అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

Share

అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు సీఎంతో సమావేశమయ్యారు. జగన్ తో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు.

బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు కల్పించాలని రైతులు సీఎం జగన్‌ను కోరాగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. 10 రోజుల్లో  భూసేకరణ ఆదేశాలు ఉపసంహరించాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు ఆర్కే తెలిపారు.మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో బలవంతంగా భూసేకరణ చేశారనీ,  అయిదు వేల ఎకరాల భూసేకరణ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారనీ వివరించారు. మంగళగిరి-తాడేపల్లి నీటి పథకాలకు ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించాలని జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆర్కే తెలిపారు.

పలువురు రైతులు మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్లు అన్నీ తొలగిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని జగన్‌ భరోసా ఇచ్చారని తెలిపారు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

58 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

6 hours ago