NewsOrbit

Category : 5th ఎస్టేట్

Read the best editorial news from the newsorbit. We provide in depth information on editorial news(సంపాదకీయం వార్తలు).

5th ఎస్టేట్

టాప్ రివెంజ్ స్టోరీ : చంద్రబాబు ని కోర్టు బోను ఎక్కించబోతున్న జగన్ ??

siddhu
ఇప్పటికే కీలక నేతల అరెస్టులతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దానికి తగ్గట్టు పార్టీలోనే అత్యంత సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడి పై కూడా నిర్భయ కేసు పెట్టడంతో అతని అరెస్టు కూడా...
5th ఎస్టేట్ Featured

న్యూస్ ఆర్బిట్ స్పెషల్ – చైనాతో యుద్ధం వస్తే…!!

Srinivas Manem
చైనా…. కరుడు గట్టిన గుణం…, అధునాతన ఆయుధ సంపత్తి…, కావాల్సినవి ఏమైనా ఇస్తామన్న అధినేత… వెరసి చైనా ఆర్మీ బలంగా ఉంది నిజమే. డబ్బు ఉంది, సాంకేతికత ఉంది, విపరీతమైన జనమున్న సైనిక బలగముంది...
5th ఎస్టేట్

మోడీ చేతకానితనమే తప్ప దీనికి ఆన్సర్ ఇంకేంటి?

siddhu
సంవత్సరం క్రితం భారత సైన్యం మీద పుల్వామా అటాక్ జరిగినప్పుడు వరుసగా ఉన్న శవపేటికల ముందు చేతులు జోడించి నివాళులు అర్పిస్తూ గంభీరంగా నడుస్తున్న మన ప్రధాని మోదీ ని చూసి అంతా గర్వపడ్డారు....
5th ఎస్టేట్ న్యూస్ బిగ్ స్టోరీ

ప్లాన్ మార్చి… పాఠం నేర్చుకుంటున్న జగన్…!

Srinivas Manem
సీఎం జగన్ ప్లాన్ మార్చారు…! పాత వ్యూహాన్ని వీడి, కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసారు. ఒకరకంగా ఓపిక అనే పాఠం నేర్చుకున్నారు. నిపుణుల సలహాలు విన్నారో, తనే ఆలోచన చేశారో, ఓపిక నేర్చుకున్నారో… కారణం...
5th ఎస్టేట్

జగన్ కి ఎవ్వరూ చేయలేని మేలు చేసిన డిల్లీ పెద్దలు – తమకి తెలియకుండానే .. !!

siddhu
అసలు జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చాలామంది మదిలో తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. బీజేపీ విషయంలో జగన్ దారెటు? చంద్రబాబు లాగా కలిసిమెలిసి ఉంటారా లేదా కేంద్రం పై పోరులో కేసీఆర్ కు సహకరిస్తారా?...
5th ఎస్టేట్

‘జాతీయ స్థాయి లో చంద్రబాబు ని…’ ఇదే జగన్ టార్గెట్ ?

siddhu
ఎక్కడైనా ఏమరపాటు వ్యవహరిస్తే ఓడలు బండ్లు అవుతాయి—బండ్లు ఓడలు అవుతాయి. ఇక రాజకీయాల్లో అయితే ఈ ప్రక్రియ జరగడానికి ఎంతో సేపు పట్టదు. ఈరోజు అధికార పార్టీకి ఇచ్చిన మద్దతు పక్క రోజు విపక్షం...
5th ఎస్టేట్

తిన్నామా… పడుకున్నామా… తెల్లారి చిరంజీవి మీద పడి ఏడిచామా !!

siddhu
గత కొద్ది రోజులుగా ఎవరు ఏం ఆశించి చేస్తున్నారో తెలియదు కానీ సినీ నటుడు చిరంజీవిపై చాలామంది గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బాలయ్య చిరంజీవి పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇప్పుడు...
5th ఎస్టేట్

అన్నీ పక్కనపెట్టి – హెరిటేజ్ మీద జగన్ అండ్ కో టోటల్ ఫోకస్ !!

siddhu
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం చెలరేగుతున్న తీరు చూస్తుంటే విపక్షాలు హడలిపోతున్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్న మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలను అవినీతి నిరోధక శాఖ మరియు సిబిఐ...
5th ఎస్టేట్ న్యూస్

ఇంటర్ ఫలితాలు..: ఓ చీకటికి వెలుగు…!!

Srinivas Manem
ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గి ఉండొచ్చు గాక…, ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఉత్తీర్ణత పడిపోవచ్చు గాక.., గత ఏడాదితో పోలిస్తే 9 శాతం తగ్గి ఉండొచ్చు గాక…! ఇవన్నీ చదువులు తగ్గాయి అనే ఆందోళన కంటే...
5th ఎస్టేట్

స్ట్రాంగ్ – వీక్ – సూపర్ హిట్ – డిజాస్టర్ – జగన్ దారెటు?

siddhu
జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. అంతా…. జగన్ తన తొమ్మిదేళ్ల ప్రతిపక్షంలో అధికార పార్టీ వారు చేసే తప్పులను చూసి బాగా రాటుదేలాడు అని...
5th ఎస్టేట్

రామోజీ అతి తెలివి…!

Srinivas Manem
ఉద్యోగాల నుంచి పీకము..! జీతాలు తగ్గించము..! మీకు ఎటువంటి హనీ తల పెట్టము., మీ ఉద్యోగం భద్రమే.. కానీ సగం రోజులే పని చేయాలి, సగం జీవితమే తీసుకోవాలి. కానీ నెలలో అన్ని రోజులు...
5th ఎస్టేట్

ఏపీ అప్పుల ఊబి : జగన్ – చంద్రబాబు ఇద్దరిదీ ఈ పాపం

siddhu
స్వర్ణాంధ్ర గా పేరొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిజంగా బాగా అభివృద్ధి లోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో విభజన వల్ల ఉత్తి ఆంధ్రప్రదేశ్ గా13 జిల్లాల తో మిగిలిపోయింది. తెలంగాణ లో హైదరాబాదు అంత మహానగరంగా...
5th ఎస్టేట్

వైసిపిలోకి మాజీ మంత్రి…! నిజమా, కాదా..??

Srinivas Manem
వైసిపి ఆపరేషన్ ఆకర్షకి పదును పెట్టింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనికి బాగా పని చెప్తున్నారు. జగన్ ఆదేశిస్తున్నారో.., లేదా ఆయనే ముందడుగు వేస్తన్నారో కానీ… టిడిపి ని ఖాళీ...
5th ఎస్టేట్

రేవంత్ రెడ్డి గతం లో చేసిన పనులు బయటకి లాగడమే తెలంగాణా అట్టుడికింది!

siddhu
ఏ రాజకీయ నాయకుడికైనా గతాన్ని దాచడం లేదా సంవత్సరాలు గడిచిపోయాయి కదా అని దానిని విస్మరించడం అసాధ్యమైన పని. ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి దిగినప్పటి నుండి అతను ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎలాంటివాడు...
5th ఎస్టేట్ న్యూస్

మంత్రులు ఏడాదిలో చేసిందేమిటి…?

Srinivas Manem
ఏపీలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తవుతుంది. ఈ వ్యవధిలో మంత్రులుగా వారు సాధించిన ఏమిటి..? శాఖలపై పట్టు ఎంత వరకు వచ్చింది..? మంత్రులు అంటే సీఎం భజన బృందం గానే...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

జగన్ పై “అసంతృప్తి – అవినీతి” ఓ వాస్తవం..!!

Srinivas Manem
అధికార పార్టీలో అసంతృప్తి – అవినీతి రాజుకుంటుందా…? అదే నిజమైతే కారణాలు ఏంటి…? ధర్మాన, ఆనం, మహిధర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక వ్యూహం ఏంటి..? ఇసుకలో జరుగుతున్న లోపాలు, అసలు...
5th ఎస్టేట్ న్యూస్

ఈనాడు ఇలా… ఆంధ్రజ్యోతి అలా…!

Srinivas Manem
ఇళ్ల స్థలాల పేరిట అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. తక్కువ ధర ఉన్న స్థలాలను తామే స్వయంగా ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తద్వారా రూ. వందల కోట్లు అవినీతికి తెరతీశారు…! ఇదీ ఈరోజు...
5th ఎస్టేట్

కేంద్రం దగ్గర జగన్  డౌన్ అవుతాడు అనుకుంటే…. వారినే తలదన్నాడుగా

siddhu
పాలన విషయంలో దేశంలో ముఖ్యమంత్రుల మధ్య మరియు ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి కి పోలికలు తరచుగా జరుగుతూ ఉంటాయి. విశ్లేషకులు పాలకుల యొక్క పర్ఫామెన్స్ ని ఏ ఏడాదికి ఆ ఏడాది విశ్లేషిస్తూ ఉంటారు. ఇదే...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

సొంత పార్టీ లో అపోజిషన్ – జగన్ చడీచప్పుడు కాకుండా కొత్త ప్లాన్ ?

siddhu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా కొద్ది రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అతని పాలన పై విశ్లేషణలు చేసి చివరికి దాదాపు ప్రశంసలే కురిపించారు. జగన్...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఎల్లో మీడియాకి జగన్ స్ట్రాంగ్ ముకుతాడు…

siddhu
మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగాల్సిన కీలకమైన భేటీ రద్దయింది. కరోనా వైరస్ తీవ్రత మరియు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం...
5th ఎస్టేట్

అదిగదిగో ఓడుతున్న రామోజీ…!

Srinivas Manem
రామోజీ… మీడియా మొఘల్… వేలకోట్ల సామ్రాజ్య అధిపతి… వందల ఎకరాల ఫిలిం సిటీకి అధినేత.. అనేక వ్యాపారాల సృష్టికర్త… తెలుగు మీడియాకు ఒక పెద్ద దిక్కు… తెలుగు దేశం పార్టీకి వెన్నుదన్ను… ఆ సామజిక...
5th ఎస్టేట్ న్యూస్

ఏబీఎన్ ఆర్కే కొత్త తప్పులు…!

Srinivas Manem
అక్షరమంటే దిక్కు .., దిక్సూచి… లక్ష్యం… ఉండాలి. అవి సదుద్దేశంతో ఉండాలి. అవి లేకపోతేనే “దిక్కులేని అక్షరాలు” అంటుంటారు. తెలుగునాట ఆ దిక్కులేని అక్షరాలకు ఆజ్యం పోసింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రమే.దిక్కు అంటే ఇక్కడ...
5th ఎస్టేట్

రామోజీ మనసు జగన్ పై పడింది… జోస్యం ఇదే!

siddhu
  ఇటీవల కాలంలో మనం గమనించినట్లైతే…. ఈనాడు పత్రిక జగన్ సర్కారుకు అండగా నిలుస్తోంది. సాక్షి పేపర్ కన్నా లోతుగా జగన్ గురించి పాజిటివ్ గా వీరు విశ్లేషిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర పాఠకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తో మనం సహజీవనం చేయాల్సిందే అని ఏపీ సీఎం జగన్ మొదట్లో అన్నప్పుడు ప్రతిపక్షాలు మరియు ఎల్లోమీడియా అవహేళన చేయగా ఆ సమయంలో ఈనాడు మాత్రం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నారాయణమూర్తి కరోనా పై మాట్లాడిన మాటలు జగన్ అభిప్రాయాలను సమర్థించినట్లు ఉన్నాయి అని జగన్ కు చేదోడు వాదోడుగా నిలచింది. సాధారణంగా ఈ పని చేయాల్సిన సాక్షి పత్రిక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం గమనార్హం.   ఆ ఒక్కటేనా…! జగన్ సర్కార్ యొక్క పరపతిని మరియు పాలనాదక్షత ను తెలియజేసే విషయాలన్నింటినీ ఈనాడు మొదటి పేజీలో ప్రచురించడం మొదలు పెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప మరి ఏ ఇతర మార్గాల్లో రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ ఒక్క పని జగన్ చేయడం లేదని బలంగా విమర్శలు వినిపిస్తున్న దశలో ఈనాడు రాష్ట్రంలో ‘9 భారీ పరిశ్రమలు’ పేరుతో ఒక శీర్షిక ప్రచురించి అందరి దృష్టిని ఆకర్షించింది. 18 వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఈ కథనంలో వారు చెప్పగా దానిలో లోతుగా వెళితే మరిన్ని ఆసక్తికర విషయాలు జగన్ కు పాజిటివ్ గా అందులో ఉన్నట్లు తెలిసి వస్తాయి. ఎప్పుడు జగన్ ను వీలైనంత వరకు విమర్శించే ఈ పత్రిక ఒక్కసారిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం ఏమిటని రాష్ట్ర ప్రజలు విపరీతంగా తలలు గోక్కుంటున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తే దీనిలో ఇద్దరికీ పరస్పర లాభం ఉంది అన్న విషయం మనకు బోధపడుతుంది. కొద్ది రోజుల క్రితమే జగన్… సినీ ఇండస్ట్రీ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాలు అన్నింటిలో ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే జగన్ తన రాష్ట్రంలో కూడా పటిష్టమైన చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుపుతున్న విషయం తెలిసిందే. అందుకోసం ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమే చర్చించిన విషయం కూడా అందరికి తెలిసిందే. ఇక చిత్రపరిశ్రమలో రామోజీరావు ఈ యొక్క స్థాయి తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారన్న విషయం తెలియదు కానీ మొత్తానికి ఈనాడు పత్రికలో జగన్ గురించి పాజిటివ్ రిపోర్టులు రావడం మరియు జగన్ నెమ్మదిగా చిత్ర సీమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆదేశాలను…. ఆఫర్లను జారీ చేయడం యాదృచ్చికంగా జరిగింది అయితే కాదు అన్నది నిపుణుల మాట....
5th ఎస్టేట్ న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ పనితీరు : సర్వేలో ఏం తేలిందంటే …!

Srinivas Manem
151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ పని తీరు ఎలా ఉంది…? ముప్పయ్యేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్ పాలనలో తొలిఏడాది పనితీరుపై రాష్ట్ర ప్రజల స్పందన ఎలా ఉంది…? అటు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

సోనూ సూద్ ని రాజకీయాలు వదల్లేదు…!

Srinivas Manem
దేశంలో ఇప్పుడు మార్మోగుతున్న పేరు సోనూ సూద్. పేదోళ్లకు దేవుడిగా.., పెద్దోళ్ళకు ఆదర్శప్రాయుడిగా.., పిల్లలకు హీరోగా… సినిమా వాళ్లకు మార్గదర్శిగా… సోనూ నిలిచిపోయారు. కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సాయం ఏ వ్యక్తి, తన...
5th ఎస్టేట్ న్యూస్

ఈనాడు మెడలో “నమో” భజన బోర్డు…!

Srinivas Manem
  “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించే గాక” ఇది ఈనాడు పత్రిక ఉప శీర్షిక. ఆ సత్యాలేమిటో కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఒక రంగునీ, ఒక పార్టీని మెడలో వేసుకుని కళ్ళు మూసుకుపోయి చెప్పే ఆ...
5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు

ఒక ఎమ్మెల్యే – అనేక ట్విస్టులు …!

Srinivas Manem
ఆయన పార్టీ మారతారట – పుకారు (మే 10 నుండి 20 మధ్య) అవును ఎమ్మెల్యే గారు పార్టీ మారిపోతున్నారు – ప్రచారం (మే 20 నుండి 24 మధ్య) ఈనెల 27 న...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ప్రకాశంలో రాజకీయం సర్దుకున్నట్టేనా…!

Srinivas Manem
రెండు రోజుల కిందటి వరకు ప్రకాశం జిల్లాలో ఒకటే చర్చ..! ఒకటే రచ్చ…! చీరాల వైసీపీ ఇంచార్జి ఎవరు…? పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పార్టీ మారుతున్నారా లేదా…?? గొట్టిపాటి రవికుమార్ పరిస్థితి ఏంటి.....
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

సుప్రీమ్ కా… కేంద్రానికా..? జగన్ మదిలో ఏముంది..? (న్యూస్ ఆర్బిట్ మార్కు విశ్లేషణ)

Srinivas Manem
ఇప్పుడేం చేయాలి..? కేంద్రం వద్దకు వెళ్లి బతిమలాడుకోవాలా…?? సుప్రీం కి వెళ్లి పంతానికి పోవాలా…?? నిమ్మగడ్డతో రాజీకి వెళ్ళాలా…? అసలు నిమ్మగడ్డ ఉన్నంత వరకు స్థానిక ఎన్నికలు ఆపెయ్యాలా…??? ఏం చేయాలి? జగన్ ఆలోచనలు...
5th ఎస్టేట్

జగన్ చేసే పనులకి చంద్రబాబు  సెటైర్ అద్దిరింది గురూ ! 

siddhu
తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని సంపాదించేందుకు మహానాడు ని ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.లాక్ డౌన్ కారణంగా నేరుగా పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో భేటీ కాలేని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లోనే మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దానిని వాయిదా వేద్దాం అనుకుంటే సరిగ్గా జగన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయిన కారణంగా అతని పార్టీని ఎత్తిపొడవడానికి ఇదే సరైన సమయం అని బాబు భావించి ఎట్టిపరిస్థితుల్లో మహానాడుని నిర్వహించాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే పార్టీ ప్రక్షాళన విషయంపై ఫోకస్ చేయడం మానేసి జగన్ సర్కార్ ని ఆడిపోసుకునే<దుకే నేతలు ఎక్కువగా ఇక్కడ సమయం వెచ్చించడం గమనార్హం. ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం పై వెటకారంగా వ్యాఖ్యలు చేసేందుకు ఎప్పుడూ ముందు ఉండే చంద్రబాబు ఈసారి అదే శైలిలో జగన్ ను ‘ది జంగిల్ రాజ్’ అని సంబోధించడం గమనార్హం. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేసిన విమర్శలు ఈసారి కొద్దిగా ఘాటుగా ఉన్నాయి.  అధికారంలోకి వచ్చిన మొదట్లో ప్రజా వేదికను కూల్చేసిన జగన్ తాజాగా జరిగిన మూడు లాంతర్ల స్థంభాల వరకు అనేక కూల్చివేతకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఎద్దేవా చేశారు. జగన్ కి జంగిల్ రాజ్ అన్నా పేరుని ఒక కౌంటర్ గా సిద్ధం చేసుకున్న చంద్రబాబు అతని  సంవత్సరపు పాలనను ఉదాహరణగా చూపిస్తూ అతనికి ఈ పేరు పెట్టానని వివరించారు....
5th ఎస్టేట్

చంద్రబాబు తన ఫోన్ నుంచి డయల్ చేసినా ఎత్తని ఎమ్మెల్యే…!

siddhu
చాలా రోజులు గ్యాప్ తర్వాత బాబు రాష్ట్రం లోకి ప్రవేశించిన వెంటనే వైసీపీ పై ఎదురు దాడి చేసేందుకు మహానాడు ని తల పెడుతున్న ప్రస్తుతం వారి పార్టీలో ఉన్న 23 ఎమ్మెల్యేల లో ఎంతమంది ఉంటారో ఎంతమంది జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇక మహానాడు సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా పాల్గొనవలసి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్స్ పైన చర్చ మరింత జోరందుకుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటివారు తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీ చెంతకు చేరారు. ఇప్పుడు వారితో పాటు మరో ముగ్గురు లైన్ లో ఉన్నారని వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతెందుకు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానల్స్ లోనే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారు అంటూ ఖచ్చితమైన వార్తలు వస్తున్నాయి. పేపర్లలో అయితే కథనాలు బలంగా వినిపిస్తున్నారు. వారిలో ఒకరు ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కాగా మరొకరు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా జగన్ చెంతకు చేరనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే వీరందరిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే పార్టీలోని చాలా కీలక వ్యక్తి. ఈ న్యూస్ తెలుసుకున్న వెంటనే టిడిపి అధినేత రంగంలోకి దిగి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఏలూరు సాంబశివరావు మరియు గొట్టిపాటి రవి వారి నిర్ణయాలను మార్చుకునే ఛాన్సులు ఉన్నా కూడా సత్య ప్రసాద్ విషయంలో మాత్రం చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు అని తెలుస్తోంది. పార్టీలో మహానాడు ప్రారంభించిన నేపథ్యంలో ఇతర నాయకులలో ఉన్న జోష్ అనగాని లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఏకంగా చంద్రబాబు గారు మహానాడులో పాల్గొనేందుకు అనగాని కి స్పెషల్ ఫోన్ కాల్ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు అంటే విషయం అర్థం చేసుకోవచ్చు ఇక అటువైపు నుండి జగన్ కూడా సత్యప్రసాద్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారని వైసిపి వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే రేపల్లె నుండి వైసిపి నాయకుడిగా మోపిదేవి రమణ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోని బలమైన నాయకుడిగా ఉన్న అనగానిని వైసీపీ వైపు వస్తే ఇక ఆ జిల్లాలో తమకు ఎదురే ఉండదు అన్నది జగన్ వ్యూహం. రెండు సార్లు గెలిచి రేపల్లె లో మంచి పట్టు సంపాదించుకున్న అనగాని సత్యప్రసాద్ తో వారి ఓటు బలాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది....
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

టీడీపీ “నాడు – నేడు”

Srinivas Manem
ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది. ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది. తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం....
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ముహూర్తం మారింది… సీఎం దగ్గర ఆగింది…!

Srinivas Manem
టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్ (రేపల్లె), ఏలూరి సాంబశివరావు (పర్చూరు) వైసిపిలో చేరిక వ్యవహారం మొన్న ఉదయం నుండి మీడియాలో బాగా నలిగింది. అన్ని చానెళ్లు, సోషల్ మీడియా.., మా “న్యూస్ ఆర్బిట్” సహా...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఇద్దరు ఈరోజు… మరో ఇద్దరు త్వరలో…!

Srinivas Manem
బాబుని ఒంటరి చేయాలి. ప్రతిపక్ష హోదా లాగేయ్యాలి. టీడీపీ కి భవిష్యత్తు లేకుండా చేయాలి. ఆ కులంలో మనకు అనుకూలంగా ఉన్నవారిని లాగేసి, మిగిలిన వారిని ఒంటరిగా మార్చేయాలి. ఇవే… అచ్చంగా ఇవే జగన్...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

వెంకన్న భూములపై కప్పదాట్లు…!

Srinivas Manem
తిరుమల వెంకన్న ఆస్తులకు రక్షణ దొరికింది. ఆయన భూములను ఆయనే రక్షించుకున్నట్టే…! నాడు 2016 లో టిడిపి ప్రభుత్వంలోనే టిటిడి బోర్డు అమ్మకానికి పెట్టింది అంటూ… నేడు వైసిపి ప్రభుత్వంలో టిటిడి బోర్డు అదే...
5th ఎస్టేట్

పత్రికలు బేజారు.. సిబ్బంది బజారు…!

Srinivas Manem
కరోనా కాలం పత్రికలను ముప్పు తిప్పలు పెడుతుంది. తెలుగునాటనే కాదు, దేశ వ్యాప్తంగా పత్రికలు తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈ రెండు నెలల్లో దాదాపు రూ. 25 వేల కోట్లు నష్టపోయామని, ఆదుకోవాలని పత్రికల...
5th ఎస్టేట్

వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే గుమ్మం దగ్గరకి సరుకులు!

siddhu
  కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ మొదలైన తొలినాళ్లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సంశయించేవారు. ఒకేసారి ఒక్కరే బయటికి వెళ్లి 4 రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకుని ఇంట్లోనే కాలం గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సడలింపులు ఇచ్చిన తర్వాత అసలు కరోనా అన్న పదమే మాకు తెలియదు అన్నట్లు రోడ్ల మీద ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. సాయంత్రం వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడం మరియు ప్రజలు ఒకే చోట గుమిగూడి, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా షాపింగ్ లంటూ తిరుగుతూ ఉండటం కూడా గత వారం పది రోజులుగా కామన్ అయిపోయింది. అయితే రెడ్ జోన్స్ మరియు కంటెంట్ క్లస్టర్స్ ఉన్న ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ సమయంలోనే ఆన్ లైన్ సేవలను వారి ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో ఈ కార్ట్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో మార్ట్ సేవలను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ముంబై, పూణే లలో  మాత్రమే జియో మార్ట్ సేవలను ప్రారంభించారు. అయితే కొద్ది కాలంలోనే ఆ సేవలు విస్తరించేందుకు జియో సంస్థ తన ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీంతో దేశవ్యాప్తంగా 200 పట్టణాలలో ప్రస్తుతం జియో సేవలు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫేస్ బుక్…. జియో లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త కొద్దిరోజుల ముందే దేశవ్యాప్తంగా హల్ చల్ చేసింది. ఇప్పుడు దీనివల్ల వాట్సాప్ ద్వారా జియో మార్ట్ సేవలను వినియోగదారులు పొందే అవకాశం లభించింది. మనం రోజు మెసేజింగ్ మరియు స్టేటస్ అప్ లోడ్ చేసుకునేందుకు ఉపయోగించే వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన సరుకులను ఆర్డర్ చేస్తే కొద్ది గంటల్లోనే మన ఇంటి వద్దకే సరుకులను డెలివరీ చేస్తారు. అయితే జియో లో ఫేస్బుక్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ సంస్థలు కూడా భారీ ఎత్తున వాటాలను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో త్వరలో జియో మార్ట్ సేవలను దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం…? ఈ వాట్సాప్ నెంబర్ ను జియో మార్ట్ కు లింక్ చేసి మీ పట్టణంలో ఈ సేవలు పొందవచ్చో కూరగాయలను డోర్ డెలివరీ చేయించుకోచ్చో లేదో చెక్ చేసుకోండి....
5th ఎస్టేట్

40 ఇయర్స్ ఇండస్ట్రీ గారికి క్వారంటైన్ లేదా మాస్టారు?

siddhu
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తన సొంత రాష్ట్రానికి దూరమై అచ్చంగా 68 రోజులు అవుతోంది. ఇకపోతే ఈ రోజునే బాబుగారు ఆంధ్రాలో ల్యాండ్ అయి నేరుగా అమరావతి లోని తన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన విశాఖ ఎల్జి దుర్ఘటన బాధితులను పరామర్శిస్తారు అని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా నేరుగా వెంటనే అమరావతి లోని తన స్వస్థలానికి వెళ్లి ఇంటిలో సేద తీరుతారు. అయితే ఇదంతా మీడియా ద్వారానే తెలిసింది తప్ప ఏపీ ప్రభుత్వం ఏమీ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయితే తెలంగాణ డిజిపి కి చంద్రబాబు తన పర్యటన గురించి తెలియజేయగా ఆయన అనుమతి ఇచ్చాడని అంటున్నారు. ఇక ఆంధ్ర తరపు నుండి కూడా నిజంగా చంద్రబాబు అనుమతి కోరితే పర్యటనుకు తప్పక అనుమతిస్తామని కూడా అన్నట్లు కొందరి నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాబు ఏపీకి రావాలని ఇలా దాగుడుమూతలు ఆడుతున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు ఏపీ పర్యటనకు వస్తే దానిపైన అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని  మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. మొత్తానికి బాబు అయితే నేరుగా అమరావతి లోని తన ఇంటికి వెళ్లారు కానీ తన పర్యటన విషయమై ఏపీ డిజిపి మాత్రం ఇంకా ఆమోదం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రం నుండి సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అదీ కూడా రోజుకి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న హైదరాబాద్ నుండి. రెండు తెలుగు రాష్ట్రాలు కోవిడ్ 19 నివారణ విషయమై విధించుకున్న కొన్ని రూల్స్ ప్రకారం ఆ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినా లేదా ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి వెళ్లిన 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి లేదా ప్రభుత్వం వారి పర్యవేక్షణలో క్వారంటైన్ లో అయినా తప్పక ఉండాలి. వందలాది మంది ప్రజలు ఇప్పటికీ అలాగే చేస్తూ ఉన్నారు కూడా అయితే ఒకవైపు మహానాడుని బాబు అతి త్వరలో నిర్వహించాలని భావిస్తుండగా అందుకు తగిన ఏర్పాట్లు చేసే సమయంలో క్వారంటైన్ ను ఏం పాటిస్తారు అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క వైసీపీ మంత్రులు మాత్రం బాబు వస్తే కచ్చితంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందే అని నొక్కి వక్కాణిస్తుండడా ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరి దీనికి బాబు ఒప్పుకుంటారా లేదా అన్నది వేచిచూడాలి. ఇక పోతే రాష్ట్రంలో రాజకీయానికి ఇదే సరైన సమయమని ఏపీకి వచ్చిన ఆయనకు తన పర్యటనకు అనుమతి ఇవ్వకపోయినా.. సెల్ఫ్ క్వారంటైన్ చేయమని అతనిపై ఒత్తిడి పెంచినా నానాయాగీ చేస్తారన్నది 40 ఏళ్లుగా బాబు ని చూస్తున్న వారెవరికైనా అర్థమయ్యే విషయం. అసలు ఇంత వాదన ఏమిటి? ఇది ప్రభుత్వం నిర్ణయం…. అతి సామాన్య ప్రజల నుండి మాజీ ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన నిబంధనలు అని ఆదేశాలు జారీ చేయకుండా రాజకీయ కోణంలో ఇంత బుజ్జగింపు ఏమిటన్న విషయం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు రుచించడం లేదు....
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ప్రతిపక్ష హోదా ఇలా లాగేద్దాం…!

Srinivas Manem
చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్నది వైసిపి వ్యూహమని ప్రత్యేకంగా చెప్పే పని లేదు. నిజానికి టిడిపి ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని జగన్ వ్యూహం కాదు. టిడిపి కి కనీసం 40 ,...
5th ఎస్టేట్

రాజకీయ చదరంగం లో అత్యంత కీలక ‘పావు’ ని కదిపిన జగన్…!

siddhu
  రాజకీయాల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటో జగన్ కు బాగా తెలిసొచ్చింది. తన పాలన పట్ల విశ్లేషకుల అభిప్రాయంఎలా ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం తనకంటూ మంచి పేరు సంపాదించుకునేందుకుచాలా పాట్లు పడ్డాడు. జగన్ ఎన్నికల్లో గెలిచి ఏడాది. తన పాలనలో చేసిన తప్పులే చివరికి తనకి చంద్రబాబుకి ప్రతికూలతలుగా మారి జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ను ప్రజలు ఇచ్చేశారు. మరి అతను ఆ ఛాన్స్ను సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడా…. లేదా? ఇవన్నీ పక్కన పెడితే ముందు జగన్ ను అతని తండ్రి వైయస్ తో, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ తో, మాజీ సీఎం చంద్రబాబు తో పోల్చడం అనవసరం. జగన్ లెక్క వేరు.. అతనికున్న తిక్క వేరు. వారిలో ఎవరూ16 నెలల పాటు జైల్లో కాలం గడపలేదు. అలాగే సొంత పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు వరుసగా విపక్షం లో ఉండి ఆటుపోట్లు పడి పైకి రాలేదు. కచ్చితంగా చెప్పాలంటే అతనికి అధికారం ద్వారా వెన్నుపోటు రాలేదుమరియుఅతను ఏ పార్టీని హైజాక్ చేయలేదు. ఇక కెసిఆర్ లాగా సెంటిమెంట్ తో ధనిక రాష్ట్రం ఏమి పట్టలేదు. అతనికి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓనమాలు దిద్దించడానికి పెద్ద వారు ఎవరూ లేరు. అటువంటి వ్యక్తి కొన్ని విషయాల్లో కటువుగా ఉంటే ఏమైపోతుంది అన్నది అతని మద్దతుదారుల అందరి వాదన. అంతెందుకు మొన్న ఒకరోజు హైకోర్టు ఐదారు అంశాలమీద జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకతీర్పు ఇచ్చింది. ఒక వైద్యుడి అరెస్టు అంశాన్ని ఏకంగా సిబిఐ కి అప్పగిస్తూ ఈ ప్రభుత్వం తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద విషయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్మాజీ డిజిపి యొక్క సస్పెన్షన్ ను ఎత్తివేయడం, ప్రభుత్వ భూముల విక్రయం పై నోటీసులు జారీ చేయడం, ప్రభుత్వ భవనాల రంగుల జీవో ను కొట్టివేయడం వంటివి ఎన్నో ఆదేశాలను జారీ చేసింది. వైసీపీశ్రేణులు అయితే అసహనంతో ఊగిపోయి ఏకంగా హై కోర్టు తీర్పు పై సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తీరు కూడా చూశాం. అయితే ఇక్కడే జగన్ సంయమనం పాటిస్తూ తన రాజకీయ చతురతను ఉపయోగించాడు. ప్రస్తుతం నడుస్తున్నది లాక్ డౌన్ కాబట్టి పరిస్థితి అంతా ఆకలి బాధలతో అల్లాడిపోతున్నారు. ఈ సమయంలోహైకోర్టు పై విమర్శలు చేయడం లేదా సుప్రీం కోర్టుకి పంతం నెగ్గించుకునేందుకు వెళ్లడం వంటి అవసరమైన పనులు చేయకుండా ప్రజలకు ఏం కావాలో అవే చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ టార్గెట్ చేసిందిసంక్షేమ కోణం. అనుకున్నంత ఆదాయం లేని రాష్ట్రాన్ని చంద్రబాబు చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. దానికి తోడు మితిమీరి చేసిన ఎన్నికల వాగ్దానాలు. ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేసిన కరోనా ప్రభావం. వీటన్నింటి మధ్య జగన్ తాను ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే మామూలు విషయం కాదు. కానీ నీ కష్టమో నష్టమో…. జగన్ మాత్రం పట్టువదలకుండా అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం,వాహనమిత్ర, విద్య దీవెన, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జీతాలు, వాలంటీర్లకు జీవితాలు, నేతన్న నేస్తం, విద్య దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలను ఈ ఏడాదిపొడుగునా కొనసాగించడం చిన్న విషయం అయితే కాదు. ఈ సంక్షోభ సమయంలో ప్రతి కుటుంబం ఖాతాలోకి డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుంది. దీంతో జగన్ ప్రజలకు చాలా కనెక్ట్ అయిపోయాడు ఎన్నికల ప్రణాళికను చెప్పిన విధంగా అనుసరిస్తూ తానురాజకీయంగా బలంగా ఈ రాష్ట్రంలో పాతుకుపోవడానికి ఇదే సరైన మార్గం అనుకున్న జగన్ తన ఆలోచన శైలితో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. విపక్షాలు మరియు అతని వ్యతిరేకులు ఎంతఏడ్చినా జగన్ ఆడిస్తున్న రాజకీయ చదరంగంలో వారి గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు....
5th ఎస్టేట్

హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా…! ఇక మామూలు జనం పరిస్థితి చూస్తే….

siddhu
  భారతదేశంలో కరోనా విజృంభణ నానాటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బతో ప్రపంచం అంతా ఎలా విలవిలలాడుతోందో గత రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే దేశంలోని నగరాలలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి మహానగరాలలో విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఇక పోలీసులు అయితే ప్రస్తుతం వచ్చిన లాక్ డౌన్ సడలింపుల తో అటు ప్రజలను కంట్రోల్ చేయలేక… ఇటు తమని తాము రక్షించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నమోదయ్యే కేసుల్లో 95% జిహెచ్ఎంసి పరిధిలో ఉండటం గమనార్హం. ఇకపోతే హైదరాబాద్ పోలీసులు ఈ మహమ్మారి బారిన పడకుండా అహర్నిశలు కష్టపడుతూ విపరీతంగా తినిపిస్తూ ఉండగా ఈ కొద్ది కాలంలోనే మరే డిపార్ట్మెంట్ కు రానంత పేరు ప్రఖ్యాతులు వీరికి దక్కాయి. అయితే ఈ విపత్తి వేళ విరుచుకుపడే ముప్పుకి అడ్డుగా నిలిచి డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది అనే చెప్పాలి. ఒకే రోజులో ముగ్గురు పోలీసులకు కరోనా సోకడాం ఒక ఎత్తు అయితే అందులో ఇద్దరూ అధికారులు ఉండడం అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. శుక్రవారం నమోదైన కేసులో ముగ్గురు హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. వారిలో ఒకరు ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉంటే మరొకరు ఎస్ఐ స్థాయిలో ఉన్నారు. ఇంకొకరు కానిస్టేబుల్. ఇదిలా ఉండగా అటు హైదరాబాద్ పరిధిలో ఉండే సామాన్య ప్రజల తీరు కూడా పోలీసులను మరింత ముప్పు కు గురి చేస్తోంది. జంటనగరాల్లో రోజుకి సరాసరిన 40 కేసులు నమోదు అవుతుండగా ఇంకా విస్తృత స్థాయిలో టెస్టులు చేపట్టని నేపథ్యంలో ప్రజలు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సింది పోయి రోడ్డు మీదకు వచ్చి వైరస్ వ్యాప్తికి తోడ్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కా చోట అని కాకుండా సిటీ నలుమూలల లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం ఆందోళన పరిచే విషయం. ఇదిలా ఉండగా తాజాగా మొన్ననే ఒక హైదరాబాద్ పోలీసు కరోనా వైరస్ వల్ల మృతి చెందగా తాజాగా నమోదవుతున్న కేసుల్లో ప్రతి ఒక్కరూ తమ డ్యూటీ నిర్వహిస్తూనే వైరస్ బారిన పడుతున్నారు. పైన చెప్పుకున్న ముగ్గురిలో ఇద్దరు గాంధీ ఆసుపత్రి వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో హైదరాబాద్ మహానగరంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ.. అనూహ్యంగా పోలీసులు బాధితులుగా మారటం ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది.రక్షకులుగా నిలుస్తున్న పోలీసులకు పాజిటివ్ గా తేలడం మరియు ప్రజలు ఇవేవీ పట్టనట్లు రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిరగడం చూస్తుంటే హైదరాబాద్ మహానగరం రానున్న రోజుల్లో ఇంకెంత మృత్యుఘోష అనుభవిస్తుందో తల్చుకుంటేనే భయంగా ఉంది....
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

విజయ వార్షికం…! స్వీయ తప్పిదమే విపక్షం…!

Srinivas Manem
175 లో 151 సీట్లు… ఓ తిరుగులేదు.., జగనుడికి ఎదురే లేదు అనుకోని ఏడాదయ్యింది…! 175 లో 23 స్థానాలు… ఇక ఎదగడం కష్టమే… చంద్రబాబుకి రోజులు లేవు అనుకుని ఏడాదయ్యింది…! ఆ 151...
5th ఎస్టేట్ టాప్ స్టోరీస్

నిద్దరలో న్యాయవిభాగం…!

Srinivas Manem
జగన్ గారూ మీ చుట్టూ ఉన్న బృందం ఎక్కడ..? భజనలు చాలు వ్యూహాలు సిద్ధం చేయమను…! మీ దగ్గర ఉన్న న్యాయ విభాగం ఎక్కడ…? నిద్దర చాలు లేచి కోర్టులో వాదించమను…! మీరు నియమించుకున్న...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ప్రకాశంలో ఏం జరుగుతుంది…!

Srinivas Manem
రాష్ట్రంలో 12 జిల్లాల్లో రాజకీయం ఒకలా ఉంటే ఆ ఒక్క జిల్లాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది…! ఎన్నికలు ఉన్నాయా? లేవా..? రాజకీయ సమయమా…? కాదా..?? అనేది సంబంధం లేదు. ఆ జిల్లాలో...
5th ఎస్టేట్

ఆత్మ ‘నిర్భర’ భారత్ కి ఆత్మ ‘నిబ్బరం’ ఎవడిస్తాడు? 

siddhu
  20 లక్షల కోట్లు… ఇంత మొత్తం దేశం కరోనాను ఎదుర్కునేందుకు సహాయార్థం గా కేంద్రం ప్రకటిస్తే ప్రతి ఒక్క భారతీయుడు ముక్కున వేలు వేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా మన కోసమేనా మనలను ఈ క్లిష్టతరమైన పరిస్థితి నుంచి బయటపడడానికేనా అని ఆశ్చర్యపోయారు…. ఆనందపడ్డారు. కట్ చేస్తే అంతటి బృహత్తర ప్యాకేజీని డైలీ సీరియల్ లా ప్రకటిస్తూ చాలా హంగామా చేశారు. చిన్న చిన్న విషయాలను బోలెడంత డప్పు కొట్టుకుని బిజెపి శ్రేణులు తమ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. చివరికి చూస్తే అవి రుణాలు గా ప్రజలకు అందుబాటులో ఉండే డబ్బు తప్పించి మన ఖాతాలోకి చిల్లిగవ్వ కూడా రాదు అన్న విషయం అర్థం అయిపోయింది. ఇక ఈ మధ్యలో మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆమెలో ఒక రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలు కనిపించకపోగా ఒక బ్యూరోక్రాట్ పాత్రను ఇన్నిరోజులు పోషించింది. సరే చివరికి ఈ ఐదు రోజుల సీరియల్ ప్రకటనలో జనానికి కనెక్ట్ అయ్యే అంశం ఒక్కటైనా ఉందా అంటే…. అదీ లేదు. కరోనా కష్టాల్లో ఉండి ఉపాధి కోల్పోయి.. తినడానికి అన్నం దొరక్క…. భవిష్యత్తుపై ఎలాంటి భరోసా లేకుండా ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూసే జనాలకు ఐదు రోజులు బడ్జెట్ ప్రసంగం వినిపించింది. కొన్ని అంశాలను అయితే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక ఎప్పటి నుండో కేంద్ర పాలనకు అలవాటు పడిపోయి కొద్దిగా అనుభవం ఉన్నవారు అయితే మోడీ తన ఖజానా నుంచి ప్రజలకు ఏమీ రాదు అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఈరోజున పేదలే కాదు మధ్యతరగతి వారు కూడా ఎదురు చూస్తున్నది ఆర్థిక సహాయం. అయితే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించాక చివరికి అందులో కొంత భాగం అయినా తమకు ఉపయోగకరంగా మారుతుందని విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమైంది కేంద్రం. కేంద్రం ఆదాయం తగ్గింది సరే…. రాష్ట్ర స్థితిగతులు కూడా ఘోరంగా ఉన్నాయి దానికి ఒప్పుకుందాం. కానీ ఏదో ఒక మార్గంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానిదే కదా కెసిఆర్ వంటి ముఖ్యమంత్రులు కొన్ని సూచనలు ఇచ్చారు. భారీ కరెన్సీ ముద్రణ, హెలికాప్టర్ మనీ వంటి సాహసాలకు మోడీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎఫార్బీం పరిమితి పెంపు మాత్రమే రాష్ట్రాలకు ఉన్న ఏకైక ఉపశమనం. మోడీ అంత పెద్ద ప్యాకేజీని ప్రకటించే నాడే ముఖ్యాంశాలు చదివి వినిపించకుండా అందులో తాను చెప్పడానికి ఏమీ లేదు.. ఆ సంగతేదో నువ్వే చూసుకో.. ఆ తిట్లు ఏదో నువ్వే పడు అన్నట్లు నిర్మలాసీతారామన్ చేతికి అంతా ఇచ్చినపుడే మనం అర్థం చేసుకునే ఉండాల్సింది… ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటే గుండె నిబ్బరం చేసుకొని అన్ని ఆశలు చంపుకొని కాలం వెళ్లదీయడమే అని....
5th ఎస్టేట్

“మహా నటుడు” సినిమా తీసేయచ్చు అయ్యా మోడీ నీ మీద 

siddhu
  కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగానే బిజెపి మద్దతుదారులు అంతా ఆహా…. ఓహో.. అని ప్రభుత్వాన్ని ఒక రేంజ్ లో ఎత్తేసారు. అయితే మోడీ ఆ ప్రకటన చేసిన మరునాడే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కరోజులో వివిధ రకాల ప్రయోజనాలను వెల్లడించవచ్చు కానీ దాని వల్ల తమ పార్టీకి లభించే ప్రచారం ఒక్క రోజు తోనే ఆగిపోతుంది. ఇలా సీరియల్ తరహాలో ఒక్కొక్కటిగా వెల్లడించడం వల్ల ప్రభుత్వ పథకాల పై చర్చ జరిగి మైలేజీ గరిష్టస్థాయిలో లభిస్తుంది. సరే ఎలాగోలాగా వాటిని స్పష్టంగా వెల్లడించినా పర్వాలేదు కానీ ఆర్థిక సహాయం? ఎంత అప్పు రూపాలు ఎంత? అన్న విషయంపై నిర్దిష్టమైన స్పష్టత లేకుండా చాలా తెలివిగా వ్యవహరించడం పైన ఇప్పుడు విపరీతమైన చర్చ నెలకొంది. ప్యాకేజీ మొత్తం కేంద్ర సాయం కాదు…. రుణ సదుపాయం మాత్రమే అని ఎప్పుడో అర్థమైంది. ఆ అంశాన్ని విడదీసి చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించకుండా నగదు లభ్యత ను నగదు పంపిణీ గా ప్రజలు భావించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నా అజెండా ఒక్కటే…. కష్టకాలంలో కనీసం అప్పు లభించినా చాలనుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని డబ్బు కోణంలోనే చూస్తోంది. ప్రజలకు విద్య వైద్యం అందించి వారి కాళ్లపై వారు నిలబడేందుకు దోహదపడటం వంటి పనులు చేయడం ఎప్పుడో మానేసింది. ప్రజలు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వంపై ఆధారపడేలా పరిస్థితిని మార్చి వేస్తున్నాయి.. తద్వారా తాము అధికారంలో ఉన్నన్ని రోజులే మీకు మేలు జరుగుతుంది అన్న భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి..  లాక్ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అవసరానికి మించి నగదు పంపిణీ చేయడంతో ఇప్పుడు వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం దగ్గర నిధులు ఉండటం లేదు. ఇక కరోనా వంటి అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కుదేలు అయిపోయేది మధ్యతరగతి వర్గం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంక్షేమం పేరిట చేస్తున్న చేస్తున్న విచ్చలవిడి వ్యయానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కాబట్టి ఈ సమయంలో మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ఏ రూపంలో నిధులు దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు మరియు చోటా ఉద్యోగాలు చేసుకొనే వారు విపరీతంగా దెబ్బతిన్నారు. కానీ ఇవన్నీ తెలియనట్లు తమ 20 లక్షల కోట్ల రూపాయలతో ఇప్పుడు దేశం మొత్తం నడుస్తుంది అన్నట్లు మోడీ చేసిన ప్రకటన ఇప్పుడు అతను ఎంత పెద్ద నటుడో అందరికీ తెలియజేస్తుంది. గట్టిగా మాట్లాడితే 20 లక్షల కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వంపై నేరుగా పడే భారం నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా. కాబట్టి మోడీ ఇకనైనా తన సాధారణ ప్రదర్శనను ఆపి ప్రజలకు జరుగుతున్న పరిస్థితులను గురించి వివరంగా తెలపడం మంచిది....
5th ఎస్టేట్

జనాలకు ఏమి తెలీదట… స్పృహ లేదట…! ఇదీ రాధాకృష్ణ తాజా ఏడుపు

Srinivas Manem
“ప్రజలకు అంత జ్ఞాపక శక్తి ఉండదు, అవగాహనా ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో పౌర సమాజంలో స్పృహ లేదు…” ఇవీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా ఏడుపు. వారానికో కొత్త వంటతో అక్షరాలా వంట వండే రాధాకృష్ణ...
5th ఎస్టేట్

కరోనా కేకల కంటే గట్టిగా వినపడుతున్న ‘ వివక్ష అరుపులు ‘ 

siddhu
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా మయం. ఏ నోట చూసినా అదే పేరు. లాక్ డౌన్ అనే ఒకే ఒక ఆప్షన్ తో ప్రపంచ దేశాలన్నీ దానిని అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఉండగా ఎంతోమంది అభాగ్యులు...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

వర్గం… వరం… మోడీ మంత్రం…!

Srinivas Manem
నిర్మలమ్మది ఎంత నిర్మలమైన మనసో… మోడీది ఎంత ముచ్చటైన మాటో… కేంద్రానిది ఎంత జాలి హృదయమో…! అబబబబ్బబ్బా ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏంటి..? దేశానికి ఉదారంగా ఇచ్చేయడం ఏంటి..? పేదల పట్ల...