగత జీవిగా మారాడు. నిన్నటికి నిన్న చెన్నై నుండి శ్రీకాకుళం జిల్లా కు వెయ్యి కిలో మీటర్ల చొప్పున నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా సాహస యాత్ర చేసి గమ్యస్థానం చేరిన మత్స్యకారుల గురించి వింటే మనసు ద్రవిస్తుంది. నిద్ర లేదు…. ఆహారం లేదు ఎప్పుడెప్పుడు కబళించి వేద్దామా అన్నట్లు అల్పపీడనం వల్ల ఎగిసిపడుతున్న అలల మధ్య సొంత ఊరికి చేరడం వెనక ఒకచావు స్ఫూర్తి ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఊరు కాని ఊరిలో ఉండి ఆకలికి అలమటించి దిక్కులేని చావు చచ్చే కన్నా ఒంటి లో ఉన్న సత్తువ కు పరీక్ష పెట్టి స్వగ్రామానికి ఎలాగైనా తిరిగి వెళ్లి అక్కడ గౌరవప్రదమైన రీతిలో తనువు చాలిదాం అన్న వారి సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సొంత ఊరికి రావాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తే “బ్రతకడం కోసం ఎక్కడికో వచ్చాం.. కనీసం చావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడైనా సొంత నేలపైన చావకపోతే ఎలా” అని చెబుతుంటే వారు తమ నేలతల్లితో పాటుగా తన చావును కూడా సమానంగా ప్రేమించడం కనిపిస్తోంది. మహారాష్ట్రలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడి చనిపోయాడు కానీ మృతదేహాన్ని సొంత ఇంటికి చేర్చలేని దుస్థితి. బంధు మిత్రులకు ఒక చివరి చూపు దక్కే పరిస్థితి లేదు. ఈ ఉదంతం వారి కుటుంబ సభ్యులను జీవితాంతం వెంటాడుతుంది .అలాగే ఇటీవల నెల్లూరుకు చెందిన డాక్టర్ కరోనా కారణంగా చెన్నైలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది పేషెంట్లకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన అతనిని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఒక అనాధ శవంలా అంత్యక్రియలు జరిపి స్మశానానికి తరలించిన తీరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఇన్నేళ్లు వైద్య సేవ చేసి ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించిన అతను చివరికి నా అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా చివరి ప్రయాణం చేయడం ఎంతవరకు సమంజసం?...
5th ఎస్టేట్

కిమ్ వచ్చేసారహో…!

Srinivas Manem
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ యాన్ వచ్చేసారు. ఆ దేశ మీడియాకి కనిపించారు. స్వయంగా ఆ దేశ మీడియా ఈరోజు వెల్లడించింది. కిమ్ కి ఏమైంది? కనిపించడం ఏంటి? అనుకుంటున్నారేమో…! ప్రత్యర్థులకు హెచ్చరికలు..,...
5th ఎస్టేట్

కుప్పం నుంచి కుప్పలు కుప్పలు గా లెక్కలు బయటకొస్తున్నాయ్ ?  

siddhu
  రాష్ట్ర రాజకీయాలలో కుప్పం నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన అక్కడ ఆయన ఇప్పటివరకు ఓడింది లేదు. అయితే ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడం…. వెంటనే కుప్పం నియోజకవర్గాన్ని గట్టిగా టార్గెట్ చేసి దానిని పురపాలక సంఘంగా మార్చడం త్వరత్వరగా జరిగిపోయాయి. కుప్పం పురపాలక సంఘంగా చంద్రబాబు హయాంలోనే మారకపోగా.. కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పడు ఉన్న ప్రభుత్వ పనితీరుపై ఫుల్ గా హ్యాపీ అయిపోయారు. తొలిమెట్టు విజయవంతంగా వేసిన జగన్ ఇప్పుడు తర్వాత అసలైన వ్యవహారంలోకి వచ్చాడు. సొంత నియోజకవర్గపు వ్యవహారాల్లో బాబు గురించి ఏదైనా గుట్టు బయటపడుతుందేమో అని విపరీతంగా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఎంతైనా చంద్రబాబు తెలివి మెచ్చుకోవాలి. ఎక్కడా దొరకడు…. ఫైళ్లను ఉండడు అందుకే అప్పట్లో వైఎస్ కు చిక్కలేదు జగన్ కు తొమ్మిది నెలల నుండి విపరీతంగా ప్రయత్నిస్తున్నా దొరకట్లేదు.  ఇక జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబుని వీలైనన్ని కేసులు బుక్ చేసి బీటలు వారిన తెలుగుదేశం స్థంబాలను కూల్చేయాలని మంచి కసి మీద ఉన్నాడు. దీనిలో భాగంగా జరిగిన అనేక తవ్వకాల్లో కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అయితే బాబు గారు ఏమైనా సామాన్యుడా…? డైరెక్ట్ గా అతను ఎందులో తలదూర్చడన్న విషయం కొంచెం లోతుగా వెళితే తెలిసింది. అయితే ఏమి ఎన్నో ఏళ్లుగా కుప్పంలో చంద్రబాబు తరఫున అతని అన్ని వ్యవహారాలను చూసుకునే అతని పర్సనల్ అసిస్టెంట్ అనగా పిఎ మనోహర్ ఇరుక్కున్నాడు. ఒక్క మనోహర్ మాత్రమే కాదు బాబు కి సపోర్ట్ గా ఇన్ని రోజులు ఉన్న అందరినీ టార్గెట్ చేసి ఒక్కసారిగా కుప్పం కుప్పలో నుంచి బయటికి లాగారు. టౌన్ బ్యాంకు లో దాదాపు రెండు కోట్ల వరకు స్కామ్ జరిగిందని లెక్కలు వేశారు. ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేసి…. అసలు దాని కథాకమామిషు ఏంటో తేలుస్తున్నారు. వీటిలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే మనోహర్ ఇందులో బుక్ కావడం బాబు కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి, చిటారుకొమ్మన అందుకోవాలంటే కష్టపడి చెట్టు ఎక్కాల్సిన పని లేదు అన్న విషయం ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి బోధ పడినట్లు ఉంది. ఇక ఈ స్కామ్ విషయమై ప్రస్తుత బ్యాంకు చైర్మన్ ఫిర్యాదు చేయడం మరొక విశేషం. దీనితో పోలీసులు కేసు బుక్ చేసి చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఇక త్వరలోనే స్కామ్ పై పూర్తి వివరాలు బయట పడతాయి కానీ ప్రాథమికంగా బయటకు వచ్చిన ఒక అభియోగం మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఏమిటంటే ప్రత్యేకంగా ఆడిటింగ్ మరియు జువెలరీ పరిశీలన జరిగినప్పుడు 30 బంగారు ప్యాకెట్లు కనిపించలేదట. ఇది ఏంటి రా బాబు అని ఆరాతీస్తే మేనేజర్ నవీన్ బాబు మరియు క్యాషియర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు బంగారం మాయం కావడం ఏమిటి? ఈ వ్యవహారం అంతా పక్కనపెడితే మరొక ఒక 20 లక్షల 25 వేలు లెక్క తేలడం లేదు. ఇదేమిటని మేనేజర్ ను ప్రశ్నిస్తే.. 2015లో శ్రీనివాసులు తీసుకొని పోయాడు…. ఆయన మనోహర్ మనిషి అంటాడు. ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడి యొక్క 16 బాండ్లను కుదువపెట్టి డబ్బు తీసుకొని పోయాడు అని అన్నాడట. అసలు గుడి ఏమిటి? గుడి బాండ్లు కుదువపెడితే డబ్బులు ఎలా ఇస్తారు? దీనికి చంద్రబాబు పిఏ రికమండేషన్ ఏమిటి? ఇప్పుడు వైసిపి కింకర్తవ్యం చంద్రబాబు పిఎ మనోహర్ ను లాక్ చేయడం. ఇక అతను అప్రూవర్ గా మారాలేకాని కుప్పంలో చంద్రబాబు లింక్స్ కత్తిరించడం వైసీపీకి పెద్ద పనేం కాదు. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది....
5th ఎస్టేట్

జనసేనకి  ‘ఆక్సిజన్’ అందడం లేదు… పార్టీ లో బ్లేమ్ గేమ్ షురూ ?

siddhu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని గా మారినప్పటి నుండి అతనికి భయంకరమైన కష్టాలు మొదలయ్యాయి. ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో కానీ అతను నడుస్తున్న దారి అంతా గతుకుల మయం అయిపోయింది. ఎన్నికలలో...
5th ఎస్టేట్

దేశం క్షేమమా..? క్షామమా…?

Srinivas Manem
దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితులు ఎటు వైపు మళ్లుతున్నాయి..? కరోనా వ్యాప్తి పెరిగితే దేశం లో ఆకలి చావులు వస్తాయా …? కరోనా నేపథ్యంలో మన దేశం క్షేమమేనా…? క్షామం వైపు వెళ్తున్నామా..?...
5th ఎస్టేట్

రుణాల రద్దులు దేనికి సంకేతం…?

Srinivas Manem
వారివి అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు..! రూ. వేలకోట్ల ఆస్తి పరులు. కానీ బ్యాంకులకు వేల కోట్లు బకాయి పడ్డారు. ఈ బకాయిలను ఆర్బీఐ రద్దు చేసింది. దేశంలోని 50 మందికి చెందిన మొండి...
5th ఎస్టేట్

శ్రీకాకుళం కరోనా కథ – ఇంతింత కాదయా ..!

siddhu
  గత కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలే ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్నాయి. వాటిని చూసి మిగతా జిల్లా ప్రజలు కూడా త్వరలోనే తాము కరోనా ని నియంత్రించి ఆ జాబితాలోకి వెళ్ళిపోదామని ఆశగా కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో మొన్న నాలుగు కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రజలంతా అవాక్కయ్యారు. ఆ నాలుగు కేసులు కి కారణం ఒకడే. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు రాగా మిగిలిన వారికి కూడా అంటించాడు. తాజాగా ఇప్పుడు జిల్లాలో మరో కరోనా కేసు నమోదు కాగా ఇంతకుముందు వచ్చిన నాలుగు కేసులకు మరియు ఇప్పుడు వచ్చిన ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. దీనితో ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయింది. విషయం ఏమిటని ఆరా తీస్తే శ్రీకాకుళం జిల్లా పి ఎస్ కాలనీకి చెందిన ఈ విద్యార్థి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. లాక్ డౌన్ కన్నా ముందే ఇంటికి చేరుకున్న కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించడం గమనార్హం. అయితే ఇప్పుడు అతనికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ మర్కజ్ కు హాజరైన వ్యక్తులతో ట్రైన్ ప్రయాణం చేసి ఉండటం వల్ల ఇతనికి కరోనా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇతను అధికారులకు సమాచారం ఇచ్చి క్వారంటైన్ కు వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఏదైనా చాలా అనూహ్యరీతిలో ఒక్కసారిగా ఈ జిల్లాలో ఐదు కేసులు రావడం ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా ఇప్పుడు నమోదైన తాజా కేసు శ్రీకాకుళం టౌన్ లో మొదటిది. ఇంతకుముందు నమోదైన 4 కేసులు పాతపట్నం ప్రాంతానికి చెందినవి. ప్రస్తుతం సదరు విద్యార్థి, టౌన్ లో ఏఏ ప్రాంతాల్లో తిరిగాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అతడు నివశిస్తున్న పీఎన్ కాలనీని పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పోలీసులు-అధికారులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు....
5th ఎస్టేట్

పెద్దల కీ – పేదల కీ తేడా అదేనన్న మాట .. RBI చూపించిన చలన చిత్రం ! 

Siva Prasad
  ఆర్బీఐ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారత దేశ ప్రజలకు ఒక మాంచి చలనచిత్రం చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో 68,607 కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తల రుణాలను రైట్ ఆఫ్ చేసింది. ఇవి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన టాప్-50 కి చెందిన జాబితా వారి మొత్తం మాత్రమే కావడం గమనార్హం. ఇది కూడా ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ స్వచ్ఛందంగా వెల్లడించలేదు. సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన సమాచారం.   అయితే రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు, బ్యాంకర్లు చెబుతున్న కూడా సాంకేతికంగా రుణమాఫీ అన్నా.. పద్దుల మార్పిడి అన్నా… ఇక వారి దగ్గర నుండి బకాయిలను రాబట్టలేమని చెప్పి చేతులెత్తేయడం. ఎగవేతదారుల హామీగా పెట్టినా ఆస్తులన్నింటినీ వేలం వేశాక.. వీలైనన్ని మార్గాల్లో డబ్బులు వసూలు చేయగా ఇంకా బకాయిలు మిగిలితే చేసేది ఏమీ లేక వాటిని రైటాఫ్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇలా రైట్ ఆఫ్ పొందినవారిలో అత్యధికులు సమాజంలో ధనికులుగా చలామణి అవుతూ కోట్ల రూపాయల విలువ చేసే కార్లలో తిరిగే కుబేరులే. ఇక సామాన్యుల విషయానికి వద్దాం. లాక్ డౌన్ విధించింది ప్రభుత్వమే. అసలు ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా కారణం కూడా ప్రభుత్వమే. ఎలాంటిది ఇటువంటి క్లిష్ట సమయంలో మూడు నెలలు ఈఎంఐ కట్టలేము మొర్రో అని అంటే అది వాయిదా వేసుకునే ఛాన్స్ ఇచ్చిన ఆర్బీఐ ఏదో పెద్ద మేలు చేసినట్లు పోజ్ కొట్టి చివరికి ఆ వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ కలిపేసి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సామాన్యులకు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టేంత సీన్ లేదు కదా. అదే బడా పారిశ్రామికవేత్తలు అయితే వీటిని మొండి బకాయిలుగా చేస్తారు. వాళ్లకు ఏమో ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం. ఇలా వాళ్లు వేలాది కోట్లు ఎగ్గొట్టి తిరుగుతుంటే వారిని ఏమీ చేయలేక సామాన్యుల మీద పడి దోచేస్తుంటారు. చివరికి సామాన్యులను ట్యాక్సులు అడగడానికి మనసు ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంతకీ అలా రుణాలు మాఫీ చేయించుకున్నవారి లిస్ట్ చూస్తే నీరవ్ మోడీ మామ మోహుల్ చొక్సీ, బాబా రామ్ దేవ్, విజయ్ మాల్యా, మన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉన్నారు. రేపు లాక్ డౌన్ ముగిశాక తమ రుణాలు కట్టడానికి ఇబ్బంది పడే సామాన్యులు ఎవరు అంటే మన ఇంటి వద్ద చిల్లర దుకాణం పెట్టుకున్న, వెంకట్రావు 20 సంవత్సరాల నుండి సొంత ఇంటి లోన్  కట్టుకుంటున్న రమేషు… వీరి చివర ఆటో నడుపుకునే సైదులు. ఇదీ మనందరం జీవిస్తున్న ఆధునిక జీవిత చలన చిత్రం....
5th ఎస్టేట్

తెలుగునాట రాజకీయం అంతే మరి .. సంచయిత కే అలవాటైంది అంటే అర్ధం చేసుకోండి 

Siva Prasad
మన తెలుగు రాష్ట్రంలో రాజకీయం ఒంటబట్టించుకోవడం అరటికాయ తిన్నంత సులువు. ఏం చదువుకున్నా.. ఎంతటి అనుభవం ఉన్నా.. ఏ పరిస్థితుల మధ్య పుట్టి పెరిగినా ఒక్కసారి పదవి చేతిలో పడింది అంటే చాలు రాజకీయం...
5th ఎస్టేట్

పరీక్ష పెరిగే… ఫలితం పెరిగే…!

Srinivas Manem
  ఏపీలో ఈ మధ్య కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అవును నిజమే…! తెలంగాణ లో ఈ మధ్య కరోనా కేసులు బాగా తగ్గిపోతున్నాయి. అవును. నిజమే…! ఏపీలో కరోనా కేసుల నియంత్రణలో జగన్...
5th ఎస్టేట్

నిమ్మగడ్డ కేసు; కోర్టు వాదనల్లో కొత్త వివాదం…!

Srinivas Manem
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై కోర్టులో వాదనలు భిన్నంగా సాగుతున్నాయి. ఈరోజు ఏకంగా హైకోర్టు సీజే కి ఆగ్రహం వచ్చే ఘటన జరిగింది. దీనిలో కొత్త అనుమానాలు కూడా...
5th ఎస్టేట్

కరోనా కాటు – ప్రపంచానికి పాఠం

Siva Prasad
sample 7 వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది...
5th ఎస్టేట్

జగన్ మనసు మళ్ళీ మండలి వైపు ?

Siva Prasad
sample 6 ఈ మండలి వ్యవస్థ జగన్ కి అనేక తలనొప్పులు తీసుకొస్తుంది. పాపం మూడు రాజధానుల కథకి విరామం పడడానికి మండలి అడ్డుగా ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డని సాగనంపాలన్న మళ్ళీ...
5th ఎస్టేట్

నష్టాల ఊబిలో ప్రభుత్వాలు – గట్టెక్కే దిక్కు ఇదే?

Siva Prasad
sample 5 కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రులకు తాకిడి మించుతుంది. ఇప్పుడున్న పరిస్థితి వరకు పర్వలేదు. కానీ ఇది కరోనా. అసలు ఆగే అవకాశాలు కనిపించట్లేదు. అందుకే ఆస్పత్రుల్లో సదుపాయాలు...
5th ఎస్టేట్

న్యూయార్క్ దారుణం వెనక ఊహించని నిజాలు

Siva Prasad
sample 4 పాపం అమెరికా…! ఆర్ధిక, సాంకేతిక, సైన్స్ రంగాలకు పెద్దన్న అమెరికా. అందుకే ఆ దేశాన్ని అగ్రరాజ్యం అంటుంటారు. మరి ఇప్పుడు ఆ అగ్రరాజ్యం అల్లాడుతుంది. కరోనా ధాటికి కోలుకోలేక విలవిల్లాడుతుంది. ఏం...
5th ఎస్టేట్

ఇటలీలో మారణహోమం

Siva Prasad
sample 3 చైనా చితికలపడింది. అమెరికా అల్లాడుతుంది. ఇటలీలో మారణహోమం కొనసాగుతుంది. స్పెయిన్లో కేసుల విజృంభన ఆగడంలేదు. బ్రిటన్ లో సాక్షాత్తు ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రికి వైరస్ సోకింది…! ఇన్ని పెద్ద దేశాలు...
5th ఎస్టేట్

ఫాక్ట్ చెక్ : పోలింగ్ సరళి అనేది నిజమైనదేనా

Siva Prasad
(sample7) తెలంగాణ ఎన్నికలలో పోలింగ్ సరళిని చూస్తుంటే ఓట వేయాలన్నభావన ప్రజలలో పెరిగిందని అనిపిస్తున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి నిలబడి ఉండటం..పలు చోట్ల...
5th ఎస్టేట్

ఇదో ఎట్టి చాకిరీ…!

Srinivas Manem
నీటిలో గాలం వేసి చేప కోసం వేచి చూడడం… అడవిలో వల వేసి జింక కోసం చూడడం… ఆ సంస్థలో ఉద్యోగుల చిన్నపాటి తప్పుల కోసం వేచి చూడడం సహజంగా మారింది. పాపం వెట్టి...